Meenakshi Chaudhary: హీరోయిన్స్‌కు బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్స్ వచ్చాయంటే చాలు.. వారిని గెల్డెన్ లెగ్ అని పిలిచేస్తూ బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు ఇవ్వడానికి సిద్ధమయిపోతారు మేకర్స్. ప్రస్తుతం మీనాక్షి చౌదరీ (Meenakshi Chaudhary) పరిస్థితి కూడా అలాగే ఉంది. మొన్నటి వరకు వరుస ఫ్లాపులతో సతమతమయిన మీనాక్షి.. తాజాగా బ్యాక్ టు బ్యాక్ రెండు బ్లాక్‌బస్టర్ హిట్లు కొట్టేసి మరిన్ని అవకాశాలను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో తన భయాల గురించి, ఆ తర్వాత ఎదురైన సంతోషాల గురించి అంతా వివరంగా చెప్పింది మీనాక్షి చౌదరీ.
లక్కీ లేడీ
వెంకటేశ్, మీనాక్షి చౌదరీ, ఐశ్వర్య రాజేశ్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా విడుదలయ్యి నెల రోజులు అవుతున్నా ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు రూ.300 కోట్ల వరకు కలెక్షన్స్ లభించాయి. ఇందులో వెంకటేశ్ గర్ల్‌ఫ్రెండ్ క్యారెక్టర్‌లో మీనాక్షి నటన అందరినీ ఆకట్టుకుంది. దానికంటే ముందు దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘లక్కీ భాస్కర్’ మూవీ కూడా ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల మార్క్‌ను టచ్ చేసింది. అలా బ్యాక్ టు బ్యాక్ వంద కోట్లు సాధించిన సినిమాల్లో నటించిన మీనాక్షి ముందుగా ఈ సినిమాలను ఒప్పుకోవడానికి ఆలోచించాననే విషయం బయటపెట్టింది.
చాలా భయపడ్డాను
‘లక్కీ భాస్కర్’లో దుల్కర్ సల్మాన్ భార్యగా సుమతి అనే పాత్రలో కనిపించింది మీనాక్షి చౌదరీ. అందులో తను ఒక బిడ్డకు తల్లిగా కూడా కనిపించింది. తాజాగా తల్లి పాత్రలో నటించడంపై తన అభిప్రాయం వ్యక్తం చేసింది మీనాక్షి. ‘‘ఒక తల్లి పాత్రలో నటించడం చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. నేను సరిగా నటించకపోతే ప్రేక్షకులు నన్ను తల్లి పాత్రలో యాక్సెప్ట్ చేయరని చాలా భయపడ్డాను. నేను సుమతి పాత్రకు న్యాయం చేయలేనేమో అని అనుకున్నాను. కానీ ప్రేక్షకులు నన్ను సుమతిగా యాక్సెప్ట్ చేశారు. నాకు ఆ పాత్ర కరెక్ట్ అని నిరూపించారు’’ అంటూ ‘లక్కీ భాస్కర్’ సినిమాతో పాటు అందులో తన పాత్ర కూడా హిట్ అవ్వడంపై సంతోషం వ్యక్తం చేసింది మీనాక్షి చౌదరీ.
Also Read: వాళ్లందరూ తప్పు అని నిరూపించాలనుకున్నాను.. రష్మిక మందనా కామెంట్స్
కొందరికి ఛాన్స్ రాదు
‘‘ఇప్పటివరకు నటిగా నాకు వచ్చిన ఆఫర్లు అన్నీ సంతోషాన్ని ఇచ్చాయి. 2024 అనేది నా కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా మిగిలిపోతుంది. నా కెరీర్ మొదట్లోనే వైవిధ్యభరితమైన పాత్రలను పోషించే అదృష్టం నాకు లభించింది. కొన్నేళ్లు ఎక్స్‌పీరియన్స్ ఉన్నా కూడా మంచి పాత్రలు పోషించే అవకాశం కొందరికి రాదు’’ అంటూ తన కెరీర్ విషయంలో తను చాలా సంతోషంగా ఉన్న విషయం బయటపెట్టింది మీనాక్షి చౌదరీ. ‘గుంటూరు కారం’ సినిమాలో తను సెకండ్ హీరోయిన్‌గా నటించినా, తనకు ఎక్కువగా సీన్స్ లేకపోయినా కూడా ఆ సినిమా వల్ల తను చాలా నేర్చుకున్నానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తెలుగుతో పాటు ఇతర భాషా చిత్రాల్లో కూడా మీనాక్షి బిజీ అయిపోయింది.