BigTV English

Bharat : గూగుల్ మ్యాప్స్ లో భారత్ కు గుర్తింపు.. ఇకపై మన జాతీయ జెండాతో సహా..

Bharat : గూగుల్ మ్యాప్స్ లో భారత్ కు గుర్తింపు.. ఇకపై మన జాతీయ జెండాతో సహా..

Bharat : మనకేదైనా అడ్రస్ తెలియకపోతే.. గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి ఆ అడ్రస్ కోసం వెతికితే దారి చూపిస్తుందన్న విషయం తెలిసిందే. కొన్ని ప్రాంతాలను గూగుల్ మ్యాప్స్ లో వాటి ఫొటోలతో సహా గుర్తించవచ్చు. ఇప్పుడు మన దేశం కూడా గూగుల్ మ్యాప్స్ లో మన జాతీయజెండా గుర్తుతో సహా కనిపిస్తుంది. గూగుల్ మ్యాప్స్ లో ‘Bharat’ అని టైప్ చేస్తే.. జాతీయజెండాతో సహా దక్షిణాసియాలో ఒక దేశంగా చూపిస్తుంది. ఇందుకు భాషతో సంబంధం లేదు. సెర్చ్ లో భారతదేశం అని వెతికినా, భారత్ అని వెతికినా దక్షిణ ఆసియా దేశంగానే గుర్తించబడుతుంది.


గూగుల్ మ్యాప్స్ హిందీ వెర్షన్‌లో “भारत”ని చూపుతుంది. అదే ఇంగ్లీష్ లో సెర్చ్ చేస్తే.. భారత్, ఇండియా కు సంబంధించిన శోధన ఫలితాలు కనిపిస్తాయి. అధికారిక సమాచార మార్పిడిలో కేంద్ర ప్రభుత్వం నెమ్మదిగా ఇండియాకు బదులుగా భారత్ ను ఉపయోగిస్తున్న నేపథ్యంలో.. గూగుల్ కూడా దానినే పాటిస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం గూగుల్ మ్యాప్స్ లోనే కాదు.. శోధన, అనువాదం, వార్తలు, ఉత్పత్తుల్లో కూడా గూగుల్ తన వినియోగదారులకు సారూప్య ఫలితాలను అందించేందుకు భారత్, భారతదేశం అనే పదాలనే ఎంపిక చేసుకుంటోంది.

ఇటీవల.. కేంద్ర మంత్రివర్గానికి రైల్వే మంత్రిత్వ శాఖ “ఇండియా” ను తొలగించి దాని స్థానంలో “భారత్” అని చేర్చాలని ప్రతిపాదించింది. అందుకే గూగుల్ కూడా.. ఇంగ్లీష్, హిందీ భాషల్లోనూ భారత్ అనే పదాన్నే ఉపయోగించేందుకు మొగ్గు చూపుతోంది. హిందీలో “हिंदुस्तान”, “भारतवर्ष” అనే పదాలను కూడా గూగుల్ తన సెర్చింజన్ లో చేర్చింది.


Related News

Trump Tariff: ఇండియాకు మరో ఝలక్.. ఫార్మాపై ట్రంప్ పిడుగు.. 100% టారిఫ్..

UP CM Yogi: సీఎంని పాతిపెట్టేస్తాం.. ముస్లిం నేత వివాదాస్పద వ్యాఖ్యలు

Steel Spoons In Stomach: కడుపులో 29 స్టీల్ స్పూన్లు, 19 టూత్ బ్రష్ లు..అలా ఎలా మింగేశావ్ భయ్యా!

Bank Employee: అనారోగ్యంతో ఒక్క రోజు లీవ్ పెట్టిన బ్యాంకు ఉద్యోగి.. హెచ్ఆర్ నుంచి వార్నింగ్ మెయిల్

BSNL 4G Network: రేపటి నుంచే దేశంలో 4జీ సేవలు ప్రారంభం.. ప్రారంభించనున్న ప్రధాని మోదీ

PMAY Home Loan: అతి తక్కువ వడ్డీకే హోం లోన్.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?

MiG-21: ముగియనున్న మిగ్-21.. 62 ఏళ్ల సేవకు ఘన వీడ్కోలు

Naxal Couple Arrested: రాయ్‌పూర్‌లో మావోయిస్టు జంట అరెస్ట్..

Big Stories

×