Somnifera Health And Wellness Centre: హైదరాబాద్ లో అత్యాధునిక హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ప్రారంభం అయ్యింది. దేశంలోనే తొలి అత్యాధునిక టెక్నాలజీతో కూడిన హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ సొమ్నిఫెరాను జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో సినీనటి సిమ్రాన్ చౌదరి ప్రారంభించారు. సొమ్నిఫెరా ఫౌండర్, చైర్మన్ సెల్వకుమార్, డైరెక్టర్ కార్తిక్ కుమార్, హంమెడ్ టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ నిగమ్ గుప్తాతో కలిసి లాంచ్ చేశారు.
అవకాశాన్ని ఉపయోగించుకోండి- సిమ్రాన్ చౌదరి
దేశంలోనే తొలి సొమ్నిఫెరా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు సినీనటి సిమ్రాన్ చౌదరి. “ఫస్ట్ సొమ్నిఫెరా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ప్రారంభించడం హ్యాపీగా ఉంది. అదీ హైదరాబాద్ లో లాంచ్ చేయడం ఇంకా సంతోషంగా ఉంది. ఇక్కడ అత్యాధునిక టెక్నాలజీతో మన శరీరంలో చాలా సింటెమ్స్ ముందుకుగానే గుర్తిస్తారు. దానికి తగినట్లుగా ట్రీమెంట్ ఇస్తారు. వీలైనంత వరకు హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. యోగా, వర్కౌట్స్ చేయాలి. నేను రోజూ హెల్తీ ఫుడ్ తీసుకుంటాను. డైలీ యోగా చేస్తాను. మంచి స్కిన్ కేర్ టిప్స్ పాటిస్తాను. రోజంతా యాక్టివ్ గా ఉంటాను. ఎప్పుడూ హ్యాపీగా ఉండేందుకు ప్రయత్నిస్తాను” అని సిమ్రాన్ వెల్లడించారు.
ఏడు సంవత్సరాల కల నెరవేరింది- చైర్మన్ సెల్వకుమార్
సొమ్నిఫెరా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ను ఏర్పాటు చేయాలనేది తన ఏడు సంవత్సరాల కలని ఫౌండర్, చైర్మన్ సెల్వకుమార్ చెప్పారు. “సొమ్నిఫెరా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఏడు సంవత్సరాలుగా అనుకుంటున్నాను. ఇన్నాకళ్లకు ఆ కల నెరవేరింది. చాలా సంతోషంగా ఉంది. ఇండియాలో అదీ హైదరాబాద్ లో ఈ కొత్త అత్యాధునిక టెక్నాలజీతో కూడిన హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ను తీసుకురావడం సంతోషంగా ఉంది” అన్నారు.
Read Also: ఈ ఒక్కటి ముఖానికి వాడితే.. తెల్లగా మెరిసిపోతారు తెలుసా ?
మిడిల్ క్లాస్ వాళ్లకు అందుబాటులో ట్రీట్మెంట్- శివరంజని
శరీరంలోని సమస్యలను ముందే గుర్తించి ట్రీట్మెంట్ అందిస్తామని సొమ్నిఫెరా నిర్వాహకులు శివరంజని తెలిపారు. “సొమ్నిఫెరా డైరెక్టర్ ఎన్నో దేశాలు తిరిగారు. మన భారతీయులుకు అనుగుణంగా ఉండే ట్రీట్మెంట్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలి అనుకున్నారు. మిడిల్ క్లాస్ వాళ్లకు కూడా ట్రీట్మెంట్ అందుబాటులో ఉండాలి అనుకున్నారు. మంచి ట్రీమెంట్ అందించే విధంగా ఇండియాలోనే మొట్ట మొదటి సొమ్నిఫెరా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ మన హైదరాబాద్ లో ప్రారంభించారు. మన శరీరంలో మూడేళ్ళలో ఎలాంటి ప్రాబ్లమ్ రావొచ్చు అని ముందుగానే సెలీలారు ద్వారా తెలుసుకొని వారికి అవసరమైన ట్రీట్మెంట్ అందిస్తాం” అని చెప్పుకొచ్చారు. ఇక సొమ్నిఫెరా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా పలువురు మోడల్స్ సందడి చేశారు.
Read Also: మొటిమలను గోళ్లతో గిల్లడం మొదలుపెట్టారా? అది మచ్చలకే కాదు, ఇంకెన్నో సమస్యలకు కారణం అవుతాయి