BigTV English

Mahesh Babu: గౌత‌మ్ గురించి మ‌హేష్‌కి ముందే చెప్పిన డాక్ట‌ర్లు!

Mahesh Babu: గౌత‌మ్ గురించి మ‌హేష్‌కి ముందే చెప్పిన డాక్ట‌ర్లు!

Mahesh Babu: మ‌హేష్ ఆరోజు ఫిల్మ్ సిటీలో సినిమా షూటింగ్‌లో ఉన్నారు. అర్జంటుగా హాస్పిట‌ల్‌కి రావాల‌ని ఆయ‌న‌కి ఫోన్‌. తీరా వచ్చాక పుట్ట‌బోయే కొడుకు గురించి చెప్పారు. కొడుకు పుడుతున్నాడ‌ని చెప్పినందుకు ఆనందించాలా? వారి చెప్పిన మాట విని బాధ‌ప‌డాలా? ఏమీ అర్థం కాలేదు మ‌హేష్‌కి. అయినా త‌ను తేరుకుని, న‌మ్ర‌త‌కు ధైర్యం చెప్పారు. త‌మ జీవితాల్లో అత్యంత భ‌యాన‌క‌మైన ఆ క్ష‌ణాల‌ను గుర్తు చేసుకున్నారు న‌మ్ర‌త‌. ఏడో నెల్లో చెక‌ప్ కోసం హాస్పిట‌ల్‌కి వెళ్లారు న‌మ్ర‌త‌. చెక‌ప్ చేసిన వైద్యులు పేగును గౌత‌మ్ మెడ‌కి వేసుకున్నాడ‌ని చెప్పారు. సిజ‌రియ‌న్ చేసి బిడ్డ‌ను బ‌య‌ట‌కు తీయ‌క‌పోతే ప్రాణాల‌కు ప్ర‌మాదం అని చెప్పారు. ఒక‌వేళ ఆప‌రేషన్ చేసినా, బిడ్డ ప్రాణాల‌కు భ‌రోసా ఇవ్వ‌లేమ‌ని మ‌హేష్‌కి ముందే చెప్పారు. తీరా ఆప‌రేష‌న్ స‌క్సెస్ అయింది. గౌత‌మ్ ఒక‌టిన్న‌ర కిలో ఉన్నాడు. ఆ రోజు నుంచీ మూడు వారాల పాటు వైద్యుల సంర‌క్ష‌ణ‌లోనే ఉన్నాడు.
అది కూడా రోజుకు 40 గ్రాములు పాలు తాగి, ప‌ది గ్రాములు పెరిగాడు. గౌత‌మ్ కోలుకునేవ‌ర‌కు న‌మ్ర‌త‌కు, మ‌హేష్‌కీ కంటి మీద కునుకు లేదు. ప్ర‌తి రోజూ దేవుడికి ద‌ణ్ణం పెట్టి ప‌డుకునేవారు. ఆ దేవుడే వైద్యుల రూపంలో వ‌చ్చి త‌మ బిడ్డ‌ను త‌మ‌కు ద‌క్కించార‌ని అంటారు న‌మ్ర‌త‌.


త‌న 17 ఏళ్ల కాపురంలో ర‌త్నాల్లాంటి బిడ్డ‌లు క‌ల‌గ‌డం త‌న అదృష్ట‌మ‌ని అంటారు. ఏ కాపుర‌మైనా స‌జావుగా సాగ‌డానికి భార్యాభ‌ర్త‌ల‌కు న‌మ్మ‌కం ఉండాలంటారు. ఒక‌రికొక‌రు తోడుగా ఉంటూ, ఒక‌రి మీద ఒక‌రు గౌర‌వం పెంచుకున్న‌ప్పుడే కాపురం నిల‌బ‌డుతుంద‌ని చెబుతారు న‌మ్ర‌త‌. మ‌హేష్ ఎక్క‌డికైనా బ‌య‌ట‌కు వెళ్తే ఎక్క‌డికెళ్లావ్‌? ఎవ‌రితో ఉన్నావ్‌? అని విసిగించ‌న‌ని అంటారు ఆమె. త‌న‌ని కూడా మ‌హేష్ విసిగించ‌డ‌ని అంటారు. మ‌హేష్ – న‌మ్ర‌త ప్రేమ వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా త‌మ ఫ్యామిలీ సంగ‌తుల‌ను ఓ యూట్యూబ్‌తో పంచుకున్నారు న‌మ్ర‌త‌.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×