BigTV English

Samagra Kutumba survey: నేటి నుండే స‌మ‌గ్ర‌ కుటుంబ స‌ర్వే.. ఈ ప‌త్రాలు ద‌గ్గ‌ర పెట్టుకోండి.. చివ‌రికి ఇది మ‌ర్చిపోవ‌ద్దు!

Samagra Kutumba survey: నేటి నుండే స‌మ‌గ్ర‌ కుటుంబ స‌ర్వే.. ఈ ప‌త్రాలు ద‌గ్గ‌ర పెట్టుకోండి.. చివ‌రికి ఇది మ‌ర్చిపోవ‌ద్దు!

Samagra Kutumba survey: రేవంత్ స‌ర్కార్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌డుతున్న స‌మగ్ర కుటుంబ స‌ర్వే నేటి నుండే ప్రారంభం కానుంది. ఈ రోజు నుండి ఎన్యూమ‌రేట‌ర్లు ఇంటింటికి వెళ్లి పూర్తి కుటుంబ స‌భ్యుల వివ‌రాలను సేక‌రిస్తారు. ఇప్ప‌టికే మూడు రోజుల పాటు స్టిక్క‌రింగ్ ప్రాసెస్ పూర్తి చేశారు. స‌ర్వేకు సంబంధించిన వివ‌రాను సైతం ప్రాణాళిక శాఖ వెల్ల‌డించింది. ఇందులో భాగంగా కుల‌, సామాజిక‌, విద్య‌, ఉపాధి త‌దిత‌ర వివ‌రాలను అడిగి న‌మోదు చేసుకుంటారు. నిజానికి న‌వంబ‌ర్ 6 నుండి స‌ర్వే ప్రారంభం కావాల్సి ఉన్నప్ప‌టికీ మొద‌ట స్టిక్క‌రింగ్ చేశారు.


Also read: హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా ఆరు ట్రంప్ టవర్లు, వచ్చే ఏడాది ప్రారంభం..

ఈ నేప‌థ్యంలో అధికారికంగా నేటి నుండే స‌ర్వే ప్రారంభం కానుంది. స‌మ‌గ్ర కుటుంబ స‌ర్వే కోసం ఇత‌ర ప్రాంతాల్లో నివాసం ఉండేవారంతా స్వ‌గ్రామాల‌కు వెళ్లాలా వ‌ద్దా అనే దైల‌మాలో ఉన్నారు. దీంతో వారు ఉన్న‌చోటునే వివ‌రాల‌ను వెళ్ల‌డించాల‌ని ప్ర‌ణాళికశాఖ స్ప‌ష్టం చేసింది. ఆధార్ కార్డులో ఉన్న వివ‌రాల ఆధారంగానే స‌ర్వే జ‌రుగుతుంద‌ని తెలిపింది. అంతేకాకుండా ఎన్యూమ‌రేటర్లు ప్ర‌తి ఇంటికి వ‌స్తార‌ని వారు అడిగిన వివ‌రాలు చెబితే స‌రిపోతుందని చెప్పింది.


అయితే కొన్ని ముఖ్య‌మైన ప‌త్రాలు మాత్రం ద‌గ్గ‌ర పెట్టుకోవాల‌ని స‌ర్వే ప్ర‌ణాళిక శాక ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. ముఖ్యంగా ఆధార్ కార్డు, రేష‌న్ కార్డు, పాస్ బుక్, సెల్ ఫోన్ నంబ‌ర్ల లాంటివి అందుబాటులో ఉంచాల‌ని సూచించింది. ఎన్యూమ‌రేట‌ర్లు వ‌చ్చే స‌మ‌యానికి ఇబ్బంది ప‌డ‌కుండా ముందుగానే కాగితాల‌ను సిద్దం చేసుకుంటే వివ‌రాలు కూడా సుల‌భంగా చెప్పొచ్చ‌ని స్ప‌ష్టం చేసింది. స‌ర్వే పూర్తి కాగానే కుటుంబ స‌భ్యులు అన్ని వివ‌రాలు స‌రైన‌వే అని ఒక సంత‌కం చేయాల్సి ఉంటుంది. ప్ర‌భుత్వం చేప‌డుతున్న ఈ స‌ర్వే ఆధారంగా కులాల వారిగా రిజర్వేష‌న్ల మార్పు, ప్ర‌భుత్వ ప‌థ‌కాలు ల‌బ్దిదారుల‌కే అంద‌జేత లాంటి కీల‌క నిర్ణ‌యాల‌ను ప్ర‌భుత్వం తీసుకునే అవ‌కాశం ఉంది.

Related News

Nizamabad: బోధన్‌ టౌన్‌లో ఉగ్ర కలకలం.. ఐసిస్‌తో సంబంధాలు, ఢిల్లీ పోలీసుల అదుపులో ఆ వ్యక్తి

Congress VS BRS: జూబ్లీహిల్స్ బైపోల్.. బీఆర్ఎస్‌లో టెన్షన్?

Sada Bainama: రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. ఆ 10 లక్షల మంది కష్టాలు తీరినట్టే..

Raja Singh: కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే నేను చేస్తా.. రాజాసింగ్ సంచలనం

Weather News: రాష్ట్రంలో భారీ వర్షం.. ఈ జిల్లాల్లో రాత్రంతా కుండపోత వాన, పిడుగులు కూడా పడే ఛాన్స్

Nepal Crisis: నేపాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. తెలంగాణ హెల్ప్‌లైన్‌ నెంబర్లు ఇవే..

Big Stories

×