E-Paper
Advertisement

సెన్సార్ పూర్తి చేసుకున్న ది ప్యారడైజ్.. రన్ టైం ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న ది ప్యారడైజ్.. రన్ టైం ఎంతంటే?
Advertisement

The Paradise Movie: నాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో శ్రీకాంత్ ఓదెల(Sreekanth Odela) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ది ప్యారడైజ్(The Paradise). ఈ సినిమా ఈ ఏడాది మొదట్లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పట్టు వచ్చింది. ఇలా పలుమార్లు వాయిదా అనంతరం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. 24వ తేదీ ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారకంగా తెలియజేశారు. ఇక సెప్టెంబర్ 24వ తేదీ ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది.

A సర్టిఫికెట్ జారీ చేసిన సెన్సార్ బోర్డు..

తాజాగా సెన్సార్ బోర్డ్ ఈ సినిమా వీక్షించిన అనంతరం ఈ సినిమాకు A సర్టిఫికెట్ జారీ చేశారు. అలాగే రన్ టైం వివరాలను కూడా సెన్సార్ బోర్డు వెల్లడించింది. ఈ సినిమాకు 2 గంటల 49 నిమిషాల నిడివి ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా విడుదలకు సెన్సార్ బోర్డు నుంచి ఏ విధమైనటువంటి అభ్యంతరాలు లేకుండా సెన్సార్ సర్టిఫికెట్ కూడా రావడంతో విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని చెప్పాలి. ఇకపోతే ఈ సినిమా సెప్టెంబర్ 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నప్పటికీ సెప్టెంబర్ 23వ తేదీనే ప్రీమియర్లు ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే .

800 షోలతో ప్రీమియర్లు..

Advertisement

ఈ నేపథ్యంలోనే ఏపీ అలాగే తెలంగాణ రాష్ట్రాలలో సుమారు 800 షోలు ప్రీమియర్లు ప్రసారం కాబోతున్నాయని సమాచారం. ప్రీమియర్ల కోసం 800 షోలు వేయడం అంటే మామూలు విషయం కాదు. ఇలా ఎన్నో అంచనాల నడుమ నాని ది ప్యారడైజ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నా చిత్ర నిర్మాతలు మాత్రం సినిమా విడుదలకు సంబంధించిన పనులలో బిజీగా ఉన్నారు నాని కూడా ఇతర ఇంటర్వ్యూలలో ఎక్కడ పాల్గొనకపోవడం గమనార్హం.

ట్రైలర్ లేకుండానే రిలీజ్…

ఇటీవల చిత్ర బృందం ఒక ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ప్రెస్ మీట్ మినహా నాని ఏ ఇంటర్వ్యూలకు హాజరు కాలేదు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదల చేసిన పాటలు టీజర్ వీడియో సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసింది. అయితే ట్రైలర్ వస్తే బాగుంటుందని అభిమానులు అందరూ భావించారు కానీ ఈ సినిమాకు ట్రైలర్ లేకుండానే థియేటర్లలో నేరుగా సినిమాని విడుదల చేయబోతున్నట్లు ఇటీవల చిత్రం నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. మరి సెప్టెంబర్ 24వ తేదీ రాబోతున్న ఈ సినిమా నాని కెరియర్ కు ఎలాంటి సక్సెస్ ఇస్తుందో తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో నాని జోడిగా కయాదులోహర్ నటించగా, స్పెషల్ సాంగ్ లో కీర్తి సురేష్ నటించిన సంగతి తెలిసిందే.

Advertisement

Also Read: ఈశ్వర్ సాయి మాధురి వివాదం.. సూసైడ్ అటెంప్ట్ చేసిన ఈశ్వర్ సాయి వైఫ్ శరణ్య!

Related News

ఏష నాగుల పాటకి కీర్తి సురేష్ రెమ్యునరేషన్.. వామ్మో అంత తీసుకుందా?

నటుడు అనంత్ నాగ్ కు ‘దాదాసాహెబ్ ఫాల్కే’ పురస్కారం!

జాన్వీ కపూర్ లుక్ అదిరిందిగా.. ఫొటోలు చూస్తే మతిపోవాల్సిందే!

ఇరుముడి దెబ్బకు శివ నిర్వాణ రేంజ్ మారిపోయిందా.. ఏకంగా చిరంజీవితో?

వేల కోట్ల స్కామ్.. ఇప్పుడు పూట గడవడం లేదు.. ఆర్థిక కష్టాల్లో ఐబొమ్మ రవి!

లండన్ లో జంటగా త్రిష విజయ్..త్రిష స్థానంలో నేనుంటే ఆ పని చేయను.. నటి ఫైర్!

శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్ ‘ టీజర్ రిలీజ్!

Big Stories

Advertisement
×