E-Paper
Advertisement

Rohithreddy : ఈడీ విచారణకు హాజరుకాని రోహిత్ రెడ్డి.. మళ్లీ అదే వ్యూహం..

Rohithreddy : ఈడీ విచారణకు హాజరుకాని రోహిత్ రెడ్డి.. మళ్లీ అదే వ్యూహం..
Advertisement

Rohithreddy : తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఈడీ విచారణకు ముందు ట్విస్ట్ ఇచ్చారు. తాను విచారణకు హాజరు కాలేక పోతున్నానని ఈడీ అధికారులకు లేఖ పంపారు. ఈడీ తనకు చాలా తక్కువ సమయం ఇచ్చిందని వరుస సెలవులు కావడంతో బ్యాంక్ స్టేట్‌మెంట్లు, ఇతర డాక్యుమెంట్లు సేకరించలేక పోయానని ఆ లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. విచారణకు హాజరయ్యేందుకు తనకు ఈ నెల 25 వరకు సమయం ఇవ్వాలని కోరారు.

రోహిత్ రెడ్డి ఈడీ విచారణకు హాజరవుతారని తొలుత భావించారు. ఇంటి నుంచి ఆయన బయలుదేరగానే ఈడీ కార్యాలయానికే వెళుతున్నారని అందరూ అనుకున్నారు. ఇంతలో ఆ కారు ప్రగతిభవన్ వైపు వెళ్లింది. అక్కడ సీఎం కేసీఆర్ తో రోహిత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈడీ నోటీసులపై సుధీర్ఘంగా చర్చించారు. ఈ వ్యవహారంలో ఏ విధంగా ముందుకెళ్లాలన్నదానిపై అంతుకుముందే న్యాయ నిపుణులతో చర్చించారని సమాచారం. కేసీఆర్ తో భేటీ తర్వాత సీన్ మారిపోయింది. విచారణ హాజరుకాలేని రోహిత్ రెడ్డి ఈడీ అధికారులకు లేఖ పంపారు.

Advertisement

ఈడీకి లేఖ
డిసెంబర్ 15న బెంగుళూరు డ్రగ్స్ కేసులో రోహిత్ రెడ్డికి ED నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో డిసెంబర్ 19న విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. అయితే ఈడీ విచారణకు మరికొంత సమయం కావాలని రోహిత్ రెడ్డి తన పీఏ శ్రవణ్ కుమార్ ద్వారా లేఖ పంపారు. మరి ఆ లేఖపై ఈడీ అధికారులు ఎలా స్పందిస్తారనే ఉత్కంఠ నెలకొంది.

మళ్లీ అదే వ్యూహం
ఢిల్లీ మద్యం స్కామ్ కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చినప్పుడు అనుసరించిన వ్యూహాన్ని గులాబీ బాస్ ఇప్పుడు రోహిత్ రెడ్డి కేసులో విషయంలో అమలు చేస్తున్నారు. అప్పుడు కూడా తొలుత కవిత సీబీఐ నుంచి నోటీసులు రాగానే సమాధానం చెప్పడానికి సిద్ధమని ప్రకటించారు. విచారణ తేది దగ్గర పడిన సమయంలో సీబీఐ అధికారులకు ట్విస్ట్ ఇచ్చారు. తొలుత డిసెంబర్ 6న కవిత స్టేట్ మెంట్ ను సీబీఐ అధికారులు రికార్డు చేయాల్సిఉంది. అయితే సీబీఐ నుంచి నోటీసులు అందిన తర్వాత కేసీఆర్ తో ప్రగతి భవన్ లో కవిత రెండుసార్లు భేటీ అయ్యి ఆ కేసుపై చర్చించారు. న్యాయనిపుణులను సంప్రదించారు. ఆ తర్వాత సీబీఐకు ట్విస్ట్ ఇచ్చారు.

Advertisement

సీబీఐ చెప్పిన సమయంలో విచారణకు కుదరదని కవిత తేల్చిచెప్పారు. తాను ఆ రోజు అందుబాటులో ఉండనని స్పష్టం చేస్తూ సీబీఐకు లేఖ పంపారు. డిసెంబర్ 11, 12, 14, 15 తేదీల్లో సీబీఐ అధికారులకు అందుబాటులో ఉంటానని ఆఫ్షన్లు ఇచ్చారు. మొత్తం మీద కవిత అందుబాటులో ఉన్న డిసెంబర్ 11న ఆరున్నర గంటలపాటు కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఢిల్లీ మద్యం స్కామ్ కేసులో ఆమె నుంచి స్టేట్ మెంట్ రికార్డు చేశారు. ఇదే తరహా రోహిత్ రెడ్డి కూడా ఈడీ అధికారులు విచారణకు సిద్ధమైన సమయంలో లేఖ ద్వారా ట్విస్ట్ ఇచ్చారు.

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×