BigTV English

Hyderabad News: ఒంటరి మహిళలకు చేయూత.. ‘ఆర్జే ఇన్సిపిరేషన్ హ్యాండ్స్‌‌’పై ప్రముఖుల ప్రశంసలు

Hyderabad News: ఒంటరి మహిళలకు చేయూత..  ‘ఆర్జే ఇన్సిపిరేషన్ హ్యాండ్స్‌‌’పై ప్రముఖుల ప్రశంసలు

RJ Inspiration Hands: ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఒంటరి మహిళలకు ఆసరాగా నిలుస్తూ, వారికి అభ్యున్నతి కోసం ‘ఆర్జే ఇన్సిపిరేషన్ హ్యాండ్స్’ సంస్థ అండగా నిలుస్తున్నది. ఈ సంస్థ సాకారంతో ఎంతో మంది ఒంటరి మహిళలు సొంత కాళ్ల మీద నిలబడుతున్నారు. ఈ సంస్థ సాకారంతో రకరకాల పనులు చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజా ఈ స్వచ్ఛంద సంస్థ అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఇన్‌ కమ్ ట్యాక్స్ కమిషనర్ జీవన్ లాల్, నటుడు నరేన్ వనపర్తి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.


‘ఆర్జే ఇన్సిపిరేషన్ హ్యాండ్స్’ సేవలు అద్భుతం- జీవన్ లాల్

ఒంటరి మహిళల శ్రేయస్సు కోసం పాటుపడుతున్న ‘ఆర్జే ఇన్సిపిరేషన్ హ్యాండ్స్’ సంస్థపై కమిషనర్ జీవన్ లాల్ ప్రశంసలు కురిపించారు. “‘ఆర్జే ఇన్సిపిరేషన్ హ్యాండ్స్’ సంస్థ గురించి చాలా కాలంగా వింటున్నాను. ఒంటరి మహిళల కోసం పాటుపడే సంస్థలు చాలా అరుదు. నాకు తెలిసి ఒంటరి మహిళల గురించి పని చేస్తున్న ఏకైక సంస్థ ఇదే. ఒంటరి మహిళల కష్టాలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. ఇంట్లో మగాళ్లు చేసే పనులతో మహిళలకు కష్టాలు వస్తాయి. ఒంటరి మహిళలను ఆదుకునేందుకు ప్రభుత్వాలు కూడా పెద్దగా ఆలోచించడం లేదు. ఈ సంస్థ ద్వారా ప్రభుత్వాలు ఒంటరి మహిళల కోసం ప్రత్యేకమైన పథకాలు తీసుకు వచ్చేలా ప్రయత్నాలు చేయాలి. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర ప్రభుత్వానికి ఈ సంస్థ లేఖలు రాయాలి. ఓ డేటా ప్రకారం ఇండియాలో ఏడున్నర కోట్ల ఒంటరి మహిళలున్నారు. అంటే, వారి మీద ఆధార  పడే వారి సంఖ్య దాదాపు 20 నుంచి 25 కోట్ల మంది ఉంటారు. వీరందరి కోసం ప్రభుత్వం కచ్చితంగా ఆలోచించాలి. అలా ఆలోచించేలా ఈ సంస్థ ముందు ఉండి పని చేయాలి. వీరికి ఏ సాయం కావాలన్నా నేను ముందుంటాను. వీలైన సాయాన్ని అందిస్తాను” అన్నారు.


ఒంటరి మహిళల కష్టాలు తెలిసే ఈ సంస్థను స్థాపించా- ఉమ

ఒంటరి మహిళలు పడే కష్టాలు తనకు తెలిసే ఈ సంస్థను స్థాపించానని ‘ఆర్జే ఇన్సిపిరేషన్ హ్యాండ్స్’ వ్యవస్థాపకురాలు ఉమా కార్తిక్ అన్నారు. “తండ్రి లేకుండా పిల్లల్ని పెంచడం సాధారణ విషయం కాదు. నాకు కూడా చిన్న పిల్లలున్నారు. ఒంటరి మహిళల కష్టాలు నాకు తెలుసు. వారికి వీలైనంత సాయం చేయాలని ఈ సంస్థను స్థాపించాను. త్వరలోనే ఓ స్కూల్‌ ని కూడా స్థాపించాలని అనుకుంటున్నాను. దానికి అందరి సపోర్ట్ కావాలి” అని కోరారు.

‘ఆర్జే ఇన్సిపిరేషన్ హ్యాండ్స్‌’కు ఆర్థికసాయం‌

అటు ‘ఆర్జే ఇన్సిపిరేషన్ హ్యాండ్స్‌’‌ చేస్తున్న సేవా కార్యక్రమాల కోసం కమిషనర్ జీవన్ లాల్ ఈ సంస్థకి రూ. 25 వేలు విరాళాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సుజాత రూ.5 వేలు అందించారు. అటు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు.. పిల్లలకు స్కూల్ బాగ్స్ అందించారు. wroom సంస్థ లంచ్ బాక్స్ బాగ్స్ అందించింది.

Read Also: హైదరాబాద్ లో సొమ్నిఫెరా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్, ప్రారంభించించిన నటి సిమ్రాన్ చౌదరి

Related News

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Big Stories

×