E-Paper
Advertisement

Rare Airbus Beluga: శంషాబాద్ ఎయిర్ పోర్టులో బాహుబలి ఎయిర్ క్రాఫ్ట్ ఎంత పెద్దదో చూశారా?

Rare Airbus Beluga: శంషాబాద్ ఎయిర్ పోర్టులో బాహుబలి ఎయిర్ క్రాఫ్ట్ ఎంత పెద్దదో చూశారా?
Advertisement

Rare Airbus Beluga Lands at Hyderabad’s Shamshabad Airport: శుక్రవారం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలిసారి ఓ భారీ ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ అయింది. దాదాపు 56.16 మీటర్ల పొడవుతో 17 మీటర్ల ఎత్తుతో ఉన్న ఈ భారీ ఎయిర్ క్రాఫ్ట్ సముద్రాలలో కనిపించే భారీ తిమింగలాన్ని పోలి ఉండటం విశేషం.దీని రెక్కలే దాదాపు 44 మీటర్ల పొడవు ఉంటాయి. వాస్తవానికి ఈ ఎయిర్ క్రాఫ్ట్ భారీ విమానం మస్కట్ నుంచి బయలుదేరింది. ఇండియా షెడ్యూల్ లేనే లేదు. అది తిన్నగా థాయ్ ల్యాండ్ కు సరుకులతో చేరుకోవాలి. అయితే దారి మధ్యలో ఇంధనం నింపుకోవడానికి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. ఇక ఎయిర్ క్రాఫ్ క్రూ సిబ్బంది కూడా విశ్రాంతి తీసుకోవాలని భావించడంతో దాదాపు 15 గంటల పాటు శంషాబాద్ విమానాశ్రయంలో దీనిని నిలిపివేశారు.

మూడు గంటలకు తిరుగు ప్రయాణం

Advertisement

మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఇది తిరిగి థాయ్ ల్యాండ్ కు బయలుదేరింది. గతంలో రెండేళ్ల క్రితం 2022లో తొలిసారి ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. తర్వాత 2023లోనూ వచ్చింది. తాజాగా సరిగ్గా సంవత్సరం తర్వాత మళ్లీ శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చింది. అందరూ దీనిని ఆకాశ తిమింగలంగా చెప్పుకోవడం విశేషం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్చేస్తోంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ కావడం విశేషం.

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×