RK Sagar : నటుడు ఆర్.కే సాగర్ (R.K Sagar) అంటే గుర్తుపట్టకపోవచ్చు కానీ, ఆర్ .కే నాయుడు (R.K Naidu) అంటే మాత్రం అందరూ టక్కున నటుడు సాగర్ ను గుర్తుపడతారు. బుల్లితెరపై ప్రసారమైన మొగలిరేకులు (Mogalrekulu) సీరియల్లో ఆర్ కే నాయుడు పాత్రలో నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు నటుడు సాగర్. ఇలా ఈ సీరియల్ ద్వారా వచ్చిన గుర్తింపుతో ఈయన సినిమా అవకాశాలను అందుకున్నారు. మొదట ఈయన ప్రభాస్ హీరోగా నటించిన మిస్టర్ ఫర్ఫెక్ట్ సినిమాలో ఒక సన్నివేశంలో నటించారు. అనంతరం సిద్ధార్థ, షాది ముబారక్ వంటి సినిమాలలో నటించారు కానీ ఈ సినిమాలు పెద్దగా ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేకపోయాయి.
ఐపీఎస్ ఆఫీసర్ విక్రాంత్..
ఇలా సాగర్ నటించిన సినిమాలు సక్సెస్ కాకపోయినప్పటికీ ఈయనకు వచ్చిన సినిమా అవకాశాలను అందుకుంటూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉన్నారు. త్వరలోనే సాగర్ నటించిన “ద 100” (The 100)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా జూలై 11వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ విడుదల చేశారు. ఈ సాంగ్ లాంచ్ అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా రిపోర్టర్స్ నుంచి హీరో సాగర్ కు ఊహించని ప్రశ్న ఎదురయింది.
జనసేనకు మద్దతుగా సాగర్..
ఇటీవల కాలంలో సాగర్ రాజకీయాలలోకి కూడా వస్తున్న విషయం మనకు తెలిసిందే. ముఖ్యంగా ఈయన జనసేన పార్టీకి పూర్తిస్థాయిలో మద్దతు తెలుపడమే కాకుండా పవన్ కళ్యాణ్ తో కలిసి పలు సందర్భాలలో దిగిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. దీంతో రిపోర్టర్స్ ఈయనని ప్రశ్నిస్తూ మీరు సినిమాలలో ఇప్పటివరకు సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోయారు, ఇలా సినిమాలలోనే తడబడుతున్న మీరు రాజకీయాలలోకి (Politics) రావాలనుకోవడం సరైన నిర్ణయమేనా? అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సాగర్ తనదైన శైలిలోని సమాధానం చెప్పారు.
సినిమాలు వేరు, రాజకీయం వేరు..
తనకు ప్రేక్షకులు ఒక గుర్తింపును ఇచ్చారు. ఆ గుర్తింపుతోనే ఇండస్ట్రీలో కొనసాగుతూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాను. ఎప్పుడు ఎవరికి సక్సెస్ వస్తుందో తెలియదు. నేను కూడా ఆ సక్సెస్ కోసమే ఎదురుచస్తున్నానని తెలిపారు. ఇక సినిమాలు, రాజకీయం అనేది పూర్తిగా వేరు అంటూ తెలియజేశారు నేను రాజకీయాలలోకి వస్తున్నాను అంటే అది నా ఇష్టం కావచ్చు, లేదా నా కుటుంబ నేపథ్యం కావచ్చు. రాజకీయాలకు సినిమాలకు ఏమాత్రం సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇక నాకు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ను ఆ క్షణం కలిసే సందర్భం వచ్చింది కాబట్టి నేను వెళ్ళాను సినిమాలు రాజకీయాలు పూర్తిగా భిన్నమని ఈయన తనదైన శైలిలోనే సమాధానం ఇచ్చారు. ఇక ద 100 సినిమా విషయానికి వస్తే రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకుడిగా పరిచయం అవుతూ ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ఒక యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో సాగర్ విక్రాంత్ అనే ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. మరి ఐపీఎస్ ఆఫీసర్ గా సాగర్ ఈ సినిమాతో సక్సెస్ అందుకుంటారా? లేదా అనేది తెలియాల్సి ఉంది.
Also Read: నిహారిక విడాకుల తప్పు నాదే.. ఇన్నాళ్లకు ఓపెన్ అయిన నాగబాబు