E-Paper
Advertisement

సీఎం రేవంత్ రెడ్డికి ‘ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్’ లేఖ!

సీఎం రేవంత్ రెడ్డికి ‘ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్’ లేఖ!
Advertisement

TNGOs Land: హైదరాబాద్ TNGOs భూముల కేటాయింపులో అక్రమాలు జరిగాయని, హైదరాబాద్‌లో రూ.2,500 కోట్ల విలువైన 50 ఎకరాల భూమిపై వివాదం తెరపైకి వచ్చింది. దీంతో TNGOs భూముల వ్యవహారంపై ACB విచారణ జరిపించండి అంటూ.. సీఎం రేవంత్ రెడ్డికి ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ రాసింది.

సీఎం లేఖలో..

అయితే TNGOs హౌసింగ్ సొసైటీకి కేటాయించిన భూమిలో భారీ అక్రమాలు జరిగాయంటూ ఫోరం ఆరోపణలు చేసింది. 2003లో ప్రభుత్వమే ఉచితంగా కేటాయించిన భూమిలో నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్ల పంపిణీ జరిగిందని అధికారులు సీఎం లేఖలో పేర్కోన్నారు. సొసైటీ సభ్యులు కాని వ్యక్తులకు వందలాది ప్లాట్లు కేటాయింపులు చేసారని అన్నారు. పోలీసు అధికారులు, వైద్యులు, సచివాలయంలోని సీనియర్ అధికారులు లబ్ధిదారులుగా ఉన్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు. ప్రతి ప్లాట్ కేటాయింపుదారుడి నుంచి దాదాపుగా రూ.4 లక్షల వరకు వసూలు చేసారంటూ సోసైటీ వాల్లు తెలిపారు.

సీబీఐ విచారణ..

Advertisement

అర్హుల జాబితా అడిగినా సహకార శాఖకు అందించని సొసైటీ.. ప్లాట్లు పొందిన వారి వివరాలు వెల్లడించకుండా వ్యవహరించారంటూ ఆరోపణలు చేస్తున్నారు. దీంతో 2019లోనే ACB/CBI విచారణకు జిల్లా కలెక్టర్ సిఫార్సు చేసినట్టు సమాచారం. అక్రమ కేటాయింపులు రద్దు చేయాలని కూడా ప్రభుత్వానికి నివేదించినట్లు ఫోరం వెల్లడించింది. ఖాళీగా ఉన్న ప్లాట్లను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేసింది. మిగిలిన ప్లాట్లను విక్రయిస్తే రూ.1,000 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని ఫోరం అంచనా వేస్తుంది. TNGOs భూముల వ్యవహారంపై ACB విచారణ జరిపించి.. అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి పద్మనాభరెడ్డి విజ్ఞప్తి చేసారు.

Also Read: బంపర్ ఆఫర్ కొట్టేసిన కావ్య.. అంతా సుధీర్ దయ?

Tags

Related News

కరోనా నిబంధనల ఉల్లంఘన కేసులో.. కోర్టుకు సీఎం రేవంత్ రెడ్డి!

మహిళ నోట్లో గుడ్డలు కుక్కి.. ఐరన్ బాక్స్‌తో కొట్టి ఆ తర్వాత, హైదరాబాద్ సిటీలో దారుణహత్య

శేఖర్ మాస్టర్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది?

కొత్త చట్టానికి తెలంగాణ సర్కారు పదును.. పేరెంట్స్‌ని చూడకపోతే జీతంలో కోత

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు బిగ్ షాక్.. వచ్చే మంగళవారం కోర్టులో హాజరుకావాల్సిందే!

నాగార్జునతో కలిసి తమ్మిడికుంట చెరువును ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. ప్రత్యేకతలు ఇవే!

ప్రపంచానికి దిశానిర్దేశం చేయనున్న హైదరాబాద్.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Big Stories

Advertisement
×