E-Paper
Advertisement

అన్నదాతకు సాగు సెగ.. వాణిజ్య పంటల సాగుతో రైతులు విలవిల

అన్నదాతకు సాగు సెగ.. వాణిజ్య పంటల సాగుతో రైతులు విలవిల
Advertisement

Farming Costs: స్వేచ్ఛ బ్యూరో: ఆరుగాలం శ్రమిస్తూ వివిధ పంటల సాగు కోసం పుడమి తల్లిని నమ్ముకొని వ్యవసాయం చేస్తున్న అన్నదాతలకు సాగు భారంగా మారుతోంది. ప్రతి ఏటా ఆశించిన స్థాయిలో మద్దతు లభించకపోగా పెరుగుతున్న విత్తనాల ధరలతో రైతులపై అధిక భారం పడుతోంది

యేటా రూ. కోట్లలో

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రైతులు 24 లక్షల ఎకరాలలో వివిధ రకాల పంటలను సాగుచేస్తున్నారు.గతంలో ఏ పంటలకు ఆశించే తెగుళ్ల బెడద లేని కారణంగా పెట్టుబడి ఎకరానికి 15 వేల వరకు అయ్యేది. ప్రస్తుతం ఏ పంట సాగు చేసినా 25 వేల నుంచి 35 వేలకు పైనే ఖర్చు అవుతోంది. దీంతో జిల్లా రైతులపై కోట్లలో భారం పడుతోంది. ముఖ్యంగా పంటల సాగుకు వాతావరణం అనుకూలించకపోవడం,కూలీల కొరత, ఆధునిక పద్ధతులు పాటించకపోవడం, భూసార పరీక్షలు చేయించుకోకుండా అధిక ఎరువుల వాడకం, ప్రభుత్వం రైతులకు విత్తనాలు అందించకపోవడం వంటి పలు అంశాలు అధిక ఖర్చులకు కారణం అవుతున్నాయని వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు

Advertisement

జోగులాంబ గద్వాల జిల్లాలో అధికంగా ప్రధాన వాణిజ్య పంటలైన మిరప, పత్తితో పాటు వరి,కంది, మొక్కజొన్న, జొన్న, పొగాకు తదితర పంటలను రైతులు సాగు చేస్తున్నారు. పంటల సాగుకు విత్తనాలతో పాటు భూమి దున్నడం, చదును చేసుకొని, అచ్చు కొట్టి విత్తనాలు పెట్టినప్పటి నుంచి పంట పూర్తయినంతవరకు వివిధ దశలో మొక్క ఎదుగుదలకు, మొగ్గ, సస్య రక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు పూత కాయ పట్టేందుకు వివిధ దశలలో ఎరువుల వినియోగం రసాయన మందులు కలుపులు తీసేందుకు కూలీల ఖర్చులు తోపాటు వాతావరణం అనుకూలించక అతివృష్టి అనావృష్టి వల్ల ఎదురయ్యే ఇబ్బందులను రైతులు ఎదుర్కొనేందుకు అనేక ప్రయాసాలకు ఓర్చి సాగు చేసిన పంటలలో దిగుబడి పొందేందుకు ప్రయత్నిస్తాడు. చివరకు కాస్తో,కూస్తో దిగుబడి వచ్చినా దానికి మద్దతు ధర లేక రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు.

Also Read: వ్యాపారస్తులకు బిగ్ రిలీఫ్.. 6 నెలల ఈఎంఐ కట్టక్కర్లేదు?

యాంత్రీకరణలోను

Advertisement

వ్యవసాయ రంగంలో యాంత్రీ కరణ రోజు రోజుకి పెరుగుతోంది. పంటల సాగుకు,కొంతమంది రైతులు పిచికారికి రెండు విధాల వినియోగిస్తున్నారు. ట్రాక్టర్లతో దుక్కులు దున్నడం, గ్రామాల సమీపంలోని చెరువులు, కుంటల నుంచి నల్ల మట్టి, సేంద్రియ ఎరువును తరలించడం వంటి పనులు చేస్తున్నారు. కానీ పెరుగుతున్న అన్నింటి ధరలు వారిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ట్రాక్టర్ల యజమానులు అద్దె ధరలను చెల్లించడంతో యేటా ఒక్కో రైతుపై ఎకరాకు రూ 200 నుంచి 400 పైగా ఉంటోంది.

సబ్సిడీపై విత్తనాలు అందించాలి : తిరుపతి రెడ్డి రైతు

ప్రతి సంవత్సరం పంటల సాగుకు మిరప పత్తి ఒరేయ్ కంది మొక్కజొన్న పొగాకు వంటి పంటలను సాగు చేస్తాము. వాణిజ్య పంట అయిన మిరప పత్తి విత్తనాల ధరలు అధికంగా ఉండడంతో పంట సాగుపై ఆశతో అధిక ధరలకు వెచ్చించి విత్తనాలను కొనుగోలు చేసి పంటలను సాగు చేస్తున్నాం. అయినప్పటికీ గతంతో పోలిస్తే ప్రస్తుతం పంటలపై అధికంగా వ్యాప్తి ఉండడంతో పెట్టుబడి ఖర్చులు పెరిగి దిగుబడులు గణనీయంగా పెరగడంతో ఏటా రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్రభుత్వాలు స్పందించి రైతులకు నాణ్యమైన విత్తనాలను సబ్సిడీ రూపంలో అందించడం ద్వారా కొంతమేర పెట్టుబడి ఖర్చు తగ్గే అవకాశం ఉంది.

Also read: యాదాద్రి జిల్లాలో 108 సిబ్బంది రికార్డు.. ఏం చేశారంటే..?

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×