BigTV English

Red Alert to Telangana Districts: నిప్పుల కొలిమి.. తెలంగాణలోని 18 జిల్లాలకు రెడ్ అలర్ట్!

Red Alert to Telangana Districts: నిప్పుల కొలిమి.. తెలంగాణలోని 18 జిల్లాలకు రెడ్ అలర్ట్!

Summer Red Alert for Telangana State: తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. 8 గంటలు కాదు కదా.. 7 గంటలు దాటడంతోనే ఎండ మండిపోతుంది. ఉక్కపోత, తీవ్ర వడగాలులు, మండుటెండలు.. ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. కాస్త.. వయసుమీద పడిన వారు ఎప్పుడు పుటుక్కుమంటారో తెలియని పరిస్థితి. ఇంట్లో ఉన్నా వడదెబ్బకు గురవుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా భానుడి ప్రతాపానికి గురవ్వక తప్పడం లేదు. 45 డిగ్రీల నుంచి 47 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం ఆందోళనకు గురిచేస్తుంది. మే ముగిసేలోగా.. ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు దాటిపోతాయేమోనని భయపడుతున్నారు ప్రజలు.


ఏపీలో నేడు 156 మండలాల్లో వడగాలులు వీస్తాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. 28 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవవాశం ఉందని తెలిపారు. అలాగే.. రేపు 21 మండలాల్లో తీవ్రవడగాలులు, 261 మండలాల్లో వడగాలులు వీస్తాయని తెలిపారు. ఉత్తరాంధ్రకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరించారు.

గురువారం ఏపీలో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలు దాటాయి. ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో 47.1°C, మార్కాపురంలో 47°C, నంద్యాల జిల్లా బనగానపల్లెలో 46.7°C అధికఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. 14 జిల్లాల్లో 43°C కు పైగా ఉష్ణోగ్రతలు నమోదైందన్నారు. అలాగే.. 33 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 188 మండలాల్లో వడగాల్పులు వీచాయని తెలిపారు.


Also Read: నిప్పుల కొలిమిగా తెలుగు రాష్ట్రాలు.. రాబోయే నాలుగు రోజులు దబిడి దిబిడే..

ఇటు తెలంగాణలోనూ భానుడు నిప్పులు కక్కుతున్నాడు. రానున్న ఐదురోజుల్లో రాష్ట్రంలో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని హెచ్చరించారు. రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రంలో తీవ్ర ఎండలు, వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతాయని పేర్కొంది. భారీ ఎండలు, తీవ్రవడగాలుల హెచ్చరికలు నేపథ్యంలో.. శుక్రవారం 13 జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. అలాగే శని, ఆదివారాల్లో 18 జిల్లాలకు రెడ్ అలర్ట్, మిగతా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది.

Tags

Related News

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Guvvala Balaraju: బీజేపీలో చేరిన గువ్వల.. కేటీఆర్‌పై హాట్ కామెంట్స్..

Big Stories

×