E-Paper
Advertisement

Revanth Nomination : నేడు కామారెడ్డిలో రేవంత్ నామినేషన్.. సీఎం కేసీఆర్‌పై పోటీ..!

Revanth Nomination : నేడు కామారెడ్డిలో రేవంత్ నామినేషన్.. సీఎం కేసీఆర్‌పై పోటీ..!
Advertisement

Revanth Nomination : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ ల గడువు నేటితో ముగియనుంది. అన్ని పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల పోరుకు రెడీ అయ్యారు. సీఎం కేసీఆర్ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. చివరి ఎన్నికల్లో గజ్వేల్ నుంచి గెల్చిన ఆయన ఈ సారి గజ్వేల్, కామారెడ్డి నుంచి బరిలో దిగనున్నారు. ప్రభుత్వం మీద తీవ్ర అసంతృప్తి ఉన్న నేపథ్యంలో కేసీఆర్‌కు సవాల్ విసరాలని ఈటెల రాజేందర్ బీజేపీ అభ్యర్థిగా గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రికి సవాల్ విసరాలని రేవంత్ రెడ్డి కామారెడ్డి బరిలో దిగనున్నారు.

ఇవాళ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. రెండుచోట్ల నుంచి బరిలోకి దిగిన టీపీసీసీ చీఫ్.. ఈనెల 7న కొడంగల్‌లో నామినేషన్ వేశారు. తొలుత కొడంగల్‌ నుంచి పోటికి దిగిన రేవంత్.. కేసీఆర్ కామారెడ్డి నుంచి బరిలోకి దిగారని తెలిసి.. కామారెడ్డిలో పోటీకి దిగుతున్నట్లు ప్రకటించారు. కేసీఆర్‌పై పోటీకి రేవంతే సరైన వ్యక్తిగా భావించిన అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది.

Advertisement

నిన్న సీఎం కేసీఆర్ కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేశారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు రేవంత్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ అనంతరం కామారెడ్డిలో నిర్వహించనున్న బీసీ డిక్లరేషన్ సభలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అధికారంలోకి వస్తే బీసీలకు ఏం చేస్తామనే హామీలతో బీసీ డిక్లరేషన్‌ పెట్టినట్లు కాంగ్రెస్ పార్టీ నేతలు వెల్లడించారు. ఈ సభకు కాంగ్రెస్ ముఖ్యనేతలు హాజరు కానున్నట్లు తెలిపారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఈ సభలో పాల్గొని బీసీ డిక్లరేషన్ విడుదల చేస్తారని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ పేర్కొన్నారు.

.

Advertisement

.

.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×