Akira: అకీరా నందన్ (Akira Nandan)ఈ పేరు వినగానే మెగా అభిమానులకు పూనకాలు వస్తాయనే చెప్పాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)వారసుడిగా అకీరా అందరికీ ఎంతో సుపరిచితమే. అకీరా పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ (Renu Desai)ల కుమారుడు అనే సంగతి అందరికీ తెలిసిందే. అకీరా ఇప్పటికీ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వలేదు కానీ మాత్రం విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి. ఎప్పుడేప్పుడు తమ అభిమాన హీరో వారసుడు వెండితెరపైకి ఎంట్రీ ఇస్తారా అంటూ అభిమానులు ఈయన సినీ ఎంట్రీ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక అకీరా కూడా ప్రస్తుతం విదేశాలలో నటనలో భాగంగా శిక్షణ తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి కానీ ఇతని సినీ ఎంట్రీ గురించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటనలు మాత్రం లేవు.
మ్యూజిక్ అంటే ప్రాణం…
ఇక అకీరా తల్లి రేణు దేశాయ్ తన కుమారుడికి సంబంధించిన ఏ విషయాలను కూడా పెద్దగా అభిమానులతో పంచుకోరు. తన కొడుకు ఇండస్ట్రీలోకి వస్తారా? రారా? అనేది పూర్తిగా తన నిర్ణయం అంటూ ఈమె తెలియజేస్తూ వచ్చారు. అకీరాకు సినిమాల కంటే కూడా మ్యూజిక్ అంటే చాలా ఇష్టమనే సంగతి తెలిసిందే. కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం తనని హీరోగా వెండి తెరపై చూడాలని ఎంతో ఆతృత కనబరుస్తున్నారు. పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాలో(OG Movie) అకీరా ఓ పాత్రలో నటించారని ఈ సినిమా ద్వారా వెండి తెరపై సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు ఈ వార్తలపై ఎలాంటి ప్రకటన వెలువడ లేదు.
హీరోగా అకీరా నందన్..
ఇలా అకీరా సినీ ఎంట్రీ గురించి అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఒక డైరెక్టర్ మాత్రం అకీరా హీరోగా ఏ మాత్రం పనికిరారు అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపుతున్నాయి. మరి అకీరా సినీ ఎంట్రీ గురించి ఇలాంటి వ్యాఖ్యలు వచ్చేసి నా డైరెక్టర్ ఎవరు అనే విషయానికి వస్తే ఆయన మరెవరో కాదు దర్శకుడు గీతాకృష్ణ(Geetha Krishna). ఈయన చేసింది చాలా తక్కువ సినిమాలు, చేసిన సినిమాలు కంటే కూడా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పెద్ద ఎత్తున వార్తలలో నిలిచారు.
ప్రభాస్ స్టార్ అయ్యాడుగా…
తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన మాట్లాడుతూ అకీరా హీరో అవ్వటం కష్టమని తెలిపారు. అందుకు కారణాన్ని కూడా ఈయన తెలియజేస్తూ…అకీరా చాలా హైట్ ఉంటారు అలా హైట్ ఉన్నవారు హీరోలుగా పెద్దగా సక్సెస్ కారని ఈయన తెలియచేశారు. అందుకు ఉదాహరణగా రానాని చూపించారు. రానా పెద్ద ప్రొడ్యూసర్ కొడుకు అయినా గాని ఇండస్ట్రీలో పెద్దగా సక్సెస్ మాత్రం అందుకోలేకపోయారు. అతను చూడడానికి బాగుంటాడు మంచిగా సినిమాలలో నటిస్తాడు కానీ హీరోగా క్లిక్ కాలేదని తెలిపారు. అకీరా కూడా చాలా పొడుగు ఉంటారు కాబట్టి హీరో మెటీరియల్ కాదు. అకీరా ఇండస్ట్రీలోకి వచ్చిన పెద్దగా క్లిక్ అవ్వరు అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఫైర్ అవుతూ.. అమితాబ్, ప్రభాస్ (Prabhas) లాంటి హీరోలు ఇండస్ట్రీలో స్టార్లుగా గుర్తింపు పొందారు కదా.. హీరోగా సక్సెస్ అవ్వాలంటే ఉండాల్సింది హైట్, వెయిట్ కాదని టాలెంట్ అంటూ కౌంటర్లు ఇస్తున్నారు.
Also Read: ఏంటీ.. మహేష్ నమ్రత విడిపోయారా.. బయటపడిన చేదు నిజం