Telangana : తెలంగాణలో కొత్తగా సమాచార శాఖ కమిషనర్లను నియమించింది ప్రభుత్వం. మొత్తం నలుగురికి అవకాశం కల్పించింది. సీనియర్ జర్నలిస్ట్ పీవీ శ్రీనివాసరావు, మొహసినా పర్వీన్, దేశాల భూపాల్, బోరెడ్డి అయోధ్యరెడ్డిని ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వీరు మూడేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు.
సీనియర్ జర్నలిస్టు పీవీ శ్రీనివాస్‌ను స్టేట్ ఆర్టీఐ కమీషనర్‌గా నియమించింది సర్కారు. ఆర్టీఐ కమీషనర్లుగా మొహసిన్ పర్వీన్, దేశాల్ భూపాల్, బోరెడ్డి అయోధ్యరెడ్డిలకు అవకాశం కల్పించింది. అయితే ఇటీవల ఆర్టీఐ కమిషనర్లుగా హరిప్రసాద్, రాములు, వైష్ణవి, PLN ప్రసాద్‌ల పేర్లను ప్రభుత్వం గవర్నర్‌కు ప్రతిపాదించింది. అయితే వారికి గవర్నర్ ఆమోదం లభించలేదు. తాజాగా మరో నలుగురి పేర్లను ప్రభుత్వం ప్రతిపాదించగా.. గవర్నర్ ఆమోదముద్ర వేశారు.