E-Paper
Advertisement

అక్రమ అండాల ముఠాతో 23కు పైగా ఐవీఎఫ్ సెంటర్లు.. ఎక్కడో తెలుసా..?

అక్రమ అండాల ముఠాతో 23కు పైగా ఐవీఎఫ్ సెంటర్లు.. ఎక్కడో తెలుసా..?
Advertisement

Egg Donation: కిడ్నీలు, బ్లడ్ అన్నీ అమ్మేశారు.. ఇప్పుడు ఏకంగా అండాల దందా కూడా జోరుగా సాగుతోంది. అవతలి వాళ్ల పేదరికాన్ని, డబ్బు మీద ఉండే ఆశను పెట్టుబడిగా మార్చుకుని యథేచ్చగా ఇల్లీగల్ యాక్టివిటీస్ నడుపుతున్నారు. దీనికి కాసులకు కక్కుర్తి పడే డాక్టర్లు కూడా తోడవుతున్నారు. పోలీసులు ఎప్పటికప్పుడు గ్యాంగ్‌లను పట్టుకుంటున్నా, కొత్త ముఠాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి.

ఆశ చూసి అండాలు..

సంతానం లేని దంపతుల కోసం ఐవీఎఫ్, టెస్ట్ ట్యూబ్ బేబీ టెక్నాలజీని వాడుతుంటారు. ఇదే అదనుగా భావించిన కొందరు కేటుగాళ్లు.. ఇతర రాష్ట్రాల నుంచి పేద మహిళలను తీసుకొచ్చి, బలవంతంగా, డబ్బు ఆశ చూసి అండాలు సేకరిస్తూ పెద్ద దందాయే నడిపారు. ఈ ముఠా గుట్టును మల్కాజ్గిరి పోలీసులు రట్టు చేసి ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. అయితే, పోలీసుల ప్రైమరీ ఎంక్వైరీలో ఏకంగా 23కి పైగా ఐవీఎఫ్ సెంటర్లు, కొన్ని కార్పొరేట్ హాస్పిటళ్లకు ఈ దందాతో లింక్ ఉన్నట్లు బయటపడటం సంచలనంగా మారింది.

చట్టం ఏం చెబుతోంది?

Advertisement

అసలు చట్టం ఏం చెబుతోంది? ఒక మహిళ తన లైఫ్‌లో కేవలం ఒక్కసారి మాత్రమే అండం దానం చేయడానికి రూల్స్ ఒప్పుకుంటాయి. అది కూడా ఒకే విడతలో గరిష్టంగా ఏడు అండాలను మాత్రమే సేకరించాలి. కానీ ఇక్కడ హార్మోనల్ ఇంజెక్షన్ల వల్ల మహిళల ప్రాణాలకే ముప్పు వస్తోందని డాక్టర్లు చెబుతున్నారు. మన దేశంలో అండాల సేకరణ కోసం చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. నిబంధనల ప్రకారం అండాలు ఇచ్చే మహిళ వయస్సు ఖచ్చితంగా 23 నుంచి 35 సంవత్సరాల మధ్యే ఉండాలి. 23 ఏళ్లకంటే తక్కువ ఉన్న పెళ్లి కాని అమ్మాయిల నుంచి అండాలు సేకరించడం పూర్తిగా చట్టవిరుద్ధం.

Also Read: రసగుల్లా అని నమ్మించి.. నాటు బాంబు ఇచ్చారు.. నోట్లో వేసుకోగానే పేలి వ్యక్తి మృతి!

Tags

Related News

డిఫెన్సర్స్ సెక్యూరిటీ లైసెన్స్ రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం!

బిగ్ బ్రేకింగ్.. తెలంగాణ జనసేనలో అందరి కీలక పదవులన్నీ రద్దు!

తీపి మాటున కాలుష్య విషం.. స్వీట్ తయారీ కేంద్రాలపై పీసీబీ కొరడా!

తెలంగాణ పోలీస్ శాఖలో భారీ ప్రక్షాళన.. ఏకంగా 21 మంది ఐపీఎస్‌ల బదిలీ!

సీఎం రేవంత్ రెడ్డికి ‘ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్’ లేఖ!

కరోనా నిబంధనల ఉల్లంఘన కేసులో.. కోర్టుకు సీఎం రేవంత్ రెడ్డి!

మహిళ నోట్లో గుడ్డలు కుక్కి.. ఐరన్ బాక్స్‌తో కొట్టి ఆ తర్వాత, హైదరాబాద్ సిటీలో దారుణహత్య

Big Stories

Advertisement
×