BigTV English

RAPA RAPA Politics: ఏందప్పా.. ఈ రప్పా.. రప్పా? పుష్ప డైలాగ్ చుట్టూ తెలుగు రాష్ట్రాల రాజకీయం

RAPA RAPA Politics: ఏందప్పా.. ఈ రప్పా.. రప్పా? పుష్ప డైలాగ్ చుట్టూ తెలుగు రాష్ట్రాల రాజకీయం

RAPA RAPA Politics: ఆంధ్రా లేదు.. తెలంగాణ లేదు.. రెండు రాష్ట్రాల రాజకీయం ఇప్పుడు రప్పా.. రప్పా.. చుట్టే తిరుగుతోంది. ఏపీలో మొదలైంది. అక్కడే అయిపోతుంది అనుకుంటే.. ఇప్పుడు తెలంగాణకు కూడా పాకింది. పుష్ప సినిమా వచ్చిన ఆరు నెలల తర్వాత.. ఈ డైలాగ్ మళ్లీ రాజకీయాల్లో పాపులర్ కావడం హాట్ టాపిక్‌గా మారింది. ఎప్పుడో రాబోయే ఎన్నికల కోసం.. ఇప్పటి నుంచే ఇలాంటి డైలాగులున్న ప్లెక్సీలు జనంలో కనిపిస్తుండటం.. కొంత ఆందోళనకు గురిచేస్తున్నాయనే చర్చ జరుగుతోంది.


పుష్ప డైలాగ్ చుట్టూ తెలుగు రాష్ట్రాల రాజకీయం

ఇదే.. ఇదే డైలాగ్.. ఇప్పుడు రెండు తెలుగు స్టేట్స్‌ని ఊపేస్తోంది. సాధారణ పార్టీ కార్యకర్తల దగ్గర్నుంచి.. పార్టీ అధినేతలు, కీలక నాయకుల దాకా.. అందరి నోటా.. రప్పా.. రప్పా.. అనే డైలాగ్ వినిపిస్తోంది. సినిమా డైలాగులు.. రాజకీయ నేతల నోటి వెంట రావడం.. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. క్యాచీగా ఉంటుందని మాట్లాడుతున్నారా? లేక.. కార్యకర్తల్లో జోష్ నింపేందుకే వాడుతున్నారా? అనేదే ఇప్పుడు ఇంట్రస్టింగ్‌గా మారింది. పుష్ప సినిమా పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటింది. అలాంటి సినిమాలోని డైలాగ్‌లు తమ నోటి నుంచి వస్తే.. తమకు కూడా లోకల్‌గా ఫుల్ పాపులారిటీ వస్తుందనే.. ఈ డైలాగులు చెబుతున్నారా? అనే డౌట్ మొదలైంది. చివరికి వైఎస్ జగన్, ఏపీ సీఎం చంద్రబాబు, ఒకరిద్దరు మంత్రులు కూడా ఈ రప్పా.. రప్పాపై రాజుకున్న రాజకీయంపై రియాక్ట్ అవడంతో.. మరింత చర్చనీయాంశంగా మారింది.


రప్పా రప్పా 3.0 లోడింగ్.. BRS లో ఫ్లెక్స్ ల రచ్చ

ఇదీ వరస.. ఏపీలో పుష్ప డైలాగ్ ఇంపాక్ట్ ఏ రేంజులో ఉందో చెప్పడానికి ఇదే ఎగ్జాంపుల్. ముందుగా జగన్ పల్నాడు పర్యటనలో కనిపించాయి ఈ రప్పా రప్పా ప్లెక్సీలు. ప్లకార్డులు. దాంతో.. రాజుకుంది రాజకీయం. ఈ ప్లెక్సీలు ప్రదర్శించిన వారిపై ఏపీలో పోలీసులు కేసులు పెట్టడంతో.. వైఎస్ జగన్ స్పందించారు. జగన్ రియాక్ట్ అయిన తీరుపై.. చంద్రబాబు కూడా స్పందించారు. అయితే.. ఈ ట్రెండ్ ఏపీకే పరిమితం కాలేదు. పక్కనున్న తెలంగాణకు కూడా పాకింది. బీఆర్ఎస్ నేత హరీశ్ రావు పటాన్‌చెరువు పర్యటనలోనూ.. ఈ రప్పా.. రప్పా డైలాగులున్న ప్లెక్సీలు కనిపించాయ్. 2028లో బీఆర్ఎస్ 3.0 లోడింగ్ అని రాసున్న ప్లకార్డులు రాజకీయంగా చర్చకు దారితీశాయి.

రాజకీయ నేతల నోట ఇలాంటి డైలాగ్‌లు అవసరమా?

పుష్ప-1లో తగ్గేదేలే అనే పంచ్ డైలాగ్ పాపులర్ అయింది. అది.. రాజీలేని తత్వానికి ఓ నిదర్శనంగా కనిపించింది. పుష్ప-2లో పాపులర్ అయిన రప్పా.. రప్పా డైలాగ్.. ఓ ఊచకోత హెచ్చరికకు సంకేతంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఈ డైలాగ్.. హింసకు పర్యాపదంగా ట్రెండ్ అవుతోంది. అందువల్ల.. కార్యకర్తలు, కింది స్థాయి నేతలు ఈ రప్పా.. రప్పా పదాన్ని ఉపయోగించడం.. పెద్ద నాయకులు దానిని సమర్థించడం.. అనారోగ్యకరమైన, హానికరమైన పరిణామాలుగా కనిపిస్తున్నాయనే అభిప్రాయాలు జనం నుంచి వ్యక్తమవుతున్నాయ్. ఎందుకంటే.. సినిమా అనేది వినోదానికి సంబంధించింది. రాజకీయాలు అలా కాదు. ఇది సీరియస్ వ్యవహారం. పైగా.. సినిమా డైలాగులకు.. కథానుసారంగా ఓ సందర్భం, అర్థం ఉంటాయి. అవి.. రాజకీయాల్లోకి అసందర్భంగా వచ్చినప్పుడు.. అసలు అర్థం మారిపోతుంది. ఇప్పుడు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నది ఇదేననే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×