E-Paper
Advertisement

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 నిధులు విడుదల చేయండి.. కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్‌ బహిరంగ లేఖ!

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 నిధులు విడుదల చేయండి.. కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్‌ బహిరంగ లేఖ!
Advertisement

Revanth Reddy: స్వేచ్ఛ బ్యూరో: హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌–2 విస్తరణకు అవసరమైన కేంద్రం అనుమతులతో పాటు ఐఆర్‌ఎఫ్‌సీ రుణ నిధుల విడుదల మరింత జాప్యం చేయవద్దని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డిని కోరారు. ఈ అంశంపై చర్చించేందుకు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ లేఖ రాశారు.

ప్రయాణికులకు  విశేష సేవలు

Advertisement

హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌–1 మూడు కారిడార్లలో 69 కిలోమీటర్లు ప్రయాణికులకు విశేష సేవలు అందిస్తోంది. పెరిగిన జనాభా, నగర విస్తరణకు అనుగుణంగా మెట్రో నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫేజ్‌–2 ప్రతిపాదనలను కేంద్రానికి సమర్పించింది. మొత్తం 7 కారిడార్లు, 122.9 కిలోమీటర్ల మార్గం, సుమారు రూ. 38,595 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రతిపాదనలు ఇచ్చింది.

సీఎం లేఖ

Advertisement

ఫేజ్‌–1 ప్రైవేటు నిర్వహణలో ఉండటం, ఫేజ్‌–2 వేరే సంస్థాగత విధానంలో అమలు చేయటంపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ తెలిపిన అభ్యంతరాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాత్మకంగా స్వీకరించిందని సీఎం ఈ లేఖలో వివరించారు. మొత్తం మెట్రో వ్యవస్థ ఒకే నెట్ వర్క్​లో నడిచేందుకు వీలుగా ఫేజ్‌–1ను స్వాధీనం చేసుకునే అసాధారణ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

ఫేజ్‌–1 స్వాధీనం ప్రక్రియలో ఈక్విటీ కొనుగోలుకు రూ. 1,461.47 కోట్లు, ప్రాజెక్టు అప్పుల రీఫైనాన్సింగ్‌కు రూ. 13,538.53 కోట్లు కలిపి మొత్తం రూ. 15,000 కోట్ల లావాదేవీలున్నాయి. ఈ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ పారదర్శకంగా నిర్వహించింది. ఈ కమిటీకి కేంద్ర ప్రభుత్వం తరఫున యూపీఎంఆర్‌సీఎల్‌ ఎండీ సుశీల్‌కుమార్‌ను సభ్యుడిగా నామినేట్‌ చేసిందని గుర్తుచేశారు.

Also Read: మర్డర్ కేసు కాదు మాస్టర్ గేమ్…. నిమిషానికో ట్విస్ట్ ఉన్న మెంటల్ మాస్ మిస్టరీ థ్రిల్లర్

రుణ మంజూరు ఒప్పందం

ఐఆర్‌ఎఫ్‌సీ ప్రాజెక్టును పూర్తిగా పరిశీలించి, డ్యూ డిలిజెన్స్‌ పూర్తి చేసి రుణ మంజూరు ఒప్పందం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అందుకు ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చింది. ఆర్​బీఐ ద్వారా డైరెక్ట్‌ డెబిట్‌కు అంగీకరించింది. ఐఆర్‌ఎఫ్‌సీ షరతుల ప్రకారం మొదటి విడత నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 84.32 కోట్ల అప్‌ఫ్రంట్‌ ఫీజు చెల్లించింది. ఈక్విటీ రూ. 1,461.47 కోట్లు ఇప్పటికే ఎస్క్రో ఖాతాలో జమ చేసింది.

సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం

ఈ ఒప్పందాలన్నీ పూర్తయ్యాక, అన్ని షరతులు నెరవేర్చాక, 2026 జూన్‌ 15న రావాల్సిన మొదటి విడత రుణం విడుదల కాలేదని ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి దానం అడగటం లేదని సీఎం స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఒప్పందం ప్రకారం ఐఆర్​ఎఫ్​సీ రుణాన్ని విడుదల చేయించాలని కోరుతున్నామని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ నుంచి కేంద్రంలో సీనియర్‌ మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి ఈ విషయంలో బాధ్యత తీసుకుని ఐఆర్‌ఎఫ్‌సీ ద్వారా మంజూరైన రుణం విడుదలయ్యేలా చూడాలని కోరారు. మెట్రో ఫేజ్‌–2ను కేంద్రం–రాష్ట్రం 50:50 జాయింట్‌ వెంచర్‌గా ఆమోదించాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోందని సీఎం ఈ లేఖలో వివరించారు.

రైల్వే మంత్రితో సమావేశం ఏర్పాటు

ఒకవేళ అనుమతులు ఆలస్యమైతే, రాష్ట్ర ప్రభుత్వం తన సొంత వనరులు, సంస్థాగత రుణాల ద్వారా ఫేజ్‌–2ను ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అందుకు అవసరమైన ముందస్తు అనుమతులను ఆలస్యం లేకుండా కేంద్రం నుంచి ఇప్పించాలని కోరారు. ఈ సమస్య పరిష్కారానికి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో త్వరగా సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం కిషన్‌రెడ్డిని కోరారు. సంబంధిత ఒప్పందాలు, ఆధార పత్రాలతో తాను అధికారులతో కలిసి ఆ సమావేశానికి హాజరై అన్ని వివరణలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

Related News

బాస్కెట్ బాల్ అసోసియేషన్ సెక్రటరీపై పోక్సో కేసు నమోదు

ఒక్కడివే నామినేషన్ ఫిల్ చెయ్ చూద్దాం.. సీఎం రేవంత్‌కి బిజెపి ఎంపీ ఓపెన్ ఛాలెంజ్!

ఎల్లంపేట్‌‌ మున్సిపల్ ఆఫీసులో ఇదేం విచిత్రం.. భార్యది అధికారం అయితే భర్తది పెత్తనమా..!

అమెరికాలో భట్టి విక్రమార్క హవా.. డల్లాస్‌లో గ్రాండ్ వెల్‌కమ్!

సీఎంఆర్ అక్రమాలపై ఉత్తమ్ ఫోకస్.. 12 ఏళ్ల లెక్కల తేల్చేందుకు సమీక్ష!

నాగర్‌కర్నూల్‌లో నకిలీ ఎరువుల కలకలం.. 872 సంచులు స్వాధీనం, 7 గురు అరెస్ట్!

ఫరీదాబాద్‌లో ఘోరం.. లేడీ టీచర్‌ను 30 సెకన్లలో 25 సార్లు పొడిచి చంపేశాడు!

హార్పిక్ ఘటన మరువక ముందే.. కూరలో విషం కలిపి భర్త, అత్తపై హత్యాయత్నం!

Big Stories

Advertisement
×