Big Stories

Revanth Reddy : తెలంగాణ కాంగ్రెస్‌లో రేవంత్ మేనియా.. ఎక్కడికి వెళ్లినా జన ప్రభంజనం

Revanth Reddy Latest News

Revanth Reddy Latest News(Telangana congress news):

కేసీఆర్ వ్యూహాలతో తెలంగాణ కాంగ్రెస్ పనైపోతుందనుకున్న సమయంలో పార్టీ పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డి బహుముఖ వ్యూహాలతో పార్టీని ఇక్కడి వరకు తీసుకొచ్చారు. ఓవైపు ఎమ్మెల్యేలు కారెక్కుతున్నా అదరకుండా బెదరకుండా.. కాంగ్రెస్‌ను సింగిల్ హ్యాండ్ తో నడిపించారు. ఇప్పుడు డూ ఆర్ డై అన్న పొజిషన్ లో కాంగ్రెస్ ను గెలిపించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.

- Advertisement -

తెలంగాణలో హస్తం పార్టీకి పూర్వవైభవాన్ని ఎలాగైనా తేవాలనుకున్న రేవంత్ చేయని ప్రయత్నం లేదు. ఓ వైపు సొంత పార్టీలో అసంతృప్తిని చక్కబెడుతూనే.. ప్రత్యర్థిని కట్టడి చేయడం, టిక్కెట్ల కేటాయింపులు.. చర్చలు… సమీక్షలు… మీటింగ్ లు.. ఒక్కటేమిటి రేవంత్ రెడ్డి అన్నీంటా బిజీబిజీ..

- Advertisement -

తెలంగాణలో రేవంత్ రెడ్డి పేరు తెలియని వారు లేరు. అన్ని జిల్లాలు తిరిగారు. రాష్ట్ర స్వరూపంపై మొత్తం అవగాహన ఉన్న నేత. ఇంద్రవెల్లి నాగోబా జాతర అయినా.. ఇటు ములుగు జిల్లా సమ్మక్క సారలమ్మ జాతర అయినా.. ఇలా అన్నిటినీ సందర్శించి రాష్ట్ర పరిస్థితులపై అవగాహన పెంచుకున్నారు. ఏదో ఒకటి రెండు జిల్లాలకే పరిమితం అవకుండా ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా పార్టీలో జనంలో పట్టు పేరు పెంచుకున్నారు. 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక.. హైకమాండ్.. రేవంత్ రెడ్డిని 2021, జూన్ 26న టీపీసీసీ చీఫ్ గా నియమించింది. ఇక అప్పటి నుంచి పార్టీని ట్రాక్ లోకి తెచ్చి.. ఇప్పుడు కీలక ఘట్టం ముందు నిలపడంలో రేవంత్ సక్సెస్ అయ్యారు.

స్టార్ క్యాంపెయినర్‌గా రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్లినా జన ప్రభంజనమే కనిపిస్తోంది. కాంగ్రెస్ కు ఇదో పాజిటివ్ వేవ్ మాదిరిగా ఎక్కడ లేని ఉత్సాహాన్ని నింపుతోంది. కేసీఆర్ వ్యూహాలను తట్టుకుని కలబడడం, నిలబడడం అంటే మాటలు కాదు. అదీ కాంగ్రెస్ నేతలను ఒక్కతాటిపైకి తెచ్చి, అసంతృప్తులను బుజ్జగించి.. సమన్వయం కుదిర్చి.. ఒక్కటేమిటి చేయని పని అంటూ లేదు. నిద్రాహారాలు లేవు.. ఒకటే లక్ష్యం.. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ను ఇక్కడ అధికారంలోకి తేవడమే కర్తవ్యం.

అధికార పార్టీ సభల్లో ఉన్న జనం కంటే.. రేవంత్ రెడ్డి సభల్లో ఉన్న జనసందోహమే ఎక్కువ. ప్రతి చోటా ఘన స్వాగతం. కొడంగల్ లో నామినేషన్ మొదలు.. అలంపూర్ లో జోగులాంబ అమ్మవారి సాక్షిగా ప్రచారాన్ని షురూ చేసిన రేవంత్ కు పాలమూరు దగ్గర్నుంచి ఆదిలాబాద్ దాకా జన నీరాజనం పలుకుతున్నారు. సభలకు స్వచ్ఛందంగా తరలి వస్తున్న పరిస్థితి. రాష్ట్రంలో మార్పు వస్తుందనడానికి ఈ సభలే సంకేతం అంటున్నారు. రేవంత్ రెడ్డి ఫాలోయింగ్ రాత్రికి రాత్రి పెరిగింది కాదు. ఆయన సబ్జెక్టు, ఆయన మాట తీరు ఇవన్నీ కలిసి వచ్చాయి. ఇప్పుడు కీలక ప్రస్థానం ముందు నిలిచారు.

