Telagnana RYVS Updates: యువత కోసం రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాసం పథకానికి మాంచి స్పందన వస్తోంది. దరఖాస్తులు ప్రారంభించిన కేవలం వారం రోజులకే రాష్ట్రవ్యాప్తంగా మీసేవా కేంద్రాలకు 13.45 లక్షల దరఖాస్తులు వచ్చాయి. తాజాగా మరో అప్ డేట్ ఇచ్చింది ప్రభుత్వం. అయితే దరఖాస్తుదారులకు మరో శుభవార్త చెప్పేసింది. రేషన్ కార్డు లేని వారు కేవలం ఆదాయ ధ్రువీకరణ పత్రం సమర్పించవచ్చని క్లారిటీ ఇచ్చేంది. దీంతో యువత సంఖ్య మరింత పెరగవచ్చని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.
రికార్డు స్థాయిలో దరఖాస్తులు
తెలంగాణ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీమ్ రాజీవ్ యువ వికాసం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల నిరుద్యోగ యువత ఈ పథకాన్ని అప్లై చేసుకోవచ్చు. యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించిన ఈ స్కీమ్‌కు ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. మార్చి 26 నుంచి ఏప్రిల్ ఒకటి వరకు దాదాపు 13 లక్షల 45 వేల దరఖాస్తులు వచ్చాయి. అందులో దాదాపు 6 లక్షల 20 వేలకు ఓకే చేసినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మార్చి 26న ప్రభుత్వానికి లక్షా 75 వేల దరఖాస్తులు రాగా, అందులో 72 వేలకు పైగానే ఆమోదించినట్టు తెలుస్తోంది. మార్చి 27న 2 లక్షల 10 వేలు, మార్చి 28న లక్షా 90 వేలు, మార్చి 29న 2 లక్షల 15 వేలు, మార్చి 30న లక్షా 65 వేలు, మార్చి 31న 2 లక్షల 20 వేలు, ఏప్రిల్ 1న లక్షా 70 వేలు దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం. కేవలం వారం రోజులకు 13 లక్షల 45 వేల దరఖాస్తులు రాగా, అందులో 6 లక్షల 20 వేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
మరో శుభవార్త
ఈ స్కీమ్‌కి సంబంధించి మరో శుభవార్త చెప్పేసింది. రేషన్ కార్డు లేని వారు కేవలం ఆదాయ ధ్రువీకరణ పత్రం సమర్పించవచ్చని క్లారిటీ ఇచ్చింది. దీంతో వినియోగదారులు సంఖ్య మరింత పెరగవచ్చని ప్రభుత్వ అంచనా వేస్తోంది. 6 వేల కోట్లతో ఈ పథకాన్ని అమలు చేయాలని సర్కార్ నిర్ణయించింది. అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించే క్రమంలో వినియోగదారులు పలు ఇబ్బందులు పడుతున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా రేషన్ కార్డుల విషయంలో ఈ సమస్యలు తీవ్రమవుతున్నాయి.
ALSO READ: తెలంగాణలో దంచి కొట్టిన వానలు
రేషన్ కార్డుల లేకపోవటంతో చాలా మంది ఈ పథకానికి దూరమయ్యే అవకాశం ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రేషన్ కార్డు లేకుండా పుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్నవారు ఇన్‌కం సర్టిఫికెట్ సమర్పించాల్సిన అవసరం లేదని పేర్కొంది. దీనికితోడు రేషన్ కార్డు, పుడ్ సెక్యూరిటీ కార్డు లేనివారు మీ-సేవా ద్వారా జారీ చేయబడిన ఆదాయ ధ్రువీకరణ పత్రం నెంబర్ ఉన్నా సరిపోతుందని స్పష్టం చేసింది. 2016 తర్వాత జారీ చేయబడిన కుల ధ్రువీకరణ పత్రంతో దరఖాస్తు చేసుకోవచ్చు. మరలా కొత్త పత్రంతో దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇటీవల దరఖాస్తుల గడువు ముగిసింది. ఈ గడువును ఏప్రిల్ 14 వరకు పొడిగించింది ప్రభుత్వం.
ఓరియంటేషన్ తరగతులు
ఈ స్కీమ్ కింద ఎంపిక అయినవారికి జూన్ 2 నుంచి 9 వరకు మంజూరు పత్రాలు అందజేస్తారు. ఎంపికైన వారికి దాదాపు రెండువారాల పాటు ఓరియంటేషన్ తరగతులు నిర్వహిస్తారు. ఆ తర్వాత యూనిట్లు మంజూరు చేయనుంది. యూనిట్ గ్రౌండ్ చేసిన తరువాత ఆరు నెలల నుంచి ఏడాది వరకు ట్రైనింగ్ అందిస్తారు. స్కీమ్ అమలులో ఏమైనా ఇబ్బందులు ఉంటే జిల్లా కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. ఈ పథకంలో అర్హులైన యువతకు రూ. 50 వేల నుంచి రూ.4 లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది ప్రభుత్వం. మార్చి 17న సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించిన విషయం తెల్సిందే.