E-Paper
Advertisement

మర్డర్ కేసు కాదు మాస్టర్ గేమ్…. నిమిషానికో ట్విస్ట్ ఉన్న మెంటల్ మాస్ మిస్టరీ థ్రిల్లర్

మర్డర్ కేసు కాదు మాస్టర్ గేమ్…. నిమిషానికో ట్విస్ట్ ఉన్న మెంటల్ మాస్ మిస్టరీ థ్రిల్లర్
Advertisement

Thriller Movie : థ్రిల్లర్ జానర్లో ఉండే మిస్టరీ సినిమా మొదలైనప్పటి నుంచి ఎండ్ అయ్యేదాకా ఆడియన్స్ ను చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తాయి. అందుకే ఇలాంటి సినిమాలను ఓటీటీ మూవీ లవర్స్ తెగ ఇష్టపడుతుంటారు. అలాంటి వారి కోసమే ఈ మూవీ సజెషన్. 2019 ఆగస్టు 15న విడుదలై తెలుగు ప్రేక్షకులను అలరించిన అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ ‘ఎవరు’ (Evaru 2019 Movie). వెంకట్ రామ్‌జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అడివి శేష్, రెజీనా కసాండ్రా, నవీన్ చంద్ర, మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. స్పానిష్ సూపర్ హిట్ ‘ది ఇన్‌విజిబుల్ గెస్ట్’ ఆధారంగా కొన్ని కీలక మార్పులతో తీసిన ఈ చిత్రం… చివరి 20 నిమిషాల్లో వచ్చే మైండ్-బ్లోయింగ్ ట్విస్టులతో టాలీవుడ్‌లోనే ఒక మంచి థ్రిల్లర్‌గా నిలిచింది ఈ మూవీ. మరి ఈ మూవీని ఎక్కడ చూడవచ్చు ? స్టోరీ ఏంటి ? అన్న వివరాల్లోకి వెళ్తే…

కథలోకి వెళ్తే…

సమీరా మహాంతి (రెజీనా కసాండ్రా) ఒక ప్రముఖ వ్యాపారవేత్త భార్య. ఆమె తనను రేప్ చేయడానికి ప్రయత్నించిన డీఎస్పీ అశోక్ కృష్ణ (నవీన్ చంద్ర)ను ఆత్మరక్షణలో కాల్చి చంపినట్టు ఆరోపణలు ఎదుర్కొంటుంది. ఈ కేసు మీడియాలో భారీ సంచలనం సృష్టిస్తుంది. బెయిల్‌ పై బయట ఉన్న సమీరాను ఈ కేసు నుంచి కాపాడడానికి ఆమె భర్త విక్రమ్ వాసుదేవ్ (అడివి శేష్) ఒక అవినీతి పోలీస్ అధికారిని రంగంలోకి దింపుతాడు. డబ్బు కోసం ఏ పనైనా చేసే విక్రమ్, కేసు గెలవాలంటే సమీరా తనకు పూర్తి నిజం చెప్పాలని డిమాండ్ చేస్తాడు.

Advertisement

సమీరా ఒక్కొక్కటిగా తన వెర్షన్ చెప్పడం మొదలు పెడుతుంది. కానీ విక్రమ్ తన సొంత దర్యాప్తులో ఆమె కథలో ఉన్న లోపాలు, అబద్ధాలను పట్టుకుంటాడు. సమీరా, అశోక్ కృష్ణ మధ్య అక్రమ సంబంధం ఉందని, కొద్ది రోజుల క్రితం అదృశ్యమైన ఆదర్శ్ (రాజా విక్రమ్) అనే క్యాన్సర్ రోగికి కూడా ఇద్దరికీ సంబంధం ఉందని విక్రమ్ గుర్తిస్తాడు. ఆదర్శ్ ఏమైపోయాడు ? సమీరా నిజంగా ఆత్మరక్షణలో చంపిందా ? లేక దీని వెనుక పెద్ద ప్లాన్ ఉందా ? లంచగొండి విక్రమ్ వాసుదేవ్ అసలు ఎవరు ? ఆదర్శ్ తండ్రి, తల్లి పాత్రలు ఏంటి ? అనే ప్రశ్నలకు చివరి 20 నిమిషాల్లో వచ్చే షాకింగ్ ట్విస్టులు సమాధానం ఇస్తాయి. ఈ ట్విస్టులు ప్రేక్షకులకు దిమ్మతిరిగే థ్రిల్ ఇస్తాయి.

స్ట్రీమింగ్ ఎక్కడ ?

అడివి శేష్ విక్రమ్ వాసుదేవ్ పాత్రలో తెలివైన, లంచగొండి పోలీస్ అవతారంలో అద్భుతంగా నటించాడు. రెజీనా కసాండ్రా, నవీన్ చంద్ర, మురళీ శర్మ తదితరులు బాగా నటించారు. ఈ క్రైమ్ స్టోరీ ఒక్కొక్క ట్విస్ట్‌తో ప్రేక్షకుల మనసును ఊహించని దిశలో తీసుకెళ్తుంది. దర్శకుడు వెంకట్ రామ్‌జీ కథను చాలా చక్కగా నడిపించి, చివరి సీన్స్ వరకు ఉత్కంఠను మెయింటైన్ చేశాడు. ఈ సూపర్ హిట్ థ్రిల్లర్ ప్రస్తుతం Amazon Prime Videoలో తెలుగు ఆడియోతో సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

Read Also : ఇదెక్కడి విడ్డూరం… నెట్‌ఫ్లిక్స్‌ ట్రెండింగ్‌లో 8 ఏళ్ళ క్రితం విడుదలైన పాత వెబ్ సిరీస్

Related News

ఇంట్లో కూర్చుని 80 లక్షల సంపాదన… హర్రర్ గేమ్ ఆడుతూ ఆగమాగం… ఈ హర్రర్ థ్రిల్లర్ పెద్దలకు మాత్రమే

నైట్‌క్లబ్‌లో లేడీ డాన్సర్ల పవర్ వార్… రెండు కొప్పులు ఒకే చోట ఇమడవు అంటే ఇదేనేమో… తెలుగులో టర్కిష్ మూవీ

చిల్లర బ్యాచ్ కాదు… సీట్-ఎడ్జ్ యాక్షన్‌తో పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీ

సినిమా పిచ్చితో సీక్రెట్ పనులు… అపరిచితుడి ఎంట్రీతో అదిరిపోయే ట్విస్ట్… సింగిల్స్ కి మాత్రమే

కోటి బహుమతి కోసం ఎక్స్‌తో జోడీ… కట్ చేస్తే కాటికి తీసుకెళ్ళే ట్విస్ట్… సీక్రెట్ క్లబ్‌లో హారర్ మిస్టరీ

బైక్ పై ఇద్దరమ్మాయిల రచ్చ… అదిరిపోయే రోడ్ ట్రిప్ డ్రామా… నెవర్ బిఫోర్ కథ

కామాంధులను శిక్షించడానికి రంగంలోకి దిగే రహస్య శక్తి… మృత్యుదేవత విలయతాండవం

ఇన్సూరెన్స్ కోసం ముసలోళ్ల ఇంటికెళ్తే ఇదేం అరాచకం భయ్యా ? ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హర్రర్ మూవీ

Big Stories

Advertisement
×