MLA Rajasingh: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన జోలికి కానీ.. తన కుటుంబం జోలికి ఎవరైనా వస్తే వారిని అడ్డంగా నరుకుతా అంటూ సెన్సెషనల్ కామెంట్స్ చేశారు. వచ్చే నెల 6న శ్రీరామనవమి పండుగ సందర్భంగా శోభాయాత్ర రూట్ ను ఎమ్మెల్యే రాజాసింగ్ బైక్ పైన తన కొడుకుతో కలిసి పరిశీలించారు. ఆయన వెంట బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు ఉన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడారు. తనవైపు కానీ.., తన ఫ్యామిలీ వైపు ఎవరైనా టెర్రరిస్టులు కన్నెత్తి చూస్తే ఆ టెర్రరిస్టులను అడ్డంగా నరుకుతానని ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఇటీవల తనకు ప్రాణహాని ఉందని పోలీసులు అలర్ట్ చేయడంపై ఎమ్మెల్యే స్పందించారు. తాను, తన కుమారుడితో కలిసి బైక్ నడుపుతానని, పోలీసు అధికారులు ఎన్ని నోటీసులు ఇచ్చినా తాము బైక్ పైనే తిరుగుతామని తేల్చి చెప్పారు. ప్రతి ఏడాది లాగానే ఈ సారి కూడా శ్రీరామనవమి శోభాయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చారు.
అందుకే రోడ్డు రోటును పరిశీలించామని, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా ఇందులో పాల్గొన్నట్లు చెప్పారు. కాగా వారికి రోడ్డు మ్యాప్ లో, ప్యాచ్ వర్క్, ట్రీ కట్టింగ్, లైట్ల ఏర్పాటులో ఎలాంటి ఇబ్బందులు రాకూడదని అధికారులకు సూచించామన్నారు. ఇదిలా ఉండగా తమకు ప్రతీ ఏటా పోలీసుల వల్లే ఇబ్బంది ఉంటుందని, పోలీసులు.. కార్యకర్తలను, రామ భక్తులను కొడుతారని, ఈసారి అలాంటివి జరగకుండా చూడాలని ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు.
ఇదిలా ఉండగా.. కొన్ని భద్రతా కారణాల రీత్యా ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వాడాలని, భద్రతా సిబ్బందిని ఉపయోగించుకోవాలని రాజాసింగ్ ను ఇటీవల పోలీసులు కోరిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయనకు ఈ నెల 19న హైదరాబాద్ లోని మంగళ్ హట్ పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. తాజాగా రాజాసింగ్ ఈ విషయంపై మాట్లాడుతూ.. తన జోలికి వస్తే అసలు బాగోదని తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. తాను, తన కొడుకు పక్కాగా బైకు నడుపుతామని.. పోలీసు అధికారులు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా తాము మాత్రం బైక్ పైనే తిరుగుతామని ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పుకొచ్చారు.
ALSO READ: JOBS: టెన్త్, ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. రూ.68,000 జీతం.. దరఖాస్తుకు ఇంకా వారం రోజులే ఛాన్స్..