BigTV English

Good News for Farmers: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. మద్దతు ధర పెంపు

Good News for Farmers: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. మద్దతు ధర పెంపు

Modi Govt Increases MSP for 6 Rabi Crops: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంచింది. ఈ మేరకు గోధుమలపై రూ.150 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుకగా 3 శాతం డీఏ పెంపునకు ఆమోదం తెలిపింది.


అలాగే, రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా ‘పీఎం అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్’కు రూ.35వేల కోట్లు ఇచ్చేందుకు ఆమోద ముద్ర వేసింది. రబీ పంట సీజన్‌కు సంబంధించి నాన్ యూరియా ఎరువులకు రూ.24,475 కోట్ల సబ్సిడీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

2025-26 మార్కెటింగ్ సీజన్‌కు గానూ రబీ పంటలకు కనీస మద్దతు ధరను పెంచింది. క్వింటా గోధుమపై ఎంఎస్‌పీని తాజాగా, రూ.150 పెంచడంతో గతంలో రూ.2,275గా ఉన్న కనీన మద్దతు ధర పెరిగింది. దీంతో రూ.2,425 చేరినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.


Also Read: ఎయిర్‌లైన్స్‌కు బాంబు బెదిరింపులు.. పోలీసుల అదుపులో మైనర్.. పోస్టుల వెనక రహస్యమిదే!

అదే విధంగా క్వింటా ఆవాలుకు అత్యధికంగా రూ.300 పెంచగా.. క్వింటాల్ పెసరకు రూ.275, శెనగలకు క్వింటాల్‌పై రూ.210, ప్రొద్దు తిరుగుడుకు రూ.140, బార్లీకి రూ.130 చొప్పున పెంచారు. దీంతోపాటు యూపీలోని వారణాసిలో గంగా నదిపై కొత్త రైల్వే కమ్ రోడ్డు వంతెన నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుకు రూ. 2,642 కోట్ల వ్యయ అంచనాలు వేశారు.

Related News

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Big Stories

×