Big Stories

PSN Medicare Company: ఐడీఏ బొల్లారం మెడికేర్ కంపెనీలో సోదాలు.. 90 కిలోల డ్రగ్స్ సీజ్!

drugs Seized in IDA Bollaram PSN Medicare Company
drugs Seized in IDA Bollaram PSN Medicare Company

90 kg Drugs Seized in PSN Medicare Company: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపుతోంది. నిన్న వైజాగ్ లో 25 వేల కిలోల డ్రగ్స్ పట్టుబడిన విషయం తెలిసిందే. తాజాగా.. హైదరాబాద్ శివారులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఇంటర్ పోల్ ఆఫీసర్స్ ఇచ్చిన సమాచారం మేరకు నగర శివారులోని ఐడీఏ బొల్లారంలో ఉన్న PSN మెడికేర్ లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి.

- Advertisement -

కంపెనీలో 8.99 కోట్ల రూపాయల విలువైన 90.48 కిలోల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. PSN మెడికేర్ లోనే 3-MMC (Methylmethcathinone) డ్రగ్స్ ను తయారు చేసి.. యూరప్ కు ఎక్స్ పోర్ట్ చేస్తున్నట్లు గుర్తించారు. కంపెనీ డైరెక్టర్ కస్తూర్ రెడ్డి నెమళ్లపూడిని అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడీఏ బొల్లారంలో ఉన్న ఈ కంపెనీపై ఎక్సైజ్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకుండా YLVO1 అనే కోడ్ నేమ్ తో తయారు చేస్తున్న పౌడర్ ను గుర్తించారు.

- Advertisement -

అక్రమంగా డ్రగ్స్ తయారు చేసి.. విదేశాలకు పంపుతున్న కస్తూర్ రెడ్డి.. విదేశీయులతో అనేక కాంటాక్ట్స్ ఉన్నట్లు గుర్తించారు. PSN మెడికేర్ డైరెక్టర్ తో పాటు.. ప్రొడక్షన్ మేనేజర్ సుధాకర్ రెడ్డి, క్వాలిటీ కంట్రోల్ ఇన్ఛార్జ్ వెంకటేశ్వర్లను కూడా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు.

Also Read: విశాఖపట్నంలో డ్రగ్స్ కలకలం.. 25 వేల కేజీల కొకైన్ సీజ్..

కాగా.. వైజాగ్ పోర్టులో పట్టుబడిన 25 వేల కేజీల డ్రగ్స్ విషయంలో రాజకీయ దుమారం రేగుతోంది. అది మీ పనంటే మీ పనే అని అధికార, ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించుకున్నాయి. దీనిపై సంధ్య ఆక్వా ఎక్స్ పోర్టర్స్ క్లారిటీ ఇచ్చింది. తమ కంపెనీకి ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని చెప్పింది. రొయ్యల మేత కోసం జనవరిలో ఆర్డర్ చేశామని, అందులోనే డ్రగ్స్ దొరికాయని చెప్పింది. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News