BigTV English
Advertisement

Brahmamudi Serial Today September 23rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజ్‌ను కన్వీన్స్‌ చేసిన కళ్యాణ్‌ – కావ్యకు దొరికిపోయిన రాజ్‌  

Brahmamudi Serial Today September 23rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజ్‌ను కన్వీన్స్‌ చేసిన కళ్యాణ్‌ – కావ్యకు దొరికిపోయిన రాజ్‌  

Brahmamudi serial today Episode: హాస్పిటల్‌ కు వెళ్లిన రాజ్‌ అక్కడి వాళ్లతో గొడవ పడతాడు. కళ్యాణ్‌ వెళ్లి వాళ్లకు సర్ది చెప్పి రాజ్‌ను బయటకు తీసుకెళ్తాడు. అన్నయ్య అసలేం చేస్తున్నావు నువ్వు వాళ్లతో ఎందుకు గొడవ పడుతున్నావు అని అడగ్గానే.. వాళ్లు బిడ్డ వద్దు అన్న మాట వినగానే నా కోపాన్ని కంట్రోల్‌ చేసుకోలేకపోయాను. అందుకే నేను ఏం చేస్తున్నానో మర్చిపోయి ప్రవర్తించాను.. అంటాడు రాజ్‌. లేదు అన్నయ్య కోపం కాదు.. బాధ వదిన కడుపులో ఉన్న బిడ్డను కాపాడుకోలేకపోతున్నాను అనే బాధ. ఈ కోపం ఎప్పుడు వస్తుందో తెలుసా అన్నయ్య.. మనకు ఇష్టమైంది మనకు దూరం అవుతున్నా మనం ఏమీ చేయలేనప్పుడు.. ఇప్పటికైనా ప్రాక్టికల్‌ గా ఆలోచించు అన్నయ్య వదినకు అబార్షన్‌ చేయించు.. అని చెప్పగానే..


అంటే నా బిడ్డను నేను చంపించాలి అంటున్నావా..? కళ్యాణ్‌   అంటాడు రాజ్‌. వదిననైనా కాపాడమంటున్నాను అన్నయ్య.. అంటాడు కళ్యాణ్‌. లేదురా నేను ఒక తండ్రిగా నేను అలాంటి పని చేయలేను నా వల్ల కాదు నాకు ఇద్దరూ కావాలి. అన్నయ్య వాళ్ళిద్దరూ క్షేమంగా ఉంటే చూడాలని నాకు కూడా ఉంది. కానీ అది జరిగే అవకాశం లేదు కదా..? అంటాడు కళ్యాణ్‌. దీంతో రాజ్‌ ఎందుకు లేదురా ఒక దారి మూసుకుపోతే ఇంకో దారి తెరుచుకుంటుంది అంటారు కదా వెతుకుదాం కచ్చితంగా ఏదో ఒక దారి దొరుకుతుంది అని రాజ్‌ చెప్పగానే.. లేదు అన్నయ్యా అన్ని దారులు మూసుకుపోయాయి.. మనకు వదినకు అబార్షన్‌ చేయించడం తప్పా మనకు ఇంకో చాన్స్‌ లేదు అన్నయ్య. ఇక డాక్టర్‌ చెప్పిన మార్గం తప్ప వేరే మార్గం లేదు మనకు.. నువ్వు బాగా ఆలోచించు అన్నయ్య ఏదో ఒక నిర్ణయం తీసుకో.. అని కళ్యాణ్‌ చెప్పగానే రాజ్‌ ఆలోచనలో పడిపోతాడు.

రుద్రాణి, రాజ్‌ తిట్టిన మాటలు గుర్తు చేసుకుని ఆలోచిస్తుంది. ఇంతలో రాహుల్ వచ్చి ఏంటి మామ్‌ అంత డీప్‌గా ఆలోచిస్తున్నావు. ఎవరి గురించి అని అడగ్గానే.. ఇంకెవరి గురించి రాహుల్‌ ఆ రాజ్‌ గురించే అని చెప్పగానే రాజ్‌ గురించా.. ఇప్పుడు వాడి గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది అంటాడు రాహుల్‌. అవసరం ఉంది రాహుల్‌.. ఇంట్లో ఎవరైనా అన్నయ్యను ఒక్క మాట అన్న ఊరుకోని రాజ్‌ ఇవాళ వాడే అంతలా తిట్టడం ఏంటని అంటుంది రుద్రాణి. దీంతో మనం ఆలోచించాల్సింది రాజ్‌ గురించి కాదు మామ్‌.. వాడి గుప్పిట్లో ఉన్న ఈ ఆస్థి గురించి అని చెప్పగానే. ఏమంటున్నావు రాహుల్‌ అని రుద్రాణి అడుగుతుంది.


