E-Paper
Advertisement

Revanth Reddy | కోదండరాంతో రేవంత్ రెడ్డి భేటీ.. కాంగ్రెస్‌కు టీజేఎస్ మద్దతుపై చర్చ

Revanth Reddy | టీజేఎఫ్ (TJS) చీఫ్ ప్రొఫెసర్ కోదండరాంతో (Kodandaram) టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ( Revanth reddy) భేటీ అయ్యారు. నాంపల్లిలోని టీజేఎస్ ఆఫీస్‌లో సోమవారం ఉదయం కోదండరాంను రేవంత్ కర్ణాటక మంత్రి బోసురాజు కలిశారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు తెలపాలని కోదండరాంను రేవంత్ ఈ సందర్భంగా కోరనున్నారు.

Revanth Reddy | కోదండరాంతో రేవంత్ రెడ్డి భేటీ.. కాంగ్రెస్‌కు టీజేఎస్ మద్దతుపై చర్చ
Advertisement

Revanth Reddy | టీజేఎస్ (TJS) చీఫ్ ప్రొఫెసర్ కోదండరాంతో (Kodandaram) టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ( Revanth reddy) భేటీ అయ్యారు. నాంపల్లిలోని టీజేఎస్ ఆఫీస్‌లో సోమవారం ఉదయం కోదండరాంను రేవంత్ కర్ణాటక మంత్రి బోసురాజు కలిశారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు తెలపాలని కోదండరాంను రేవంత్ ఈ సందర్భంగా కోరారు. కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడానికి టీజేఎస్ ఇప్పటికే అంగీకరించిన విషయం తెలిసిందే.

భేటీ అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ “కాంగ్రెస్‌కు ప్రొఫెసర్ కోదండరాం మద్దతు ఇవ్వాలని కోరేందుకే వచ్చాను. తెలంగాణకు పట్టిన పీడ వదలాలంటే కోదండరాం సహకారం అవసరం. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కలిసి ముందుకెళతాం. భవిష్యత్‌లో టీజేఎస్ ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యేలా ఒక సమన్వయ కమిటీ ఉంటుంది. ఎన్నికల క్షేత్రంలో టీజేఎస్, కాంగ్రెస్ కలిసి పనిచేస్తాయి. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో టీజేఎస్‌కు కీలక స్థానం ఉంటుంది. లక్ష్యాన్ని ముద్దాడే వరకు అండగా ఉంటామని కోదండరాం హామీ ఇచ్చారు”, అని టీపీసీసీ చీఫ్ వెల్లడించారు.

Advertisement

అలాగే సీట్లు ఓట్లు కంటే.. ఒక గొప్ప లక్ష్యం కోసం కలిసి పనిచేస్తుమని రేవంత్ రెడ్డి చెప్పారు. ఒక నియంతను గద్దె దించి ప్రజా పాలన తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ ప్రైవేటు సైన్యంపై అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటామని హెచ్చారించారు. కాంగ్రెస్‌కు ఎవరూ సాయం చేయకుండా కేటీఆర్ బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్లలో ప్రతిపక్ష నాయకులు ప్రైవేటుగా మాట్లాడుకున్న సంభాషణలను ఫోన్ ట్యాపింగ్ ద్వారా వింటున్నారని బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ చర్యలకు బీఆర్ఎస్ తగిన మూల్యం చెల్లించక తప్పదని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

ఇటీవల తెలంగాణ విచ్చేసిన కాంగ్రెస్ అగ్రనత రాహుల్‌ గాంధీతో భేటీ అయి కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడానికి కోదండరాం అంగీకారానికి వచ్చారు. అలాగే ఢిల్లీ వెళ్లి ఖర్గేతో కోదండరాం భేటీ అయ్యారు.

Advertisement

తెలంగాణలో నిరంకుశ పాలన చేసే కేసీఆర్‌ను గద్దె దింపాలనే అభిప్రాయాన్ని కోదండరాం వ్యక్తం చేయగా.. రాహుల్ గాంధీ ఏకీభవించారని ఆయన తెలిపారు. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, బీఆర్‌ఎస్ పాలనపై చర్చించామని ఆయన అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎన్నికల కార్యాచరణ విషయంలో తమతో మరోసారి కలిసి చర్చిస్తారని కోదండరాం ఆ సమయంలో వెల్లడించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కోదండరాంకు సముచిత పదవి దక్కే అవకాశమందని సమాచారం.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×