BigTV English

Revanth Reddy : రైతులకు రేవంత్ బహిరంగ లేఖ.. ఆ అంశాలపై కేసీఆర్ ను ప్రశ్నించాలని పిలుపు..

Revanth Reddy : రైతులకు రేవంత్  బహిరంగ లేఖ.. ఆ అంశాలపై కేసీఆర్ ను ప్రశ్నించాలని పిలుపు..

Revanth Reddy : ఉచిత విద్యుత్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో పొలిటికల్ హీట్ ను పెంచాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య సవాళ్ల పర్వం సాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని రైతులకు రేవంత్ బహిరంగ లేఖ రాశారు. కేసీఆర్ రైతు వ్యతిరేక విధానాలు, రుణమాఫీపై కార్యాచరణకు పిలుపునిచ్చారు. రైతులతో రాజకీయం చేయడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. రైతు వేదికలను ఇన్నాళ్లూ అలంకారప్రాయంగా ఉంచిన అధికార పార్టీ ఇప్పుడు రాజకీయ వేదికలుగా మార్చడానికి బరి తెగించిందని ఆరోపించారు.


రైతు రుణమాఫీ కోసం రైతులు ఎంతో ఆశగా ఎదురు చూశారని రేవంత్ తెలిపారు. ఎన్నికలకు ముందు చివరి బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత రుణమాఫీ ఉండదన్న స్పష్టత వచ్చేసిందని అన్నారు. రాష్ట్రంలో రుణమాఫీకి 31 లక్షల మంది రైతులు అర్హులని స్పష్టం చేశారు. రూ.20 వేల కోట్ల మాఫీ చేయకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని మండిపడ్డారు. కేసీఆర్ మాటలు నమ్మి అప్పుల ఊబిలో చిక్కుకున్న రైతులు దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం సేకరించిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని
ఆదేశాలు ఇచ్చినా అవి కాగితాలకే పరిమితమయ్యాయని పేర్కొన్నారు. జూన్ 15 నాటికి రూ.6,800 కోట్ల బకాయిలు ఉన్నాయని తెలిపారు.

కేసీఆర్ 9 ఏళ్ల పాలనలో లక్షల ఎకరాల అసైన్డ్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని రేవంత్ ఆరోపించారు. గిరిజనులు, దళితులకు భూములు ఇవ్వడానికి మాత్రం ప్రభుత్వానికి చేతులు రాలేదని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు పోడు భూముల పట్టాలపై బీఆర్ఎస్ ప్రభుత్వం హడావుడి మొదలు పెట్టిందన్నారు. తెలంగాణలో 11.50 లక్షల మంది ఆదివాసీలు పోడు పట్టాలకు అర్హులని రేవంత్ వెల్లడించారు. అయితే 4 లక్షల మందికి మాత్రమే పట్టాలు ఇస్తున్నారని తెలిపారు.


రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చి కేవలం 10 గంటలు కూడా ఇవ్వడం లేదని రేవంత్ ఆరోపించారు. సబ్ స్టేషన్‌లో లాగ్ బుక్ లే ఇందుకు సాక్ష్యమని స్పష్టం చేశారు. ఈ ఆధారాలను కాంగ్రెస్ నేతలు బయటపెట్టడంతో బీఆర్ఎస్ సర్కార్ ఉలిక్కిపడిందన్నారు. అందుకే సబ్ స్టేషన్లలోని లాగ్ బుక్‌లను వెనక్కు తీసుకుందని వివరించారు.

రైతులను మోసం చేయడంలో కేసీఆర్ ఆల్ టైం రికార్డు సృష్టించారని రేవంత్ రెడ్డి విమర్శించారు. రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తారు? ధాన్యం డబ్బులు ఎప్పుడు జమ చేస్తారు? పోడు భూముల పట్టాలు ఎప్పుడు ఇస్తారో ప్రశ్నించాలని రేవంత్‌ రెడ్డి రైతులకు పిలుపునిచ్చారు.

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×