E-Paper
Advertisement

Revanth Reddy : ఇందిరమ్మ రాజ్యం రావాలి.. దొరల పాలన పోవాలి..

Revanth Reddy : ఇందిరమ్మ రాజ్యం రావాలి.. దొరల పాలన పోవాలి..
Advertisement

Revanth Reddy : తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలి.. దొరల గడీల పాలన పోవాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కొడంగల్ తనకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిందంటూ ఈ నియోజకవర్గంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కొడంగల్ ను దత్తత తీసుకుంటానని గతంలో కేటీఆర్ చెప్పి మోసం చేశారని విమర్శించారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణను కొడంగల్ నియోజకవర్గమే దత్తత తీసుకుంటుందన్నారు.

కేసీఆర్ తెలంగాణ ప్రజలను నమ్మించి మోసం చేశారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వలేదన్నారు. తాను మాత్రం ఇందిరమ్మ రాజ్యంలో కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మిస్తామని మాట ఇచ్చారు. లక్ష కోట్లు దోచుకున్న కేసీఆర్ కు చర్లపల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కడతానన్నారు.

Advertisement

తెలంగాణలో మార్పురావాలని రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రావాలి.. దొరల గడీల పాలన పోవాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ వల్ల మోసం పోయిన 30 లక్షల నిరుద్యోగులు కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ ను గద్దె దించేందుకు పనిచేయాలన్నారు.

కొడంగల్ లో కాంగ్రెస్ విజయభేరి సభ జనసంద్రాన్ని తలపించింది. భారీ జనం పోటెత్తారు.తన ప్రసంగం చివరిలో.. “మార్పుకావాలి..కాంగ్రెస్ రావాలి” అని ప్రజలతో రేవంత్ చెప్పించారు. ఆ సమయంలో సభా ప్రాంగణం దద్దరిల్లింది. బైబై కేసీఆర్ అంటూ సభకు హాజరైనవారితో చెప్పించారు.

Tags

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×