MLA Raja Singh U-Turn: మేకప్ మెన్ అన్నాడు..? హైదరాబాద్ దాటని వ్యక్తి అధ్యక్షుడిగా పనికి రాడు అన్నాడు..? పాత ఇనుప సామాన్లతో పార్టీ నేతలను పోల్చాడు..? టేబుల్ తుడిచే వ్యక్తులకే పదవులు అన్నాడు..? మంచి ప్యాకేజీలొస్తే అమ్ముడు పోయే దొంగలు అన్నాడు. ? దొంగలంతా కలిసి కుమ్మక్కు రాజకీయాలతో పార్టీని బ్రస్టు పట్టిస్తున్నారని మండిపడ్డాడు..? అంతే కాదు సప్సెండ్ చేస్తే చేసుకోండి, మీ జాతకాలన్నీ బయటపెట్టి వెళ్తానంటూ సినీ స్టైల్లో వార్నింగ్‌లు సైతo ఇచ్చాడు? తెలంగాణ బీజేపీలో అంత రచ్చ చేస్తున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారా? అసలు ఆ హిందుత్వ నేత వ్యూహమేంటి?
ఉన్న పలంగా వాయిస్ మార్చిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
తెలంగాణ బీజేపీపై, ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వ తీరుపై నిత్యం అసహనంతో దుమ్మెత్తి పోస్తూ, అసంతృప్తి రాగాలతో వార్తల్లోకి ఎక్కుతున్న ఆ పార్టీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఉన్నపలంగా వాయిస్ మార్చారు. ఇంతకు రాజాసింగ్ కు ఏమైంది. ఉంటే అలా.. లేకుంటే ఇలా ఎందుకొంటున్నారు..? సడెన్ గా గోషామహల్ ఎమ్మెల్యే యూటర్న్ తీసుకున్నారా..? రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని మేకప్ మాన్ అంటూ అవహేళన చేసిన సింగ్ ఇప్పుడు మా విన్నపాలు వినండంటూ అదే రాష్ట్ర అధ్యక్షుడిని వేడుకుంటున్న పరిస్థితి ఎందుకొచ్చింది..? అసలు రాజాసింగ్ మారిపోయారా..? పార్టీ లైన్ లోకి వచ్చారా..? లేక తెప్పించరా..? నిత్యం సొంత పార్టీ నేతలపై విమర్శనాస్త్రాలను సంధించే రాజసింగ్ సడన్‌గా వాయిస్ ఎందుకు మార్చారనేది హాట్‌టాపిక్‌గా మారింది.
రాజా సింగ్ అభ్యర్థనలతో ఆయన వర్గీయుల్లో నిరాశ
రాష్ట్ర బీజేపీలో నిత్య అసంతృప్తి నేతగా ఫోకస్ అవుతున్న రాజాసింగ్ తమ విన్నపాలు వినాలని అభ్యర్థించే వరకు రావడం, అదికూడా కిషన్ రెడ్డిని వేడుకోవడం చర్చనీయాంశంగా మారింది. మొన్నటిదాకా పార్టీలో, ఆయన వర్గీయుల్లో కింగ్‌లా వెలుగొందిన కరడుగట్టిన హిందుత్వవాది రాజసింగ్ ఉన్నఫళంగా అంత ఫసక్ అనిపించారనే టాక్ నడుస్తోంది. మా సమస్యలు వినండి అంటూ సింగ్ సాబ్ పార్టీ నాయకత్వాన్ని అభ్యర్థించడంతో ఆయన వర్గీయులు, అభిమానులు నిరాశకు గురవుతున్నారనే చర్చ జరుగుతోంది. ఆకస్మాత్తుగా గోషామహల్ స్వరం మారడానికి కారణాలేంటి..? పార్టీలో తనకు అన్యాయం జరుగుతుందని గగ్గోలు పెట్టిన గోషామహల్ కింగ్ రూటు మార్చడానికి కారణాలేంటి..? దాని వెనుక వ్యూహమేదైనా ఉందా? అని బీజేపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారంట.
బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై నిప్పులు చెరిగిన రాజాసింగ్
రాజాసింగ్ ఢిల్లీ పెద్దలను పెద్దగా టార్గెట్ చేయకపోయినా, పార్టీలో తనను తొక్కేయాలని కుట్రలు చేస్తున్నారని తనకు అన్యాయం జరుగుతోందని, పార్టీలో ప్రాధాన్యత దక్కడం లేదని, రాష్ట్ర నాయకత్వంపై మాత్రం నిప్పులు చెరిగేవారు. అసంతృప్తిని వ్యక్తం చేసేవారు. అయినప్పటికీ నాయకత్వం రాజసింగ్ వాఖ్యలకు పెద్దగా స్పందించేది కాదు. తాజాగా జరిగిన హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంలో స్వయంగా కేంద్రమంత్రి బండి సంజయ్ వెళ్లి రాజసింగ్ ను సముదాయించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆయన తీరు మారలేదనే చర్చ కూడా ఉంది. అప్పటి నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యే వరకు రాజాసింగ్ కొంత సైలెంట్ అయ్యారు.
