ENG vs IND: ఇంగ్లాండ్ తో 5 టెస్ట్ ల సిరీస్ లో భాగంగా లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్ లోని మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 471 పరుగులకు ఆల్ అవుట్ అయింది. భారత బ్యాటర్లలో రిషబ్ పంత్ 134, గిల్ 147, యశస్వి జైష్వాల్ 101 సెంచరీలతో రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోష్ టంగ్ 4, బెన్ స్టోక్స్ 4 వికెట్లు పడగొట్టగా.. బ్రైడెన్ కార్స్ ఒక వికెట్ తీశాడు.
అనంతరం తన తొలి ఇన్నింగ్స్ ని ప్రారంభించింది ఇంగ్లాండ్ జట్టు. అయితే తొలి టెస్ట్ లో బుమ్రా మినహా భారత బౌలర్లు విఫలం అవుతున్నారు. రెండవ రోజు ఆటలో మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, శార్దుల్ ఠాకూర్ ప్రభావం చూపలేకపోయారు. రెండవ రోజు ఆట మొత్తంగా ఇంగ్లాండ్ మూడు వికెట్లను కోల్పోయింది. ఈ మూడు వికెట్లను బుమ్రానే పడగొట్టడం గమనార్హం. దీంతో భారత మాజీ క్రికెటర్లు జట్టులోని ఇతర బౌలర్ల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
అంతేకాకుండా ఫీల్డింగ్ లో కూడా నిరాశపరిచారు టీమిండియా ఆటగాళ్లు. బుమ్రా బౌలింగ్ లో రెండు సునాయాస క్యాచ్ లను జడేజా, యశస్వి జైస్వాల్ వదిలేశారు. బూమ్రా బౌలింగ్ కి తడబడిన ఇంగ్లాండ్ బ్యాటర్లు.. ఇతర బౌలర్లను స్వేచ్ఛగా ఆడారు. దీంతో రెండవ రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండు జట్టు తన తొలి ఇన్నింగ్స్ లో 49 ఓవర్లలో మూడు వికెట్లకు 209 పరుగులు చేసింది. అయితే రెండవ రోజు ఆట చివరి ఓవర్ లో ఓ హై డ్రామా చోటు చేసుకుంది.
బూమ్రా వేసిన ఈ చివరి ఓవర్ నాలుగవ బంతికి ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ మిడ్ వికెట్ లో క్యాచ్ ఇచ్చాడు. ఈ క్యాచ్ నీ మొహమ్మద్ సిరాజ్ అద్భుతంగా అందుకున్నాడు. దీంతో బ్రూక్ డకౌట్ గా పెవిలియన్ బాట పడ్డాడు. కానీ అదే సమయంలో అంపైర్ ఆ బంతిని నో బాల్ గా ప్రకటించాడు. దీంతో బ్రూక్ తిరిగి క్రీజ్ లోకి వచ్చాడు. అయితే ఈ ఓవర్ లో బుమ్రా ఏకంగా మూడు నోబాల్స్ వేయడం విశేషం.
Also Read: Vaibhav Suryavanshi: 14 ఏళ్ల వైభవ్ గొప్ప మనసు.. బిచ్చగాళ్లకు ఆస్తులు మొత్తం దానం
ఇతర బౌలర్ల వైఫల్యం, ఈజీ క్యాచ్ లను వదిలేయడం వంటివి భారత జట్టుకు తీవ్ర నష్టాన్ని చేకూర్చాయి. మరోవైపు బుమ్రా బౌలింగ్ లో బెన్ డెకట్ ఇచ్చిన రెండు క్యాచ్ లను యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా వదిలేయగా.. అతడు ఆఫ్ సెంచరీ తో చెలరేగాడు. చివరికి డకెట్ ని బుమ్రానే క్లీన్ బౌల్డ్ చేశాడు. భారత ఆటగాళ్లు ఈ క్యాచులు అందుకొని ఉంటే ఇంగ్లాండ్ మరిన్ని వికెట్లు కోల్పోయేది. ఇక 3వ రోజు 277 పరుగుల వద్ద ఐదు వికెట్లను కోల్పోయింది ఇంగ్లాండ్. భారత బౌలర్లలో బుమ్రా 3, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ చెరో వికెట్ పడగొట్టారు.
?igsh=dGF5MzVhanV1cGR6