Avneet Kaur:అవనీత్ కౌర్..సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ, వరుస గ్లామరస్ పిక్స్ తో రచ్చ చేసే ఈ అమ్మడు మరోసారి నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు తాజాగా వైట్ కలర్ అవుట్‌ఫిట్‌లో షేర్ చేసిన ఫోటోలు ఫాలోవర్స్ ని ఫిదా చేస్తున్నాయి.
ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్ మేకప్, లాంగ్ హెయిర్‌తో కెమెరా ముందు ఇచ్చిన పోజులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా వైట్ అండ్ లైట్ బ్లూ కాంబినేషన్‌లో కనిపించిన ఆమె లుక్ ఫ్యాషన్ లవర్స్ ని మెస్మరైజ్ చేస్తున్నాయనే చెప్పాలి. మాములుగా హీరోయిన్స్ ఫోటో షూట్స్ అంటే ఎంత హడావిడి చేస్తారో చెప్పక్కర్లేదు.కాని ఈ అమ్మడు మాత్రం సింపుల్‌గా కనిపిస్తూనే తన న్యాచురల్ బ్యూటీ ని రచ్చ చేస్తుంది.
ఇక భామ కెరీర్ విషయానికి వస్తే ప్రముఖ ర్యాపర్ బాద్‌షా, స్టార్ సింగర్ శ్రేయా ఘోషల్ కలిసి పాడిన ‘మాహియా’ అనే రొమాంటిక్ పాప్ సాంగ్‌లో కనిపించి సందడి చేసింది. నవంబర్ 4న విడుదలైన ఈ మ్యూజిక్ వీడియోలో ఆమె డ్యాన్స్ మూవ్స్, స్క్రీన్ ప్రెజెన్స్, లుక్స్ మ్యూజిక్ లవర్స్‌ను ఫిదా చేశాయనే చెప్పాలి.
మరోవైపు సిల్వర్ స్క్రీన్ పై కూడా అవనీత్ కౌర్ తన జోరును కంటిన్యూ చేస్తూనే ఉంది. గతంలో నవాజుద్దీన్ సిద్ధిఖీతో కలిసి నటించిన ‘టికు వెడ్స్ షేరు’ సినిమాతో నటిగా సత్తా చాటిన అవనీత్ ఆ తర్వాత ‘చిడియాఖానా’, ‘లవ్ కి అరేంజ్ మ్యారేజ్’ వంటి సినిమలాతో తనేంటో ప్రూవ్ చేసుకుంది.
ఇక ఈ మధ్యే శంతను మహేశ్వరితో కలిసి నటించిన ‘లవ్ ఇన్ వియత్నాం’ కూడా ఆమె కెరీర్‌లో ఒక స్పెషల్ మూవీ అని చెప్పుకోవాలి.ఇక ప్రస్తుతం అవనీత్ నటించిన గన్‌మాస్టర్ జీ9′ నవంబర్ 27, 2026న థియేటర్లలోరిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతుంది.బాలీవుడ్ స్టార్స్ ఇమ్రాన్ హష్మీ, జెనీలియా వంటి స్టార్స్ తో కలిసి అవనీత్ ఇందులో సందడి చేయబోతుంది.
ALSO READ:అప్పుడు గాజులు గలగల.. ఇప్పుడు అయ్యప్ప మాల.. మళ్లీ వచ్చేసిందే!
చూడాలి మరి భారీ ఆశలు పెటుకున్న ఈ సినిమా అవనీత్ కి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో .మొత్తంగా ఇలా ఒకవైపు సినిమాలు, మరోవైపు మ్యూజిక్ వీడియోలు, ఇంకోవైపు సోషల్ మీడియా ఫోటోషూట్లతో ఈ యంగ్ బ్యూటీ తన క్రేజ్‌ను డబల్ చేసుకునే పనిలో పడిందన్న మాట !