RAPO 22 Update: దేవదాస్ సినిమాతో హీరోగా తెలుగు తెరకి పరిచయమయ్యాడు రామ్ పోతినేని.. ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత రామ్ వరుసగా సినిమాలు చేసుకుంటూ.. టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. గత ఏడాది పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన డబల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా ఆశించినంత స్థాయిలో విజయాన్ని సాధించలేదు.. రామ్ నెక్ట్ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.. తాజాగా రామ్ 22వ సినిమా అప్డేట్ అనౌన్స్ చేశారు చిత్ర యూనిట్. అంతేకాక ఆ మూవీలో కన్నడ స్టార్ నటించనునట్లు ప్రకటించారు. ఆ విశేషాలు చూద్దాం..
సరైన పాత్రకు సరైన హీరో..
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రధాన పాత్రలో కొత్త చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి RAPO 22 గా తెరకెక్కిస్తున్నారు. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మహేష్ బాబు పి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర నటించబోతున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఆయన సూర్య కుమార్ అనే పాత్రలో ఈ సినిమాలో నటించనున్నారు. అందనివాడు అందరివాడు మన సూర్య కుమార్ అంటూ తాజాగా ఉపేంద్ర లుక్ ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ఉపేంద్ర ఓ సూపర్ స్టార్ పాత్రలో కనిపిస్తున్నారు. ఆయనకు బిగ్ ఫ్యాన్ గా రామ్ కనిపించనున్నట్లు సమాచారం. ఈ మూవీలో ఉపేంద్ర స్టార్ హీరో సూర్య కుమార్ పాత్రలో, హీరో రామ్ సాగర్ పాత్రలో కనిపించనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. మే 15న రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ అఫీషియల్ గా రిలీజ్ చేయడమే కాక, ఫస్ట్ గ్లిమ్స్ వీడియోని కూడా విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇప్పుడు ఈ మూవీ లో ఉపేంద్ర నటిస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. సరైన పాత్రలో సరైన హీరో ని తీసుకున్నారు అని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఆ మూవీలో దేవరాజ్ ..ఇప్పుడు సూర్య కుమార్ ..
ఇక ఇప్పటికే ఉపేంద్ర తెలుగు సినిమాలలో అతిధి పాత్రలో కనిపించడం మనం చూసాం. అల్లు అర్జున్ తో సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ఉపేంద్ర దేవరాజ్ గా నటించి మెప్పించారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు మరోసారి రామ్ పోతినేని సినిమాలో సూపర్ స్టార్ పాత్రలో మన ముందుకు రానున్నారు. ఇక ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ కు మంచి హిట్ అయినా రామ్ నుంచి హిట్టు సినిమా పడలేదు. ఆ తర్వాత వచ్చిన స్కంద మూవీ అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. మరోసారి పూరీ జగన్నాథ్ తో డబల్ ఇష్మార్ట్ గా ప్రేక్షకులు ముందుకు వచ్చిన అది ఆశించినంత స్థాయిలో విజయాన్ని సాధించలేదు. ఈ మూవీలో రామ్ నటనకు మంచి మార్కులు అయితే పడ్డాయి కానీ, సినిమా అయితే హిట్టు కాలేదు. ఇక రామ్ ఆశలన్నీ రాబోయే తన 22వ సినిమా పైనే ఉన్నాయి. ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్నారు. రావు రమేష్, సత్య, రాహుల్ రామకృష్ణ, ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ మూవీ విడుదలైన తరువాత ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Naveen Chandra: టికెట్ డబ్బులు వాపస్… లెవన్ మూవీకి నవీన్ చంద్ర హామీ
అందనివాడు.. అందరివాడు… 🤩
Presenting our Superstar @nimmaupendra garu as 'SURYA KUMAR' – a tribute to the Spirit of Every Superstar we admire and look up to.#RAPO22 ❤️🔥
The exciting #RAPO22TitleGlimpse drops on May 15th 💥@ramsayz #BhagyashriBorse @filmymahesh… pic.twitter.com/2jlJ0yV2qp
— Mythri Movie Makers (@MythriOfficial) May 12, 2025