Sandhya Sridhar Rao: BRS ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ చావుకు తానే కారణమని.. క్షుద్రపూజలు చేసి లేపేశానంటూ సంధ్య కన్వెన్షన్ శ్రీధర్ రావు మాట్లాడిన ఆడియో వైరల్‌గా మారాయి. అందులో ఓ కాంట్రాక్టర్‌ను నీకు కూడా క్షుద్రపూజలు చేస్తానని బెదిరించారు. కేఎన్ రెడ్డి అనే కాంట్రాక్టర్ ద్వారా శ్రీధర్ రావు మట్టిని తరలించడంతో పాటు వేర్వేరు పనులు చేయించుకున్నాడు. ఈ క్రమంలో దాదాపు కోటి రూపాయలు చెల్లించాల్సి ఉంది. దీని గురించి ఆయన అడగగా.. నన్నే డబ్బు అడుగుతావా.. క్షుద్ర పూజలు చేసి మాగంటి గోపినాథ్‌ను చంపినట్లు.. నిన్ను కూడా అంతం చేస్తానంటూ భయపెట్టాడు.
కిడ్నీలు ఫెయిలై చనిపోతావని.. నీ భార్య వారం రోజుల్లో విధవరాలు అవుతుందని హెచ్చరించాడు. దాంతోపాటు అసభ్యకర పదజాలంతో దూషించాడు. 15 రోజుల్లో నీ డౌన్‌ఫాల్ స్టార్ట్ అవుతుందని ఓ వ్యక్తికి సంధ్య శ్రీధర్‌రావు వార్నింగ్ ఇచ్చాడు. 15 రోజుల్లో మాగంటిని దహనం చేసిన శ్మశానంలోనే నువ్వు కూడా ఎండ్ అవుతున్నావంటూ హెచ్చరించాడు. నన్నే బెదిరిస్తావా అంటూ బండ బూతులు తిట్టాడు సంధ్య శ్రీధర్‌రావు.
భవన నిర్మాణాలు చేస్తానని వినియోగదారులను నిండా ముంచేసిన కేసుల్లో సంధ్య శ్రీధర్ రావు నిందితుడిగా ఉన్నాడు. జంట నగరాల కమిషనరేట్ పరిధిలో 40కిపైగా కేసులు ఉన్నాయి. ఎప్పటికప్పుడు పోలీసులను, సిస్టంను మ్యానేజ్ చేస్తూ తప్పించుకు తిరుగుతుంటాడని ఆరోపణలు ఉన్నాయి. ఈయనపై ఇటీవలే FCI లేఔట్ ఆక్రమించారనే ఆరోపణలపై కేసు నమోదయింది.
Also Read: ఏందప్పా.. ఈ రప్పా.. రప్పా? పుష్ప డైలాగ్ చుట్టూ తెలుగు రాష్ట్రాల రాజకీయం
మరోవైపు ఇటీవలే సినీనటి రమ్యశ్రీ, ఆమె సోదరుడు పై దాడికి పాల్పడ్డ సంధ్య కన్వెన్షన్ శ్రీధర్ రావుపై.. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. శ్రీధర్ రావుతో పాటు వెంకటేష్ మరో ముగ్గురి అనుచరులపై కేసు నమోదు అయ్యాయి. 115(2), 126(2), 324(5), 125 R/W 3(5) BNS యాక్ట్ ప్రకారంగా కేసులు నమోదు అయ్యాయి.
వైరల్‌గా మారిన సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు బెదిరింపులు..!
ఓ వ్యక్తికి ఫోన్ చేసి బెదిరించిన శ్రీధర్ రావు
15 రోజుల్లో నీ డౌన్‌ఫాల్ స్టార్ట్ అవుతుందంటూ వార్నింగ్
మాగంటికి వచ్చిన రోగమే వచ్చి చచ్చిపోతావంటూ హెచ్చరికలు
నన్నే బెదిరిస్తావా అంటూ బండబూతులు తిట్టిన శ్రీధర్ రావు https://t.co/CzCjRgDsDc pic.twitter.com/2WnmiQGoI6
— BIG TV Breaking News (@bigtvtelugu) June 22, 2025