Rappa Rappa : నీ యవ్వ తగ్గేదేలే.. రప్పా రప్పా నరుకుతాం.. తొక్కి పడేస్తాం.. అంతు చూస్తాం.. ఏపీలో ఇప్పుడు ఇదే రచ్చ. రప్ప రప్ప రాజకీయం ఫుల్ కాక మీదుంది. కార్యకర్తల ఓవరాక్షన్‌ను వైసీపీ అధినేత జగన్ సైతం సమర్థించడంతో వివాదం మరింద ముదిరింది. సినిమా డైలాగే కదా.. అలా అంటే తప్పేంటంటూ కేడర్‌ను వెనకేసుకొచ్చారు. ఇలాంటి మాటలు, చర్యలతో సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారంటూ వైసీపీపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు, నారా లోకేశ్‌లు సైతం జగన్‌కు ఇచ్చిపడేశారు. ఇలాంటి డైలాగులు సినిమాల్లోనే బాగుంటాయి.. బయట కాదమ్మా అంటూ పవన్ కల్యాణ్ సైతం ఫైర్ అయ్యారు. ఏపీలో హాట్ టాపిక్‌గా మారిన రప్పా రప్పా డైలాగ్ ఇప్పుడు తెలంగాణలోనూ ఎంట్రీ ఇచ్చింది. బీఆర్ఎస్ నేతలు ప్రదర్శించిన ఆ ఫ్లెక్సీ కలకలం రేపుతోంది.
బీఆర్ఎస్ రప్ప రప్ప..
రైతు భరోసాపై పోరు బాట పట్టింది బీఆర్ఎస్. సంగారెడ్డి జిల్లా జిన్నారంలో సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు రైతు ధర్నా నిర్వహించారు. ఆ ధర్నాకు హాజరైన ఓ బీఆర్ఎస్ నేత ప్రదర్శించిన ప్లకార్డు ఇప్పుడు కాంట్రవర్సీగా మారింది. హరీశ్‌రావు ఫోటోలతో ఉన్న ఆ ఫ్లెక్సీలో… “2028లో రప్ప రప్ప.. 3.0 లోడింగ్..” అని రాసుంది. అలాంటి బోర్డులను పట్టుకుని రైతు ధర్నాలో పాల్గొన్నారు స్థానిక బీఆర్ఎస్ నేతలు. 2028 రప్ప రప్ప.. అంటే ఏంటి అర్థం? ఏపీలో వైసీపీ మూకలు అన్నట్టుగానే నరుకుతాం.. తొక్కి పడేస్తాం.. అంతు చూస్తాం.. అని వార్నింగ్ ఇచ్చారని అనుకోవాలా?
రప్ప రప్ప అని ఎవరికి వార్నింగ్?
స్థానిక బీఆర్ఎస్ నేత ప్రదర్శించిన ఈ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రప్ప రప్ప వైరస్ ఏపీ నుంచి తెలంగాణ రాజకీయాల్లోకీ ఎంట్రీ ఇచ్చిందా? అంటూ కామెంట్స్ వస్తున్నాయి. అయితే, బీఆర్ఎస్ నేతలు కాస్త పద్దతిగా పెట్టారు ఆ ఫ్లెక్సీ. వైసీపీ కార్యకర్తల మాదిరి నరుకుంతాం.. తొక్కుతాం.. అంటూ రెచ్చగొట్టే డైలాగ్స్ లేకుండా.. 3.0 లోడింగ్ అంటూ స్మూతర్ వే లోనే ఉందంటూ కారు పార్టీ సపోర్టర్స్ సమర్థించుకుంటున్నారు. రప్ప రప్ప.. అనే డైలాగ్‌లోనే నరుకుతాం.. చంపేస్తాం.. అనే మీనింగ్ ఉంది. ఆ పదాలు వాడారంటేనే వార్నింగ్ ఇచ్చినట్టు లెక్క. ఇక ఇంకేం పద్దతి..పాడు.. అంటూ కౌంటర్లు పడుతున్నాయి. అధికారం కోల్పోయిన ఫ్రస్టేషన్‌లో గులాబీ నేతలు దౌర్జన్యాలకు దిగుతారా? అధికార పార్టీనే బెదిరిస్తున్నారా? రప్ప రప్ప.. అని ఎవరిని రెచ్చగొడుతున్నారంటూ ఆ ఫ్లెక్సీ చుట్టూ కాంట్రవర్సీ నడుస్తోంది. మరి, ఏపీలో మాదిరే.. తెలంగాణలోనూ ఆ ప్లకార్డు ప్రదర్శించిన వారిపై కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారా? జైలుకు పంపిస్తారా?
Also Read : కవిత ఫోన్ కూడా ట్యాపింగ్?.. సీబీఐకి కేసు?