E-Paper
Advertisement

వరంగల్ కాంగ్రెస్‌లో ‘ఢీ’ అంటే ‘ఢీ’.. కడియంపై టీపీసీసీకి మంత్రి సురేఖ ఫిర్యాదు

వరంగల్ కాంగ్రెస్‌లో ‘ఢీ’ అంటే ‘ఢీ’.. కడియంపై టీపీసీసీకి మంత్రి సురేఖ ఫిర్యాదు
Advertisement

Konda Surekha: ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై పార్టీ క్రమశిక్షణా కమిటీతో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మంత్రి కొండా సురేఖ పార్టీ అధిష్టానాన్ని కోరారు. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిసి కడియంపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి నుంచి తనకు ఎదురవుతున్న ఇబ్బందులు, దేవాదాయ శాఖ మంత్రిగా తన అధికార పరిధిని ప్రశ్నించేలా ఇటీవల ఆయన వ్యవహరించిన తీరును ఆమె వివరించారు.

దేవాదాయశాఖ మంత్రిగా సీఎం రేవంత్ అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా సురేఖ అన్నారు. అయినప్పటికీ స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి దేవాదాయశాఖ మంత్రి అయిన తనకు సమాచారం ఇవ్వకుండా హైదరాబాద్ లోని దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయానికి వెళ్లారని అన్నారు. ఈ నెల 6న ఆ శాఖ డైరెక్టర్ తో పాటు ఇతర అధికారులను సమావేశపరిచి దేవాలయాల అభివృద్ధిపై అధికారిక సమీక్ష నిర్వహించినట్లు గుర్తుచేశారు.

Advertisement

ఎమ్మెల్యేకు దేవాదాయశాఖ పరిధిలో సమస్యలు ఏమైనా ఉంటే మంత్రిగా తన దృష్టికి తీసుకురావాల్సిందని కొండ సురేఖ అన్నారు. కానీ అలా చేయకుండా ఆలయాల మాస్టర్ ప్లాన్ల రూపకల్పన, ప్రత్యేక అధికారుల బృందం ఏర్పాటు, అభివృద్ధి పనుల ప్రతిపాదనలు సిద్ధం చేయడం, ఆలయ భూముల పరీరక్షణకు చర్యలపై అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. ఇవన్నీ శాఖ పరిపాలనా పరిధిలో మంత్రి స్థాయిలో నిర్వహించాల్సిన అంశాలని టీపీసీసీ చీఫ్ కు వివరించారు.

దేవాదయ శాఖ మంత్రిని పూర్తిగా విస్మరించి సమావేశం నిర్వహించడం ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థలో అనుచిత సంప్రదాయానికి నాంది పలికే చర్య అవుతుందని సురేఖ అభిప్రాయపడ్డారు. గతంలో కూడా తన రాజకీయ, వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశంతో కడియం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులను రెచ్చగొట్టి తనపై దుష్ప్రాచారం జరిగేలా ప్రయత్నాలు చేసినట్లు ఆరోపించారు.

Advertisement

Also Read: BSNL మహా అద్భుతం.. ఏకంగా రూ.1.34 లక్షల ఫోన్ లాంచ్.. ప్రత్యేకత తెలిస్తే ఫ్యూజులు ఔట్!

ఈ వ్యవహారంపై పార్టీ స్థాయిలో ప్రభుత్వ స్థాయిలో సమగ్రంగా పరిశీలించాన్నారు. మంత్రుల రాజ్యాంగ బద్ద అధికారాలను గౌరవించేలా కడియంకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని కోరారు. కాగా సురేఖ ఫిర్యాదుపై టీపీసీసీ చీఫ్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. కడియంతో ఉన్న సమస్యను సమగ్రంగా పరిశీలిస్తామని, సంబంధిత అంశాలపై తగిన స్థాయిలో చర్చించి న్యాయమైన పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు.

Also Read: హోటళ్లలో తెల్లటి బెడ్‌షీట్లే ఎందుకు వాడతారు? దీని వెనుక ఉన్న ‘సీక్రెట్’ ఇదే!

Related News

తెలంగాణ నుంచి మూడు హైస్పీడ్ ట్రైన్ రూట్స్.. కేంద్రమంత్రి కీలక ప్రకటన

గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ సంచలనం.. కేసీఆర్‌కి బీజేపీకి అంటే భయం అందుకే..?

అంగన్‌వాడీ సిబ్బందికి.. తెలంగాణ సర్కార్ భారీ గుడ్ న్యూస్?

రాహుల్‌కి అనుకూలంగా ఉంటేనే ప్రజాస్వామ్యమా? కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

ఆర్టీసీ సంఘం ఎన్నికల్లో 98శాతం పోలింగ్..గెలుపు దిశగా ఎంప్లాయీస్‌ యూనియన్‌ ?

జోగులాంబ గద్వాల జిల్లాలో సాగునీటి సంక్షోభం.. ఎండిపోతున్న పంటలు!

సూపర్ మార్కేట్‌లో షాపింగ్ చేస్తున్నారా.. అయితే బీ కేర్ ఫుల్..?

సైదాపూర్‌లో దారుణం.. మూగ పిల్లలున్న ఒంటరి మహిళపై కర్రలతో దాడి!

Big Stories

Advertisement
×