E-Paper
Advertisement

రూ.60 కోట్ల బడ్జెట్.. రూ.100 కోట్ల టార్గెట్.. ఆకాశంలో ఒక తార పరిస్థితి ఏంటి?

రూ.60 కోట్ల బడ్జెట్.. రూ.100 కోట్ల టార్గెట్.. ఆకాశంలో ఒక తార పరిస్థితి ఏంటి?
Advertisement

Aakasamlo Oka Tara:దుల్కర్ సల్మాన్‌…మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ స్టార్ కిడ్ మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకీ బాగా దగ్గరైపోయాడని చెప్పక్కర్లేదు.ఇక ఇదే జోష్ ని కంటున్యూ చేస్తూ తాజాగా ‘ఆకాశంలో ఒక తార’ అనే సరికొత్త సినిమాతో ఈ నెల 20న ఆడియన్స్ ని పలకరించాడు.

పవన్ సాధినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా నటించగా, శృతిహాసన్, రుహానీ శర్మ, శ్వాసిక, మురళీ శర్మ, గౌతమ్ మీనన్, గెటప్ శ్రీను, ప్రవీణ్, రాజ్ కసిరెడ్డి వంటి వారు కీలకపాత్రలు పోషించారు. ఇక స్వప్న సినిమాస్, గీతా ఆర్ట్స్, లైట్‌బాక్స్ మీడియాస్ కలిసి నిర్మించిన ఈ సినిమా దాదాపు 55 కోట్ల పై చిలుకు బడ్జెట్ తో తెరకెక్కిందని సమాచారం.

Advertisement

ఇక సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే తొలి రోజు ఇండియాలో రూ.2.5 కోట్ల నెట్ రాబట్టిన ఈ మూవీ మూడు రోజుల్లో దేశవ్యాప్తంగా రూ.14కోట్ల నెట్ రాబట్టినట్టు తెలుస్తుంది. ఇక వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకి ఇప్పటి వరకు రూ.23 కోట్ల గ్రాస్ మార్కును అందుకుందని టాక్ వినిపిస్తుంది.ఇక నాలుగో రోజున దాదాపు 5 నుండి 6 కోట్ల వరకి వసూలు అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.

ఇక కథ విషయానికి వస్తే పాలలంక అనే చిన్న పల్లెటూరిలో ఉండే కల్పనకు చిన్నప్పటి నుంచే ఆస్ట్రోనాట్  కావాలని కోరిక ఉంటుంది. ఆకాశం వైపు చూస్తూ అంతరిక్షంలోకి వెళ్లాలని కలలు కంటూ ఉంటుంది. కానీ ఆడపిల్లలకు చదువు ఎందుకని ఆలోచించే తండ్రి శివయ్య ఆమెను ముందుకు వెళ్లనివ్వడు. ఇంట్లో పేదరికం, చుట్టూ ఉన్న మాటలు, పరిస్థితుల వల్ల కల్పనకు పదో తరగతి అవ్వగానే కృష్ణతో పెళ్లి చేస్తారు.

Advertisement

పెళ్లి అయ్యాక కల్పన జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. కల్పనకు అంతరిక్షం మీద ఉన్న ఆశ గురించి తెలిసిన కృష్ణ, ఆమె కలలను ఆపకుండా వాటిని నిజం చేయాలని అనుకుంటాడు. భార్యను చదివించాలని గట్టిగా నిర్ణయించుకుని, పైచదువుల కోసం ఆమెను హైదరాబాద్‌కు తీసుకెళ్తాడు. డబ్బు కష్టాలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కృష్ణ అస్సలు వెనక్కి తగ్గకుండా, భార్య చదువు కోసం  కష్టపడతాడు.

భర్త ఇంతలా అండగా నిలబడటంతో కల్పన కూడా ఫుల్ ఫోకస్‌తో చదువుతుంది. పల్లెటూరి నుంచి వచ్చినా సరే, బాగా కష్టపడి ఐఐటీలో మంచి ర్యాంకు కొడుతుంది. అలా తన కల వైపు మొదటి అడుగు వేస్తుంది కల్పన . భర్త సపోర్ట్ ఉంటే ఆడ వాళ్ళు ఏదైనా సాధించగలరని  సింపుల్‌గా, హార్ట్ టచింగ్‌గా తెరకెక్కించాడు డైరెక్టర్ పవన్.

మొత్తంగా సినిమాకి రూ.50 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరగడంతో, నిర్మాతలు మరియు బయ్యర్లు లాభాల్లోకి రావాలంటే ప్రపంచవ్యాప్తంగా రూ.110 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయాల్సి ఉందని సమాచారం. మరి టాక్ మంచిగా వస్తున్నప్పటికీ సినిమా వసూలు చేయాల్సిన మొత్తం సాలిడ్ గానే ఉండటంతో ఆ మేరకి అంచనాలని ఈ సినిమా అందుకుంటుందా లేదా అనేది మరికొన్ని రోజులు ఆగితే కాని తెలీదు.

ALSO READ:నాగవ్వ క్రేజ్ వేరే లెవల్.. వైష్ణవి సోనీ డాన్స్‌కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్!

Tags

Related News

వృషకర్మ కోసం నాగచైతన్య షాకింగ్ రెమ్యూనరేషన్.. ఎంతంటే?

పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన డింపుల్ హయతి!

హమ్మయ్య.. దేవర సాటిలైట్ రైట్స్ కు లైన్ క్లియర్.. టెలివిజన్ ప్రీమియర్ కు సిద్ధం!

టాలీవుడ్‌ను ఏలుతున్న తెలంగాణ దర్శకులు.. ఎవరి రెమ్యునరేషన్ ఎంతంటే?

బన్నీ సినిమాలు చేయకున్నా ఏడాదికి రూ.40  కోట్ల ఆదాయం .. ప్లానింగ్ అంటే ఇలా ఉండాలి!

సెన్సార్ పూర్తి చేసుకున్న నాగచైతన్య ‘వృషకర్మ’ .. ఏ సర్టిఫికెట్ వచ్చిందంటే?

రష్మిక మైసా కొత్త రిలీజ్ డేట్ లాక్.. ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×