IPS Transfers: తెలంగాణ పోలీసు శాఖలో భారీ ఎత్తున బదిలీలు చోటుచేసుకున్నాయి. ఏకంగా 21 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ గా ఇన్నాళ్లు కొనసాగుతూ వచ్చిన సజ్జనార్ ను ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్ డీజీగా బదిలి చేయడం ఈ ట్రాన్సఫర్లలో అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన స్థానంలో నగర సీపీగా మహేష్ భగవత్ కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది.
మరోవైపు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీజీగా చారుసిన్హాకు బాధ్యతలు అప్పగించారు. ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా అనిల్‌కుమార్‌ను, పౌర సరఫరాల శాఖ కమిషనర్‌గా నాగిరెడ్డిని బదిలీ చేశారు. మహిళా భద్రతా విభాగం (ఉమెన్ అండ్ సేఫ్టీ) డీజీపీగా సౌమ్య మిశ్రా, జైళ్ల శాఖ డీజీపీగా స్వాతి లక్రా నియమితులయ్యారు. అలాగే కీలకమైన గ్రేహౌండ్స్, ఆక్టోపస్ విభాగాల డీజీపీగా విక్రమ్‌సింగ్ మాన్‌ను ప్రభుత్వం నియమించింది.
అడిషనల్ డీజీపీ స్థాయి అధికారుల విషయానికి వస్తే.. లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీగా అకున్ సబర్వాల్‌కు బాధ్యతలు అప్పగించారు. సంజయ్‌కుమార్ జైన్‌కు అడిషనల్ డీజీపీ (ట్రైనింగ్)గా అదనపు బాధ్యతలు కేటాయించారు. మరోవైపు ఏసీబీ డైరెక్టర్‌గా ఎస్.చంద్రశేఖర్ రెడ్డిని నియమించారు. కొత్తగా ఏర్పాటైన TG-TMARS విభాగంలోనూ ప్రభుత్వం కీలక నియామకాలు చేపట్టింది. ఈ విభాగానికి డైరెక్టర్‌గా స్టీఫెన్ రవీంద్ర, జాయింట్ డైరెక్టర్‌గా జోయల్ డేవిస్, డిప్యూటీ డైరెక్టర్‌గా బాలాదేవి నియమితులయ్యారు.
Also Read: 65 ఏళ్ల వయసులో రూ. 20 భోజనంతో ప్రారంభం.. నేడు రూ. 2.5 కోట్ల వ్యాపార సామ్రాజ్యం!
జోనల్, ఇతర విభాగాల స్థాయిలోనూ పలువురు అధికారులకు స్థానచలనం కల్పించారు. మల్టీ జోన్-1 ఐజీపీగా కార్తికేయ, రైల్వేస్ ఐజీపీగా కె.రమేష్ నాయుడు నియమితులయ్యారు. ఇంటెలిజెన్స్ డీఐజీగా ఆర్.భాస్కరన్, కోఆర్డినేషన్ డీఐజీగా ఎల్.ఎస్. చౌహాన్‌కు బాధ్యతలు అప్పగించారు. అదనపు బాధ్యతల కింద చందన దీప్తికి గద్వాల జోన్-7 డీఐజీగా, నారాయణనాయక్‌కు బాసర జోన్-2 డీఐజీగా ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. వీరితో పాటు హైదరాబాద్ డీసీపీగా వి.అరవిందబాబును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. బదిలీ అయిన అధికారులు తక్షణమే తమ నూతన బాధ్యతలు స్వీకరించనున్నారు.
Also Read: గృహిణులకు గోల్డెన్ ఛాన్స్.. రూ.1 లక్ష పెట్టుబడితో.. ఇంటి నుంచే చేయగల 4 సూపర్ బిజినెస్‌లు!