Big Stories

Delhi Liquor Policy Case: ఢిల్లీ మద్యం కుంభకోణం.. అసలేం జరిగింది..? లెక్కలివే..!

Delhi Liquor Policy Case
Delhi Liquor Policy Case

Delhi Liquor Policy Scam amount and Full Details: ఢిల్లీ మద్యం కుంభకోణం గత కొన్నాళ్లుగా దేశంలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌తో ఈ కేసు క్లైమాక్స్ చేరింది. ఇప్పటికే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియా ఇదే కేసులో జైలులో ఉన్నారు. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇటీవల అరెస్ట్ అయ్యారు. వైసీపీ ఎంపీ మాగంట శ్రీనివాసులురెడ్డి తనయుడు రాఘవ గతంలో అరెస్ట్ అయ్యారు. ఇలా ఈ కేసులో తెలుగు రాష్ట్రాలకు సంబంధం ఉంది. అనేకమంది కవిత సన్నిహితులు కూడా అరెస్ట్ అయ్యారు. అసలేంటి ఢిల్లీ మద్యం కుంభకోణం. ఆ వివరాలు తెలుసుకుందాం.

- Advertisement -

ఢిల్లీ మద్యం పాలసీ లెక్కలు..
సీబీఐ, ఈడీ విచారణలో వెల్లడైన అంశాల ప్రకారం..  మద్యం వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడ్డారు. ఢిల్లీ లిక్కర్ పాలసీని రూపొందించారు. హోల్ సేల్ వ్యాపారులకు 5 శాతం మార్జిన్ ఇవ్వాలని నిపుణుల కమిటీ సిఫార్స్ చేసింది. కానీ దాన్ని పక్కన పెట్టారు. హోల్ సేల్ వ్యాపారుల మార్జిన్ ను 12 శాతానికి పెంచారు. అందులో 6 శాతం ఆప్ నేతలకు ఖాతాల్లో చేరేలా స్కామ్ చేశారు. హోల్ సేల్ ప్యాపారులకు మార్జిన్ పెంచడం వల్ల ప్రభుత్వ ఖజానాకు గండిపడింది. దాదాపు రూ. 581 కోట్ల నష్టం వచ్చిందని సీబీఐ నిర్ధారించింది.

- Advertisement -

ఢిల్లీలోని రిటైల్ జోన్ల వేలంలో రూ. 5,037 కోట్ల ఆదాయమే వచ్చింది. వాస్తవానికి ఆ వేలంలో రూ. 7,029 కోట్ల ఆదాయం రావాలి. ఇలా ప్రభుత్వానికి మరో రూ. 2 వేల కోట్ల నష్టం జరిగింది. ఇలా మొత్తం ఢిల్లీ ప్రభుత్వ ఖజానాకు రూ. 2,873 కోట్ల నష్టం వాటిల్లిందని సీబీఐ తేల్చింది. అదే సమయంలో ఆప్ నేతల ఖాతాల్లో మాత్రంలో భారీగా నగదు చేరిందని నిర్ధారించింది.

Also Read: కేజ్రీవాల్ రాజీనామా చేస్తారా? ఢిల్లీ సీఎం బాధ్యతలు చేపట్టేదెవరు?

అరెస్టుల పర్వం..
సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది. సీబీఐ ఐదుగురిని అరెస్ట్ చేయగా.. ఈడీ 16 మందిని అరెస్ట్ చేసింది. మొత్తం 31 మంది నిందితులపై 5 ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది. మరో 6 అనుబంధ ఛార్జీ షీట్లు రూపొందించింది.

సీబీఐ టూ ఈడీ.. 
2021-22 ఫైనాన్షియల్ ఇయర్ లో ఢిల్లీ ప్రభుత్వం లిక్కర్ పాలసీని రూపొందించింది. కానీ ఈ విధానాన్ని చిల్లర, టోకు వ్యాపారులకు లాభం చేకూర్చేలా తయారు చేశారని ఆరోపణలు వచ్చాయి. కేంద్ర హోంశాఖ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ పాయ్ చేసిన ఫిర్యాదు ఆధారంగా సీబీఐ దర్యాప్తు మొదలుపెట్టింది. 2022 ఆగస్టు 17న ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

అవినీతి నిరోధక చట్టం కింద అప్పటి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపై కేసు నమోదైంది. నాటి ఢిల్లీ ఎక్సైజ్ కమిషనర్  గోపికృష్ణ, డిప్యూటీ కమిషనర్ ఆనంద్ తివారీ, సహాయ కమిషనర్ పంకజ్ భట్నాగర్‌పై ఆరోపణలు వచ్చాయి. వారు ప్రైవేట్ వ్యక్తులకు ప్రయోజనం కలిగించేలా మద్యం పాలసీని రూపొందించారని సీబీఐ నిర్ధారించింది. ఇందుకోసం ముడుపులు తీసుకున్నారని తేల్చింది. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కింగ్ పిన్ గా గుర్తించింది.

Also Read: Kavitha EC Custody : నేటితో ముగియనున్న కవిత కస్టడీ.. మరో మూడురోజులు పొడిగిస్తారా ?

కవిత పాత్ర..
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సౌత్ గ్రూప్‌లో కవిత కీలకంగా వ్యవహరించారని ఈడీ దర్యాప్తులో తేల్చింది. శరత్ చంద్రారెడ్డి, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డితో కలిసి ఈ వ్యవహారం నడిపారని నిర్ధారించింది. రూ.100 కోట్ల ముడుపులను ఆప్ టాప్ లీడర్లకు ఇచ్చారని ఈడీ , సీబీఐ గుర్తించాయి.

ఢిల్లీ సీఎం  కేజ్రీవాల్‌తో కవిత ఒప్పందం కుదుర్చుకున్నారని దర్యాప్తులో తేలింది. అప్పటి ఢిల్లీ ఎక్సైజ్ మంత్రిగా ఉన్న మనీశ్ సిసోడియాకు లంచం ఇచ్చారని రిమాండ్ రిపోర్టులో ఈడీ వివరించింది. దీంతో లిక్కర్ పాలసీ తయారీలోని అంశాలను కవితకు అనుకూలంగా మార్చడానికి అంగీకరించారని ఈడీ తేల్చింది.

అరుణ్ పిళ్లై ద్వారా కవిత ఇండోస్పిరిట్స్ కంపెనీలో వాటా పొందారని ఈడీ పేర్కొంది. దేశంలో టాప్ లిక్కర్ బిజినెస్ కంపెనీ పెర్నాడ్ రికార్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లిక్కర్ సరఫరా వ్యాపారంలోనూ పార్టనర్ షిప్ పొందారని వివరించింది. ఢిల్లీ లిక్కర్ బిజినెస్ లో ఇండోస్పిరిట్స్ సంస్థకు లాభాలు వచ్చేలా చేశారని పేర్కొంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News