Nagababu – Pawan Kalyan: ఎమ్మెల్సీ నాగబాబు మజాకా.. ఇప్పుడు సరికొత్త విషయాన్ని, సరికొత్తగా లేవనెత్తి, గుర్తుకు వస్తున్నాయి అనే పాటను అందుకున్నారు. అంతేకాదు ఏడాది క్రితం తన తమ్ముడితో తాను మాట్లాడిన మాటలు ఒక్కసారిగా గుర్తుకు తెచ్చుకున్నారు. నాగబాబు చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నాగబాబు స్టైల్ వేరబ్బా..
ఎమ్మెల్సీ నాగబాబు స్టైల్ వేరని అంటుంటారు జనసైనికులు. చెప్పాలనుకున్నది చెప్పడంలో, ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టడంలో నాగబాబు తర్వాతే. ఇటీవల జనసేన ఆవిర్భావ దినోత్సవం సంధర్భంగా నాగబాబు చేసిన కామెంట్స్ ఒక సంచలనమే. ఎవరో ప్రోత్సాహిస్తే, తమ అధినాయకుడు అంటే తమ్ముడు పవన్ కళ్యాణ్ గెలుపు రాలేదని, పిఠాపురం ప్రజలు ఆశీర్వదించడంతోనే ఇది సాధ్యమైందన్నారు. ఈ కామెంట్స్ తో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ వర్గం భగ్గుమంది. సోషల్ మీడియా వేదికగా నాగబాబును టార్గెట్ చేస్తూ, కొందరు తెలుగు తమ్ముళ్ళు నెగిటివ్ కామెంట్స్ తో మోత మోగించారు.
ఎమ్మెల్సీ నాగబాబు..
జనసేన పార్టీని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్థాపించిన సమయం నుండి నాగబాబు వెన్నంటి ఉన్నారు. మెగా బ్రదర్ చిరంజీవి జోక్యం చేసుకోక పోయినప్పటికీ, నాగబాబు మాత్రం ఫుల్ ప్లెడ్జ్ పొలిటీషియన్ అయ్యారు. ఎన్నికలకు ముందు పార్టీ పనులు చక్కబెట్టడంలో, పిఠాపురంలో పార్టీని బలపరచడంలో నాగబాబు పాత్ర కీలకమే. అయితే పార్టీకి అన్న చేసిన మేలుకు గుర్తుగా పవన్, ఎమ్మెల్సీ పదవిని నాగబాబుకు కట్టబెట్టారు.
పవన్ విజయం సరే.. వెనుక
పవన్ కళ్యాణ్ లేని దేశ రాజకీయాన్ని ఇప్పుడు ఊహించలేము. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఒక పార్టీని స్థాపించి నేడు పవన్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి, ఆ మాట నెరవేర్చడంలో పవన్ మార్క్ ఎప్పటికీ ప్రజల్లో నిలుస్తుంది. ఎన్నికలకు ముందు వారాహి దీక్ష సమయం నుండి, నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేవరకు పవన్ చేసిన కృషి ఎనలేనిది. ఓ వైపు పార్టీని కాపాడుకుంటూ, మరో వైపు టిడిపి, బిజెపిలతో జత కలిసి యావత్ భారత్ ఏపీ వైపు చూసే మెజారిటీ కూటమికి దక్కింది. ఈ గెలుపులో పవన్ పాత్ర కీలకం. అందుకే సాక్షాత్తు పీఎం మోడీజీ కూడా పవన్ కు అంతే ప్రాధాన్యత ఇస్తారు.
ఇంతకు నాగబాబు ట్వీట్ ఏంటి?
ఇలా పవన్ కళ్యాణ్ తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకొని, ప్రస్తుతం ప్రజాసేవలో లీనమయ్యారు. తాజాగా నాగబాబు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ సారాంశం ఏమిటంటే, సేనాని..
సరిగ్గా ఏడాది క్రితం మనిద్దరి మధ్య జరిగిన సంభాషణ నిజమైంది, మీరు చిందించిన చెమట కూటమి గెలుపుకు బాటైంది, జవాబుదారీతనంతో కూడిన పరిపాలన ప్రజలకు చేరువైంది. చిన్నారుల బంగారు భవిష్యత్తుకు మార్గం సుగమమైంది. ఆడ బిడ్డలు, అక్క చెల్లెళ్ళకు రక్షణ తోడైంది, అయిదున్నర కోట్ల ఆంధ్రుల కల నిజమైంది అంటూ ట్వీట్ చేశారు. అందుకు ఒక ఫోటో ను యాడ్ చేశారు.
Also Read: Nizamabad Girls: ఈ జిల్లా యువతులను టచ్ చేస్తే.. ఇక బెడ్ రెస్ట్ ఖాయం..
ఆ ఫోటోలో ఏముంది?
నాగబాబు షేర్ చేసిన ఫోటోలో పవన్ కళ్యాణ్ కూర్చొని ఉండగా, నాగబాబు తల దువ్వూతూ ఉన్నారు. ఆ సమయంలో ఎలాగైనా అధికారంలోకి రావాలి, రాష్ట్రం బాగుపడాలి అంటూ వారు మాట్లాడుకున్న తీరును నాగబాబు మే 12న ట్వీట్ చేశారు. అంటే ఏడాది క్రితం ఇదే రోజు పవన్ రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఆ సంధర్భాన్ని నాగబాబు తన సోషల్ మీడియాలో పేజీలో పంచుకున్నారు.
సేనాని..
సరిగ్గా ఏడాది క్రితం మనిద్దరి మధ్య జరిగిన సంభాషణ నిజమైంది, మీరు చిందించిన చెమట కూటమి గెలుపుకు బాటైంది, జవాబుదారీతనంతో కూడిన పరిపాలన ప్రజలకు చేరువైంది. చిన్నారుల బంగారు భవిష్యత్తుకు మార్గం సుగమమైంది. ఆడ బిడ్డలు, అక్క చెల్లెళ్ళకు రక్షణ తోడైంది, అయిదున్నర కోట్ల ఆంధ్రుల కల… https://t.co/ekTxrRhTby— Naga Babu Konidela (@NagaBabuOffl) May 12, 2025