BigTV English

Republic Day : రిపబ్లిక్ డే పరేడ్‌లో ఆకట్టుకున్న శకటాలు.. ప్రత్యేకంగా నిలిచిన ‘జయ జయహే తెలంగాణ’..

Republic Day : దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర దినోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన పరేడ్‌‌లో పలు రాష్ట్రాల శకటాలు ప్రేక్షకులను మంత్రముగ్ధల్ని చేశాయి. భారత్ చేపట్టిన చంద్రయాన్-3 నుంచి దేశం సాధించిన వివిధ అభివృద్ధిని శకటాలు రూపంలో ప్రదర్శించారు.

Republic Day : రిపబ్లిక్ డే పరేడ్‌లో ఆకట్టుకున్న శకటాలు.. ప్రత్యేకంగా నిలిచిన ‘జయ జయహే తెలంగాణ’..

Republic Day : దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర దినోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన పరేడ్‌‌లో పలు రాష్ట్రాల శకటాలు.. ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాయి. భారత్ చేపట్టిన చంద్రయాన్-3 నుంచి దేశం సాధించిన వివిధ అభివృద్ధిని.. శకటాలు రూపంలో ప్రదర్శించారు.


భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రదర్శించిన శకటం అందర్ని ఆకట్టుకుంది. ముఖ్యంగా చంద్రయాన్‌-3, ఆదిత్య ఎల్‌-1 మిషన్లు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఇందులో చంద్రుడిపై విక్రమ్‌ ల్యాండర్ దిగుతున్న దృశ్యాలను ప్రదర్శించారు. శకటంపై ఉన్న మహిళా శాస్త్రవేత్తలు జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్‌ దిగిన శివశక్తి పాయింట్‌ను ప్రదర్శించారు.

ఉత్తరప్రదేశ్‌ శకటంలో అయోధ్య రామ మందిరం చిత్రం ఆకట్టుకుంది. నూతనంగా నిర్మించిన రామమందిర ప్రారంభోత్సవానికి గుర్తుగా దీన్ని ప్రదర్శించారు. శకటానికి ముందు బాలక్‌రామ్‌ విల్లు-బాణంతో దర్శనమిచ్చారు. దీంతో పాటు ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళాను చాటిచెప్పే ‘కలశం’ని ప్రదర్శించారు. అయోధ్య లో జరిగే దీపోత్సవం, హైస్పీడ్‌ రైళ్లను శకటంలో ప్రదర్శించారు.


మరోవైపు మణిపూర్‌ శకటం ప్రత్యేకంగా నిలిచింది. 500 ఏళ్ల చరిత్ర కలిగిన ఇమా కెయితల్‌ మార్కెట్‌ను శకటంలో ప్రదర్శించారు. ఈ మార్కెట్‌ను పూర్తిగా మహిళలే నిర్వహిస్తారు. ప్రపంచంలో ఈ మార్కెట్ మహిళల నిర్వహిస్తున్న అతి పెద్ద మార్కెట్‌గా చరిత్ర సృష్టించింది. కేంద్ర ప్రజా పనుల విభాగం శకటంలో నూతనంగా నిర్మించిన పార్లమెంట్‌ భవనం చిత్రాన్ని ప్రదర్శించారు. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ చిత్రాన్ని కూడా ప్రదర్శించారు. ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం జరిగి 350 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ ఘట్టాన్ని మహారాష్ట్ర తమ శకటంలో ప్రదర్శించింది.

కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన శకటంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాన్ని ప్రదర్శించారు. మానవునికి ఆరోగ్యం, విద్య, సామాజిక సాధికారతకు ఏఐ టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుందో ప్రదర్శించారు. కేంద్ర విదేశీ వ్యహారాల శాఖ ఇండియాలో నిర్వహించిన జీ20 సదస్సును శకటంలో ప్రదర్శించింది. శకటంపై ఏర్పాటు చేసిన ‘నమస్తే ముద్ర’ చూపరులను ఆకర్షించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన శకటం ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటిచెప్పింది. భారత్‌లో ఎన్నికల జరిగే తీరుని ప్రదర్శించారు.

ఈ పరేడ్‌లో తెలుగు రాష్ట్రాల శకటాలు ఆకట్టుకున్నాయి. తెలంగాణ శకటం అమర వీరులను స్మరించుకునేలా తీర్చిదిద్దారు. ఈ శకటానికి ‘జయ జయహే తెలంగాణ’గా నామకరణం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజాకవి అందెశ్రీ ఈ పల్లవిని రాశారు. ఉద్యమ సమయంలో ఈ గీతం విశేష ప్రాచుర్యం పొందింది. శకటంలో చాకలి ఐలమ్మ, కుమురం భీం, రాంజీ గోండు మొదలైన పోరాట యోధుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. దీంతోపాటు రాష్ట్ర కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఇక ఏపీకి చెందిన పాఠశాల శకటం ఆకట్టుకుంది. డిజిటిల్ ఎడ్యుకేషన్, విద్య వ్యవస్థలో ప్రవేశపెట్టిన నూతన మార్పులను వివరిస్తూ శకటం ప్రదర్శించారు.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×