RCB New Bowling Coach: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( IPL 2025) కోసం… అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరో నాలుగు రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన మెగా వేలం కూడా నిర్వహించబోతుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ కు సంబంధించిన పది ఫ్రాంచైజీలు… ఏ ప్లేయర్ని కొనుగోలు చేయాలనే దానిపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో… ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కోసం బెంగళూరు రాయల్ చాలెంజెస్ భారీ ప్లాన్ చేసింది.
Also Read: Champions Trophy 2025: పాకిస్థాన్ సంచలన నిర్ణయం..జట్టు కోసం రంగంలోకి వహాబ్ రియాజ్ !
వచ్చే సీజన్ కోసం సరికొత్త ప్లేయర్ ను బరిలోకి దింపుతుంది. ఇప్పటికే రిటెన్షన్ లో ముగ్గురు ప్లేయర్లను.. కొనుగోలు చేసిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్… ఇప్పుడు కొత్త కోచ్ ను నియామకం చేసింది. మొదటి నుంచి బౌలింగ్లో… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు వీక్ అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బౌలింగ్ విభాగాన్ని బలంగా చేసుకునేందుకు… సంచలన నిర్ణయం తీసుకుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కోసం కొత్త బౌలింగ్ ( RCB New Bowling Coach ) కోసం రంగంలోకి దింపింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. వచ్చే సీజన్ కోసం… కొత్త బౌలింగ్… కోచ్ సారథ్యంలో బరిలోకి దిగనుంది. అయితే… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలింగ్ కోచ్గా ఓంకార్ సాల్వి నియామకం కాబడ్డారు. ముంబై రంజి టీం కు సంబంధించిన హెడ్ కోచ్ గా ఓంకార్ సాల్వి ( Omkar Salvi ) పనిచేశారు. ఆయనకు బౌలింగ్లో అపారమైన అనుభవం ఉంది. ప్రస్తుతం ముంబై రంజి టీం హెడ్ కోచ్ గా కూడా ఆయన పనిచేస్తున్నారు. ముంబై రంజి టీం ను… ట్రాక్ లో పెట్టింది ఆయనే.
Also Read: Ganguly on Rohit Sharma: కొడుకు పుడితే..మ్యాచ్ ఆడవా ? – రోహిత్ పై గంగూలీ సీరియస్ !
అందుకే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అతని నియామకం చేసుకుంది. రంజిత్ ట్రోఫీ 2023 – 2024 నేపథ్యంలోనే ముంబై హెడ్ కోచ్గా ఓంకార్ సాల్వి బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఆయన హెడ్ కోచ్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ముంబై… రంజిత్రోఫీ విజేతగా కూడా నిలవడం జరిగింది. దాదాపు 8 సంవత్సరాల తర్వాత రంజీ ట్రోఫీని గెలుచుకుంది ముంబై. అయితే ఈ సక్సెస్ వెనుక.. ఓంకార్ సాల్వి ఉన్నారన్న సంగతి తెలిసిందే.
అయితే ఆయన అనుభవాన్ని ఆర్సిబి వినియోగించుకోవాలని… తాజాగా బౌలింగ్ కోచ్గా ఓంకార్ సాల్విని నియామకం చేసుకుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆయనకు ఆటగాడిగా పెద్దగా అనుభవం లేదు. 2005 సంవత్సరంలో రైల్వేస్ తరఫున ఒకే ఒక్క మ్యాచ్ ఆడడం జరిగింది. తన కెరీర్ లో ఇప్పటివరకు ఒకే ఒక్క వికెట్ తీసుకున్నారు. బౌలర్గా ఆయనకు పెద్దగా అనుభవం లేదు కానీ కోచ్గా బాగా రాణిస్తారు.