trinayani serial today Episode: నయనికి హాస్పిటల్ లో ఆపరేషన్ చేస్తుంటారు. విశాల్ బయట నిలబడి బాధపడుతుంటాడు. ఇంతలో ఇంటి నుంచి అందరూ హాస్పిటల్ కు పరుగెత్తుకొస్తారు. ఎలా జరిగిందని అడుగుతారు. నావల్లే జరిగిందని.. తను దేవీపురం వచ్చిందని అలా రావడం వల్లే ఈ యాక్సిడెంట్ జరిగిందని విశాల్ చెప్తాడు. అందరూ బాధపడుతుంటాడు. విశాల్ ఏడుస్తూ నిమిషంలో ఇది జరిగిపోయిందని అంటాడు. ఇంతలో వల్లభ గారడీ పాప విశాలాక్షి ఆరోజే చెప్పిందని విశాల్ వల్లే ప్రాణగండం వస్తుందని అంటాడు.
తిలొత్తమ్మ మాత్రం బాధపడ్డట్టు నటిస్తుంది. అసలు మా అక్క సరిగ్గా చూడలేకపోయింది. మా ఆయనే ఊరికే అవన్నీ పట్టుకొచ్చి హడావిడి చేశాడు అంటుంది హాసిని. దీంతో పాపం విక్రాంత్‌ను అలా బలి చేయోద్దు చెల్లి అంటుంది హాసిని. మీరు అలా అనకండి మా ఆయన ఆ గుడి అడ్రస్ తీసుకురాకుండా ఉండి ఉంటే ఇదంతా జరిగేదే కాదు అంటుంది సుమన. దీంతో అలా అనకు సుమన అంటాడు విశాల్. పర్లేదు బ్రో సుమన అన్న దాంట్లో తప్పేం లేదు. వదినకు ఇలా అవ్వడానికి నేను కూడా కారణం అనిపిస్తుంది. ఆ పాపం నాకే తగలాలి. నాకేదైనా జరిగితే నా అయుష్షు కూడా వదినకే ఇవ్వాలని కోరుకుంటాను అంటూ ఏడుస్తుంటాడు విక్రాంత్. దీంతో పిచ్చి మాటలు మాట్లాడకురా..? మనం ఏదేదో అనుకుంటే సరిపోతుందా..? అంటుంది తిలొత్తమ్మ. ఇంతలో వల్లభ డాక్టర్లు ఏమన్నారు అని అడుగుతాడు. డాక్టర్లు ఐసీయూలోంచి బయటకు రాలేదని చెప్తాడు విశాల్.
అదే హాస్పిటల్ కు స్పృహ కోల్పోయిన బామ్మను తీసుకుని వస్తుంది త్రినేత్రి. బామ్మను పరిశీలించిన డాక్టర్లు నయనికి ఆపరేషన్ జరుగుతున్న వార్డుకు దగ్గరి వార్డులోనే బామ్మను జాయిన్ చేస్తారు. త్రినేత్రి బాధపడుతుంది. వదినను వేరే హాస్పిటల్ కు ఏమైనా తీసుకెళ్దామా..? బ్రో అని అడుగుతాడు విక్రాంత్. ఏమీ వద్దని ఇక్కడ మన ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారు కాబట్టి బెటర్ ట్రీట్‌మెంట్ ఇక్కడే ఉంటుంది అని విశాల్ చెప్తాడు.
ఇంతలో తిలొత్తమ్మ ఇప్పుడు విశాలాక్ష్మి అమ్మవారి మీద భారం వేయడం తప్పా మరో దారి లేదు మనకు అంటూ అక్కడి నుంచి బయటకు వెళ్తుంది. ఈ టైంలో ఎక్కడికి వెళ్లుంది మా మమ్మీ అనుకుంటూ వల్లభ వెళ్తాడు. బయటకు వెళ్లిన తిలొత్తమ్మను వల్లభ వచ్చి నువ్వు ఇలా పక్కకు వస్తే ఏమనుకుంటారు వాళ్లు అని అడుగుతాడు. ఇప్పుడు ఎవ్వరూ ఎవరి గురించి ఏమీ అనుకోవడానికి లేదు వల్లభ అంటుంది తిలొత్తమ్మ. అంటే మనం కారు బ్రేకులు ఫెయిల్ చేశామని మన మీద ఎవరికీ అనుమానం రాలేదంటావా..? అని అడుగుతాడు. దీతో తిలొత్తమ్మ కోపంగా వల్లభను తిడుతుంది. నయనికి యాక్సిడెంట్ అయింది. వేరే వెహికిల్ వల్ల.
అప్పుడు మన మీద ఎందుకు అనుమానం వస్తుంది. రేపే మాపో ఆ కారు బ్రేకులు ఫెయిల్ అవ్వొచ్చు కాబట్టి అవి బాగు చేయించడం మంచిది అని చెప్తుంది. ఇంతలో హాసిని వచ్చి ఇక్కడేం చేస్తున్నారు అత్తయ్యా అని అడుగుతూ వస్తుంది. దీంతో మళ్లీ బాధపడుతున్నట్టు నటిస్తారు. హాసిని వచ్చి మీరు బయటకు రావడమే మంచిదైంది. అక్క యాక్సిడెంట్ కు మీరే కారణం కదా…? అని నిలదీస్తుంది. దీంతో వల్లభ ఏయ్ ఏంటో అలా అడుగుతున్నావు పెద్ద మరదలు కారుకు ఏమైనా బ్రేకులు ఫెయిల్ అయ్యాయా…? అంటాడు. దీంతో తిలొత్తమ్మ, వల్లభను తిడుతుంది. ఇంతలో హాసిని కోపంగా తిలొత్తమ్మ, వల్లభలకు వార్నింగ్ ఇస్తుంది.
మరోవైపు హాస్పిటల్ లో బామ్మను చెక్ చేసిన డాక్టర్ ఇప్పుడు స్పృహలోకి వస్తుంది. అని చెప్పగానే బామ్మ లేచి ఎక్కడున్నాను అని అడుగుతుంది. పట్నం హాస్పిటల్ లో ఉన్నావు అని చెప్పగానే కంగారుగా లేచి కూర్చుని నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు అని అడుగుతుంది. తీసుకురాకుంటే నిజంగానే చచ్చిపోయేదానివే బామ్మ అని చెప్తుంది త్రినేత్రి. దీంతో నేనెందుకు చస్తానే.. నీ పెళ్లి చూడనిదే నా ప్రాణాలు తీసుకెళ్లడానికి స్వర్గంలో ఉన్న నా మొగుడు రాడు. నరకంలో ఉన్న ఆ యముడు రాడు. అని చెప్తూ ఏమంటావయ్యా డాక్టర్ అని అడుగుతుంది. దీంతో డాక్టర్ నేనేం అనలేనండి అంటాడు. దీంతో ఏమీ చేయలేని వాడిని నన్నెందుకు ఈ మంచం మీదకు తోశావు అని వెటకారంగా అడుగుతుంది.
సుమన కంగారుగా పరుగెత్తుకుంటూ సిస్టర్ దగ్గరకు వెళ్లి త్రినయని కండీషన్ ఎలా ఉందని అడుగుతుంది. అసలు బతికే చాన్స్ ఉందా? అని ఆరా తీస్తుంది. సిస్టర్ నాకేం తెలియదు అని వెల్లిపోతుంది. ఇంతలో విక్రాంత్ వచ్చి సుమనను తిడతాడు. ఇంతటితో ఇవాళ్టీ త్రినయని సీరియల్ ఏపిసోడ్ అయిపోతుంది.