BigTV English

Revanth Cabinet Expansion: తెలంగాణ కేబినేట్ విస్తరణ.. వారికే ఛాన్స్, ఢిల్లీలో నేతల మకాం

Revanth Cabinet Expansion: తెలంగాణ కేబినేట్ విస్తరణ.. వారికే ఛాన్స్, ఢిల్లీలో నేతల మకాం

Revanth Cabinet Expansion: రేవంత్‌రెడ్డి కేబినెట్ విస్తరణ సీనియర్ నేతలను ఊరిస్తోంది. పది నెలలుగా పెండింగ్‌లో ఉన్న మంత్రి పదవులపై చాలా ఆశలు పెట్టుకున్నారు. మంత్రి పదవులు భర్తీ అవుతాయన్న ప్రచారంతో ఎవరికి వారు లాబీయింగ్ మొదలుపెట్టేశారు. తమకు తెలిసి నేతల ద్వారా పైరవీలు చేస్తున్నారు. ఇంతకీ రేసులో ఉన్నదెవరు? అనేదానిపై డీటేల్‌గా చూద్దాం.


గతేడాది డిసెంబరులో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డితోపాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. పెండింగ్‌లో మరో ఐదు కేబినెట్ బెర్తులున్నాయి. ఆనాటి నుంచి మంత్రి విస్తరణ అదిగో ఇదిగో అంటూ ప్రచారం సాగుతోంది. కేబినెట్ విస్తరణపై ఫీలర్లు వచ్చిన ప్రతీసారీ ఆశావహులు లాబీయింగ్ చేయడం, ఆ తర్వాత సైలెంట్ అయిపోవడం జరుగుతోంది.

జమ్మూకాశ్మీర్, హర్యానా ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేతలు ఎన్నికల బిజీలో ఉండిపోయారు. దీంతో తెలంగాణ మంత్రి విస్తరణను పెద్దగా పట్టించుకోలేదు. ఆ రాష్ట్రాలు ఎన్నికలు పూర్తి కావడం.. లేటెస్ట్‌గా మహారాష్ట్ర, జార్ఖండ్ శాసనసభలకు ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. తెలంగాణ నుంచి చాలామంది నేతలను బాధ్యతలు అప్పగించింది హైకమాండ్.


ఇదిలావుండగా  సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్ రెడ్డి హస్తిన బాట పట్టారు. సీడబ్ల్యూసీ సమావేశానికి వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ పనిలోపనిగా కేబినెట్ విస్తరణపై హైకమాండ్ తో చర్చించే అవకాశముందన్నట్లు తెలుస్తోంది. కేబినేట్ విస్తరణపై స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.

ALSO READ:  దిల్లీకి బయల్దేరిన సీఎం రేవంత్ రెడ్డి, సీడబ్ల్యూసీ భేటీ, క్యాబినెట్ బెర్తులపైనా కీలక సమావేశం

ఈసారి విస్తరణలో నలుగురుకి ఛాన్స్ దక్కవచ్చని గాంధీభవన్ వర్గాల మాట. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ నేతలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నాయి. దీంతో ఆశావహుల్లో కొత్త ఆశలు చిగురించాయి.

ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ప్రేమ్‌సాగర్ రావు, గడ్డం వివేక్ రేసులో ఉన్నారు. నిజామాబాద్ నుంచి సీనియర్ నేత సుదర్శన్‌రెడ్డి, గతంలో మంత్రిగా చేసిన అనుభవం ఆయన సొంతం. నల్గొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ రేసులో ఉన్నారు. బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరినప్పుడు హైకమాండ్ తనకు మాట ఇచ్చిందన్నది ఆయన వర్గీయులు చెబుతున్నారు.

గ్రేటర్ కోటాలో దానం, మల్‌రెడ్డి రంగారెడ్డి పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో మంత్రి పదవులు ఎవరిని వరిస్తుందో.. ఎవరి ఆశలు ఆవిరవుతాయో తెలియాంటే కొద్దిరోజులు వెయింట్ అండ్ సీ.

Related News

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండుకుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Big Stories

×