కేసీఆర్ లాంటి లీడర్ ను తట్టుకుని నిలబడడం, ఎన్నికల్లో గెలవడానికి వ్యూహాలు రచించడం ఇవన్నీ అనుకున్నంత ఈజీ కాదు. టీపీసీసీ పగ్గాలు చేపట్టిన డే వన్ నుంచే వ్యూహాలకు పదును పెడుతూ వచ్చారు. ప్రస్తుతం రేవంత్ మాస్టర్ స్ట్రోక్ తో బీఆర్ఎస్ షేక్ అవుతోంది. కొన్ని స్ట్రాటజీలు అమలు చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. ఎవరికి వారే యమునాతీరే అన్నట్లుగా ఉండే కాంగ్రెస్ లో అందరినీ ఒక్కతాటిపైకి తేవడం, ఒకే మాట, ఒకేబాటపై నిలబెట్టడం, అసంతృప్తులను బుజ్జగించడం, ఇవన్నిటినీ సక్సెస్ ఫుల్ గా సమన్వయం చేసుకొచ్చారు. పాలసీ, కాలిక్యులేషన్, కమ్యూనికేషన్, ఎగ్జిక్యూషన్ సూత్రంతో పని చేస్తున్నారు రేవంత్.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది.. ప్రజలకు ఏం ఇస్తుంది అన్న విషయాలను ప్రతి బహిరంగసభలో చర్చకు పెడుతున్నారు రేవంత్. ఇంకోవైపు బీఆర్ఎస్ సర్కార్ అరాచకాలు చేసిందంటూ వారిని కౌంటర్ చేస్తున్నారు. ఇలా బ్యాలెన్స్ డ్ గా ప్రచారాన్ని ఉరకలెత్తిస్తున్నారు రేవంత్. 119 నియోజకవర్గాలున్న తెలంగాణలో గెలవాలంటే 60 సీట్లు రావాలి. కానీ 75 సీట్లకు పైగా టార్గెట్ పెట్టుకున్నారు. కచ్చితంగా గెలిచే వారికే టిక్కెట్లు, గెలుపు గుర్రాలకే టిక్కెట్లు అన్న ఫార్ములా ప్రాతిపదికనే ఇచ్చారు. నియోజకవర్గాల్లో పెద్ద తలకాయలను పార్టీలో చేర్చుకున్నారు. ఇదే కాదు.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదును సీరియస్ గా, చాలా క్యాలిక్యులేటెడ్‌ గా చేశారు. తెలంగాణలో ఏ పార్టీ గెలిచి అధికారంలోకి రావాలన్నా 80 లక్షల ఓట్లు అవసరమని లెక్కలేసుకున్నారు. ఆ లెక్కన కాంగ్రెస్ లో 43 లక్షల మంది సభ్యులుగా చేరారని, వీరికి తోడు హస్తం పార్టీ సానుభూతిపరులు, పార్టీకి ఓటు వేయాలనుకునే సామాన్య ప్రజలు వీరికి అదనం అన్న కాలిక్యులేషన్స్ ఉన్నాయి. ఈసారి లెక్క తప్పదని, అత్యధిక మెంబర్షిప్ తో ఉన్న తమ పార్టీ కచ్చితంగా గెలుస్తుందన్న అంచనాతో రేవంత్ ఉన్నారు.

నిజానికి ఎన్నికలకు ముందు మ్యానిఫెస్టో రిలీజ్ చేయడం పార్టీలకు ఆనవాయితీ. కానీ రేవంత్ రెడ్డి మాత్రం కాస్త డిఫరెంట్ గా ఆలోచించారు. కొన్ని హామీలను ముందే ఇవ్వడం ద్వారా జనంలోకి చర్చ పెట్టాలని డిసైడ్ అయి.. వరుసగా డిక్లరేషన్లు జాతీయస్థాయి నేతలతో రిలీజ్ చేయిస్తూ వచ్చారు. మే 6, 2022 వరంగల్ లో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో రైతు డిక్లరేషన్ రిలీజ్ చేయించారు. ఆ తర్వాత ప్రియాంక గాంధీతో యూత్ డిక్లరేషన్, ఖర్గేతో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లు విడుదల చేయించారు.

కేవలం సొంత పార్టీ నేతల వ్యవహారాలను చక్కదిద్దడమే కాదు.. ప్రత్యర్థులను ట్రాప్ లోకి తీసుకురావడం కూడా ముఖ్యమే. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే పని చేశారు. ప్రజా సమస్యలకు సంబంధించి బహిరంగంగా సవాల్ చేయడం కీలకంగా మారింది. డబ్బు, మద్యం పంచకుండా ఎన్నికలకు వెళ్దామా అని రేవంత్ సీఎం కేసీఆర్ కు సవాల్ విసరడం, కొడంగల్ లో కేసీఆర్ పోటీకి రావాలనడం, కరెంట్ ఎంత ఇస్తున్నారో చూద్దాం పద అంటూ సవాళ్లు విసరడం ఇవన్నీ ప్రచారాల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News