BigTV English

Rave party at Moinabad: మొయినాబాద్‌లో మిడ్‌ నైట్ రేవ్ పార్టీ.. పోలీసుల అదుపులో యువతీయవకులు

Rave party at Moinabad: మొయినాబాద్‌లో మిడ్‌ నైట్ రేవ్ పార్టీ.. పోలీసుల అదుపులో యువతీయవకులు

Rave party at Moinabad(Hyderabad latest news): బెంగుళూరు రేవ్ పార్టీలో చాలామంది యువతీయువకులు పట్టుబడ్డారు. అయినా యువకులు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. దాని నుంచి తేరుకోకముందే మరొక పార్టీ ఒకటి హైదరాబాద్‌లో వెలుగుచూసింది. తాజాగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో అర్థరాత్రి ముజ్రాపార్టీ వెలుగుచూసింది. ఇందులో పాల్గొన్న యువతీ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.


రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం సురంగల్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో సోమవారం అర్థరాత్రి ముజ్రా(అసభ్యకర) పార్టీ జరిగింది. దీనిపై సమాచారం పోలీసులకు అందింది. వెంటనే రాజేంద్రనగర్ ఎస్‌వోటీ పోలీసులు రంగంలోకి దిగారు. ఆ ఫామ్‌హౌస్‌పై దాడి చేశారు. ఈ పార్టీలో ఆరుగురు యువకులు, ఐదుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు.

పట్టుబడినవారిని మొయినాబాద్ పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం వారిని అక్కడ పోలీసుస్టేషన్‌లో విచారిస్తున్నారు. ఈ పార్టీలో పాల్గొన్న నలుగురు అమ్మాయిలు ఢిల్లీ నుంచి ఇక్కడకు తీసికొచ్చినట్టు తెలుస్తోంది. ఫామ్ హౌస్‌లో వీరంతా అసభ్యకర రీతిలో అర్థనగ్నంగా డ్యాన్స్‌ సన్నివేశాలను చూసి పోలీసులు షాకయ్యారు.


ALSO READ:  సీఎం రేవంత్ కొత్త ఆలోచన, యూత్ కోసం స్కిల్ యూనివర్సిటీ, కాకపోతే..

ఇంతకీ ఫామ్‌హౌస్ ఎవరిది? ఈ పార్టీ వెనుక ఎవరున్నారు? అనేదానిపై కూపీ లాగే పనిలో పడ్డారు పోలీసులు. దీని వెనుక బడా బాబుల పుత్రరత్నాలు వున్నట్లు అంతర్గత సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సివుంది.

Tags

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×