BigTV English

Israel-Gaza War : గాజాలో గ్రౌండ్ ఆపరేషన్.. సిరియాపై ఎయిర్ స్ట్రైక్స్

Israel-Gaza War : గాజాలో గ్రౌండ్ ఆపరేషన్.. సిరియాపై ఎయిర్ స్ట్రైక్స్

Israel-Gaza War : గాజాలో ఇజ్రాయెల్‌ ఆర్మీ ప్రారంభించిన గ్రౌండ్ ఆపరేషన్‌ కొనసాగుతోంది. గాజాను జల్లెడ పడుతూ ముందుకు వెళుతున్నాయి ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు. గాజాలోని ప్రజలంతా దక్షిణ ప్రాంతంవైపు వెళ్లిపోవాలంటూ ఇజ్రాయెల్ ఆర్మీ హెచ్చరికలు జారీ చేసింది. రాత్రి వేళల్లో అడ్వాన్స్‌ అవుతూ.. ఒక్కో ప్రాంతంలో ఆర్మీ పోస్ట్‌లు ఏర్పాటు చేస్తూ ముందుకు సాగుతోంది ఇజ్రాయెల్ ఆర్మీ.


మరోవైపు తమ రెండు ఆర్మీ పోస్టులపై ఇజ్రాయెల్ ఎయిర్‌స్ట్రైక్స్‌ జరిపిందంటూ సిరియా ప్రకటించింది. అయితే తమపై జరిపిన రాకెట్‌ దాడులకు కౌంటర్‌ అటాక్‌ చేశామని దాడులను సమర్థించుకుంది ఇజ్రాయెల్ ఆర్మీ. ఇప్పటికే సిరియాలోని రెండు ప్రధానమైన ఎయిర్‌పోర్ట్‌లు, పలు ఆర్మీ పోస్టులపై ఇజ్రాయెల్ దాడులు జరిపింది. తాజా దాడులు మరింత ఉద్రిక్తతలను పెంచడం ఖాయంగా కనిపిస్తోంది.

గాజాలో జరుగుతున్న గ్రౌండ్ ఆపరేషన్‌ కు సంబంధించిన అప్‌డేట్స్‌ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు వివరించారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు. ఇరవైనాలుగు గంటల్లో 450 హమాస్‌ స్థావరాలపై దాడులు చేసినట్టు తెలిపారు. అయితే హమాస్‌ మిలిటెంట్లు, సామాన్య ప్రజల మధ్య తేడాను గుర్తించాలని బైడెన్‌ కోరారు. దాడుల్లో గాజాకు చెందిన అమాయక ప్రజలు మృతిచెందకుండా వారిని కాపాడాలన్నారు. ప్రజల రక్షణకు ప్రాధాన్యతనిచ్చే అంతర్జాతీయ మానవతా చట్టాలకు అనుగుణంగా వ్యవహరించాలన్నారు.


గాజాపై ఇజ్రాయెల్‌ భీకర దాడులు చేస్తున్న వేళ టర్కీ అధ్యక్షుడు ఎర్దోగాన్ ఘాటుగా స్పందించారు. ఇజ్రాయెల్‌ను యుద్ధనేరాలకు పాల్పడుతున్న దేశమంటూ ఫైర్ అయ్యారు. తాము ఎప్పటికి గాజాకే అనుకూలంగా ఉంటామని తేల్చి చెప్పారు. ఈ వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ తీవ్రంగా స్పందించింది. టర్కీ నుంచి వెంటనే వెనక్కి వచ్చేయాలని తమ దౌత్యవేత్తలను ఆదేశించింది. అంతేకాదు పాము ఎప్పటికీ పామే అని.. ఎర్డోగాన్ తన ఇమేజీని పెంచుకోవాలని ప్రయత్నించినా.. ఆయన యూదు వ్యతిరేకిగానే ఉండిపోయారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది ఇజ్రాయెల్.

మరోవైపు రష్యాలోని ఓ ఎయిర్‌పోర్ట్‌లో పాలస్తీనా మద్దతుదారులు చేసిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఇజ్రాయెల్ నుంచి వచ్చిన ఓ విమానం టార్గెట్‌గా దాడులు చేశారు. ఎయిర్‌పోర్ట్‌లోకి చొరబడి.. రన్‌వేపైకి పరుగులు తీశారు. ప్రయాణికుల్లో ఇజ్రాయెల్‌ పౌరులు ఉన్నారా అంటూ తనిఖీలు నిర్వహించారు. దీంతో ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. వెంటనే ఎయిర్‌పోర్ట్‌ను మూసేసిన అధికారులు.. ఆందోళన కారులను బయటకు పంపేశారు.

రష్యాలో జరిగిన ఘటనపై ప్రపంచ దేశాలు స్పందించాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్‌ తీవ్రంగా స్పందించింది. ఇజ్రాయెల్ పౌరులకు రష్యాలో రక్షణ లేదా అంటూ ప్రశ్నించింది. అమెరికా కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×