BigTV English

Ind vs NZ: బెంగళూరులో మరో 3 రోజులు వర్షాలు..టెస్ట్‌ మ్యాచ్‌ రద్దు కానుందా?

Ind vs NZ: బెంగళూరులో మరో 3 రోజులు వర్షాలు..టెస్ట్‌ మ్యాచ్‌ రద్దు కానుందా?

Ind vs NZ:  టీమిండియా (Team India) వర్సెస్ న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు… ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఈ రెండు జట్ల మధ్య బుధవారం ప్రారంభం కావాల్సిన మొదటి రోజు టెస్ట్ మ్యాచ్.. భారీ వర్షం కారణంగా రద్దయింది. అయితే రెండవ రోజు కూడా మ్యాచ్ ప్రారంభం అవడం చాలా కష్టమని చెబుతున్నారు నిపుణులు. బెంగళూరు మహానగరంలో మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్నాయట.


Also Read: Sania Mirza: మరో పాకిస్థాన్‌ వ్యక్తితో సానియా మీర్జా రెండో పెళ్లి ?

వాయుగుండం ప్రభావం కారణంగా… తమిళనాడు, కర్ణాటక అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో గత మూడు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూడు రాష్ట్రాలకు మరో మూడు రోజుల పాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ముఖ్యంగా బెంగళూరు నగరంలో మాత్రం… వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. బెంగళూరు నగరంలోని చాలా కాలనీలు ఇప్పటికే మునిగిపోయాయి. ఉడిపి, ఉత్తర కన్నడ, శివమొగ్గ, చిక్కమగళూరు, చిత్రదుర్గ, దావణగెరె మరియు తుమకూరు జిల్లాల్లో గురువారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD అంచనా వేసింది.


Also Read: IND vs NZ 2024 Test Series: రేపటి నుంచే టెస్టు సిరీస్… హాట్‌స్టార్‌లో రాదు! ఫ్రీగా ఎలా చూడాలంటే..?

గతంలో హైదరాబాద్ ఎదుర్కొన్న పరిస్థితిని ఇప్పుడు బెంగళూరు  ( Bengaluru )మహానగరం ఎదుర్కొంటోంది. ఉదయం లేస్తే చాలు వర్షం పడుతూనే ఉంది. అయితే.. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ ఉన్న నేపథ్యంలో… మరో మూడు రోజులు బెంగళూరులో వర్షాలు పడతాయని… అంపైర్లకు కూడా నివేదికలు వచ్చాయి. అయితే ఒకవేళ ఇవాళ ఉదయం… వర్షం తగ్గుముఖం పడితే… మ్యాచ్ ప్రారంభిస్తామని అంపైర్లు ఇప్పటికే ప్రకటించారు.

ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి సోషల్ మీడియాలో కూడా ప్రకటన చేసింది. రెండవ రోజు అంటే గురువారం వర్షం తగ్గితే.. ఉదయం ఎనిమిది గంటల 45 నిమిషాలకు టాస్ ప్రక్రియ.. నిర్వహించే ఛాన్స్ ఉందట. ఇక ఉదయం 9:15 నిమిషాలకు మ్యాచ్ కూడా ప్రారంభిస్తారు. ఒకవేళ వర్షం అంతరాయం కలిగితే.. మధ్యాహ్నం అయినా మ్యాచ్ ప్రారంభం చేసే అవకాశాలు ఉన్నాయి. వాతావరణ శాఖ అంచనా వేసినట్టు మూడు రోజులపాటు వర్షాలు ఉంటే.. టీమ్ ఇండియా (Team India)  వర్సెస్ న్యూజిలాండ్ మధ్య టెస్ట్ రద్దు అయ్యే ఛాన్స్ ఉంటుంది.

 

ఒకవేళ ఈ మ్యాచ్ రద్దు అయితే.. టీమిండియా కు ఊహించని ఎదురు దెబ్బ తగిలే ఛాన్స్ ఉంటుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కోసం కచ్చితంగా టీమిండియా కు (Team India) … పాయింట్స్ అవసరం. ఈ న్యూజిలాండ్ జట్టు పైన మూడు టెస్టులు విజయం సాధించి… ఆస్ట్రేలియాతో… కొన్ని మ్యాచ్లు ఓడిపోయిన… టీమిండియా కు డోకా ఉండదు. కానీ ఇప్పుడు వర్షం కారణంగా.. న్యూజిలాండ్తో టెస్ట్ రద్దు అవుతే టీమిండియా కు.. ఎదురుదెబ్బ తగలక తప్పదు.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×