E-Paper
Advertisement

స్పోర్ట్స్ ఇయర్‌బడ్స్ కొనేముందు..ఈ 5 విషయాలు తప్పక తెలుసుకోండి!

స్పోర్ట్స్ ఇయర్‌బడ్స్ కొనేముందు..ఈ 5 విషయాలు తప్పక తెలుసుకోండి!
Advertisement

best sports earbuds for workout: ప్రస్తుత కాలంలో.. ఫిట్‌నెస్ మీద శ్రద్ధ చూపించే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. జిమ్, రన్నింగ్, యోగా లేదా సైక్లింగ్ చేసేటప్పుడు ఇయర్‌ బడ్స్ పెట్టుకుని మ్యూజిక్ ఎంజాయ్ చేయడం కామన్ అయిపోయింది. అయితే సాధారణ ఇయర్‌ బడ్స్‌కు, స్పోర్ట్స్ ఇయర్‌ బడ్స్‌కు చాలా తేడా ఉంటుంది. మార్కెట్లో.. వందలాది మోడల్స్ అందుబాటులో ఉన్నప్పటికీ, మన వర్కౌట్ స్టైల్‌కు సరి పోయే పర్ఫెక్ట్ ఇయర్‌ బడ్స్‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. దీనికోసం కొన్ని కీలకమైన అంశాలను తప్పకుండా పరిశీలించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు: 

1. సెక్యూర్ ఫిట్, డిజైన్ :

స్పోర్ట్స్ ఇయర్‌ బడ్స్ విషయంలో అత్యంత కీలకమైన అంశం వాటి ఫిట్టింగ్. మీరు జాగింగ్ చేస్తున్నప్పుడు లేదా హెవీ వర్కౌట్స్ చేసేటప్పుడు ఇయర్‌ బడ్స్ చెవుల్లో నుంచి కింద పడిపోకూడదు. అందుకే చెవులకు పర్ఫెక్ట్‌గా లాక్ అయ్యే ఇయర్ హుక్స్ లేదా వింగ్ టిప్స్ ఉన్న ఇయర్‌ బడ్స్‌ను ఎంచుకోవడం బెస్ట్. ఇవి ఎంత వేగంగా కదిలినా చెవుల నుంచి జారిపోకుండా గట్టిగా పట్టుకుని ఉంటాయి.

2. వాటర్ ,చెమట :

Advertisement

జిమ్‌లో లేదా రన్నింగ్ చేసేటప్పుడు విపరీతంగా.. చెమట పడుతుంది. అలాగే ఒక్కో సారి వర్షంలో కూడా జాగింగ్ చేయాల్సి రావచ్చు. సాధారణ ఇయర్‌ బడ్స్ అయితే చెమట తాకిడికి త్వరగా పాడైపోతాయి. కాబట్టి మీరు కొనే స్పోర్ట్స్ ఇయర్‌బడ్స్‌కు కనీసం IPX4 లేదా అంతకంటే.. ఎక్కువ వాటర్ అండ్ స్వెట్ రెసిస్టెంట్ రేటింగ్ ఉందా లేదా అనేది కచ్చితంగా చెక్ చేయాలి. ఇది వాటి లైఫ్‌స్పాన్‌ను పెంచుతుంది.

3. బ్యాటరీ బ్యాకప్, ఫాస్ట్ ఛార్జింగ్:

రోజూ జిమ్‌కు వెళ్లేవారికి ఇయర్‌ బడ్స్ ఎప్పుడూ ఛార్జింగ్‌లో ఉండటం కుదరదు. కాబట్టి సింగిల్ ఛార్జ్‌తో ఎక్కువ గంటలు పని చేసే బ్యాటరీ బ్యాకప్ ఉన్న.. డివైజ్‌ను ఎంచుకోవాలి. ముఖ్యంగా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న ఇయర్‌ బడ్స్ అయితే కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే గంటల తరబడి.. మ్యూజిక్ వినే అవకాశం ఉంటుంది. ఇది అత్యవసర సమయాల్లో చాలా ఉపయోగ పడుతుంది.

Advertisement

Also Read: చాటింగ్ సీక్రెట్స్..ఆన్‌లైన్‌లోకి రాకుండానే వాట్సాప్ మెసేలు చదవడం ఎలా?

4. సౌండ్ క్వాలిటీ, బేస్ :

వర్కౌట్ చేసేటప్పుడు మంచి ఎనర్జిటిక్ బీట్స్ ఉంటేనే.. మనలో ఉత్సాహం పెరుగుతుంది. అందుకే పంచ్ బేస్, క్రిస్టల్ క్లియర్ సౌండ్ అందించే స్పోర్ట్స్ ఇయర్‌ బడ్స్‌ను ఎంచుకోవాలి. కొన్ని బ్రాండ్లు ప్రత్యేకంగా.. స్పోర్ట్స్ ఆడియో ప్రొఫైల్‌తో వీటిని డిజైన్ చేస్తాయి. అలాగే.. ట్రాఫిక్ ఉన్న రోడ్లపై రన్ చేసేవారు పరిసరాలను గమనించడానికి వీలుగా ఉండే.. యాంబియంట్ సౌండ్ లేదా ట్రాన్స్‌పరెన్సీ మోడ్ ఉన్న ఇయర్‌ బడ్స్ ఎంచుకోవడం చాలా బస్ట్.

మంచి స్పోర్ట్స్ ఇయర్‌ బడ్స్ మీ వర్కౌట్ ఫీల్ పూర్తిగా మార్చివేయగలవు. కేవలం తక్కువ ధర లేదా.. అందమైన లుక్స్ చూసి కొనడం కాకుండా, పైన పేర్కొన్న ఫిట్మెంట్, వాటర్ రెసిస్టెన్స్, బ్యాటరీ , సౌండ్ క్వాలిటీ వంటి అంశాలను చెక్ చేసి సరైన ఇయర్‌ బడ్స్‌ను ఎంచుకోండి. మీ ఫిట్‌నెస్ గోల్స్‌ను రీచ్ అవ్వడానికి ఇది ఎంతగానో సహాయ పడుతుంది.

Related News

కీబోర్డ్‌లో ‘స్పేస్ బార్’ అంత పెద్దగా ఎందుకు ఉంటుందో తెలుసా? అసలు రహస్యం ఇదే!

ఫోన్ కెమెరా బాగున్నా ఫోటోలు బాగా రావడం లేదా? ఈ తప్పులు వెంటనే మానేయండి!

ఫ్రిజ్ లైఫ్ పెరగాలంటే.. ఈ చిన్న పని చేయాల్సిందే!

చాటింగ్ సీక్రెట్స్..ఆన్‌లైన్‌లోకి రాకుండానే వాట్సాప్ మెసేలు చదవడం ఎలా?

డిలీట్ అయిన ఫోటోలు మళ్లీ కావాలా? ఈ సీక్రెట్ సెట్టింగ్ మీ కోసమే

బెస్ట్ బ్లూటూత్ స్పీకర్..ఏఐ సౌండ్‌తో ఇల్లు దద్దరిల్లిపోతుంది

పాత టీవీ రిమోట్ పారేస్తున్నారా? ఈ 6 ట్రిక్స్ తెలిస్తే.. ఇంకెప్పుడు ఆ తప్పు చేయరు!

Big Stories

Advertisement
×