Big Stories

Heat Wave in AP & Telangana: నిప్పుల కొలిమిగా తెలుగు రాష్ట్రాలు.. రాబోయే నాలుగు రోజులు దబిడి దిబిడే

High Temperature Recorded in Andhra Pradesh and Telangana: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్ర వడగాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీంతో బయటకు రావాలంటే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. భానుడి భగ..భగతో తెలుగు రాష్ట్రాలు నిప్పులకొలిమిగా మారాయి. సూరీడు తగ్గేదేలే అంటూ నిప్పులు చెరుగుతున్నాడు. రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలతో ఏపీ, తెలంగాణ అగ్నిగుండంలా మారాయి.

- Advertisement -

ఏ రోజుకారోజు గత పదేళ్లలో ఎప్పుడూ నమోదుకానంత స్థాయిలో ఎండలు కాస్తూ కొత్త రికార్డులు నెలకొంటున్నాయి. అత్యధికంగా నల్గొండ జిల్లా మునుగోడులో ఏకంగా 46.6 డిగ్రీలు నమోదైంది అంటే అర్థం చేసుకోవచ్చు.. ఎండలు ఏ రేంజ్‌లో మండిపోతున్నాయో. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు ఇదే పరిస్థితి. గతేడాది కన్నా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు వడగాలులు, ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు.

- Advertisement -

హైదరాబాద్‌లోనూ అదే స్థాయిలో 43 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండతీవ్రతతో నగరవాసులు అల్లాడిపోతున్నారు. మరోవైపు.. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. రానున్న 3 రోజుల్లో మరింతగా ఎండలుంటాయని చెబుతున్నారు.

Also Read: కవిత‌కు దక్కని ఊరట, మళ్లీ మే ఆరుకు వాయిదా

ఏపీలోనూ ఎండలు ఠారెత్తిస్తోన్నాయి. పలు జిల్లాలో 46 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాలులు వీస్తుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. 5 తేదీ వరకు ఎండ తీవ్రత కొనసాగుతుందని అధికారులు హెచ్చరిస్తోన్నారు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News