బండి సంజయ్‌ని టార్గెట్ చేసిన గోషామమల్ ఎమ్మెల్యే
ఆ తర్వాత బండి సంజయ్‌నే టార్గెట్ చేస్తూ కరీంనగర్ నుంచి వార్ మొదలైందంటూ సెటైర్లు ఎక్కుపెట్టిన తీరు పార్టీలో పెద్ద దుమారమే లేపింది. అంతేకాదు రాజసింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారనే వరకు పంచాయితీ వెళ్లింది. అయినప్పటికీ తగ్గేదెలే అన్నట్టు సస్పెండ్ చేస్తే చేసుకోండి, సస్పెండ్ చేస్తే అందరి జాతకాలు బయటపెట్టి వెళ్తా అంటూ సినీ స్టైల్లో పార్టీ రాష్ట్ర నాయకత్వానికి హెచ్చరికలు జారీ చేశారు.
రాజాసింగ్‌కు సున్నితంగా చురకలు అంటించిన కిషన్‌రెడ్డి
ఇక ఆ పంచాయతీ అటుంచితే తాజాగా రాజాసింగ్ కామెంట్స్ పై కిషన్ రెడ్డి స్పందించారు. రాజాసింగ్ చాలా సీనియర్ నాయకుడు, ప్రజాప్రతినిధి, తాను సామాన్య కార్యకర్తను అంటూ రాజసింగ్‌కు సున్నితంగా చురకలు అంటించారు. అంతే స్పీడ్‌గా రాజాసింగ్ నుంచి కూడా స్పందన వచ్చింది. ఈ సారి రాజసింగ్ నుంచి రోటిన్ విమర్శనాస్త్రాలకు భిన్నంగా రియాక్షన్ రావడం బీజేపీలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోందంట. తమకున్న సమస్యలు వినాలని కిషన్ రెడ్డిని అభ్యర్థిస్తున్నట్లు తన మీడియా బ్రాడ్ కాస్టింగ్ లో చెప్పుకొచ్చారు. వ్యక్తిగతంగా సమయం కేటాయించండి. వచ్చి కలుస్తాను అంటూ కిషన్ రెడ్డిని అభ్యర్థించారు.
Also Read: చికెన్ కర్రీతో నాన్నను సర్‌ప్రైజ్ చేద్దాం అనుకున్నాడు, కానీ..
రాజాసింగ్ యూటర్న్ తీసుకున్నారా?
సమయం నిర్ణయించి చెబితే వచ్చి కలిసేందుకు సిద్ధంగా ఉన్నానని కిషన్‌రెడ్డిని ఉద్దేశించి రాజాసింగ్ చెప్పుకొచ్చారు. వ్యక్తిగత విభేదాలను విడిచిపెట్టి.. ఐక్యంగా పని చేద్దామని, పదవులు ముఖ్యం కాదని, పార్టీ బలోపేతం ముఖ్యమని అభిప్రాయపడ్డారు. రాజాసింగ్ ఇచ్చిన స్టేట్ మెంట్ తో రాజాసింగ్ యూ టర్న్ తీసుకున్నారా..? ఉన్నపలంగా రాజాసింగ్ నుంచి ఇట్లాంటి స్టేట్ మెంట్లు రావడo ఏంటని పార్టీలో జోరుగా చర్చసాగుతోంది. అంతేకాదు రాజసింగ్ నుంచి ఇట్లాంటి స్టేట్ మెంట్లు రావడం వెనక, ఇన్ సైడ్ ఏదో జరిగిందనే ప్రచారం సాగుతోంది.
అధిష్టాన పెద్దలు రాజాసింగ్ విషయంలో రియాక్ట్ అయ్యారా?
పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఏమైనా చేశారా..? అధిష్టాన పెద్దలు రాజాసింగ్ విషయంలో రియాక్ట్ అయ్యారా? నిత్యం అసంతృప్తిగళం వినిపించే రాజాసింగ్‌ను దారికి ఎలా తెచ్చుకున్నారు ? అన్నది హాట్ టాపిక్ గా మారింది. మొత్తమ్మీద రాజసింగ్ విన్నపాలు వినేందుకు రాజాసింగ్ కు కిషన్ రెడ్డి టైం ఇస్తారా ? విబేధాలు పక్కనపెట్టి కలిసి పనిచేస్తారా ? అన్నది ఆసక్తికరంగా మారింది.
Story BY Apparao, Bigtv