అవును మామ్‌ నువ్వు ఎప్పుడూ అంటుంటావు కదా..? నిన్నుఈ ఇంటికి వారసుణ్ని చేస్తానని ఆ క్షణం వచ్చేసింది అనిపిస్తుంది.  ఈ సిచ్యుయేషన్‌ను మనం కరెక్టుగా వాడుకుంటే ఈ ఇంటికి ఆ కంపెనీకి ఇక వారసుణ్ని నేనే. రాజ్‌ ఎందుకలా బిహేవ్‌ చేస్తున్నాడో మనకు తెలియదు. కానీ రాజ్‌కు ఇప్పుడున్న మూడ్‌లో ఆఫీసుకు వెళ్లడం కుదరదు. కావ్య ప్రెగ్నెంట్‌ కావడంతో ఆఫీసుకు వెళ్లదు. అందుకే రాజ్‌ను ఇప్పుడు కన్వీన్స్‌ అవుతాడు అని చెప్పగానే.. రాహుల్ ఇది నువ్వేనా అంటుంది రుద్రాణి.. ఏంటి మమ్మీ అలా అడుగుతున్నావు.. అని రాహుల్ అడగ్గానే.. ఏం లేదురా వరదలోకి బురద వచ్చి చేరినట్టుగా నీ బుర్రలోకి సడెన్‌ గా ఇంత తెలివి ఎలా వచ్చిందా అని.. అడుగుతుంది. దీంతో రాహుల్ నువ్వు ఏమీ చేయలేకపోతున్నావు  కదాని నేనే ఆలోచించడం మొదలుపెట్టేశాను అంటాడు రాహుల్‌.

తర్వాత కిందకు వెళ్లి రాహుల్‌, రాజ్‌తో ఆఫీసు గురించి మాట్లాడాలి అని చెప్పగానే.. రాజ్‌ ఇప్పుడు నాకు ఆ మూడ్‌ లేదు అని చెప్తాడు. కానీ ఆఫీసులో ఏవేవో ప్రాబ్లమ్స్ వస్తున్నాయంట అందుకే నువ్వు ఒప్పుకుంటే మన కంపెనీ బాధ్యతలు నేను తీసుకుందామనుకుంటున్నాను పర్మినెంట్‌ గా కాదులే రాజ్‌ టెంపరరీగానే.. నువ్వేదో ప్రాబ్లమ్‌ లో ఉన్నావు కదా..? ఆ ప్రాబ్లమ్‌ సాల్వ్‌ అయ్యే వరకు నేను చేసుకుందామని అంటూ రాహుల్ చెప్తుంటే.. రాజ్‌ కోపంగా షటప్‌ రాహుల్ ఏంటి నువ్వు చూసుకునేది.. కంపెనీ చూసుకోవడం అంటే చిన్న పిల్లల ఆట అనుకున్నావా..? లేకపోతే ఎండీ చైర్‌ ఏమన్నా షోరూంలో కుర్చీ అనుకుంటున్నావా..?  అయినా నీకు ఏం అర్హతలు ఉన్నాయని అడుగుతున్నావు  అంటూ తిడుతుంటే.. రుద్రాణి వచ్చి ఏం అర్హత ఉంటే నువ్వు ఆఫీసు బాధ్యత ఇద్దామనుకుంటున్నావు రాజ్‌ అని అడుగుతుంది.

దీంతో రాహుల్‌ మమ్మీ నువ్వెందుకు వచ్చావు.. నిన్ను ఈ విషయంలో ఇన్వాల్వ్‌ అవ్వొద్దని చెప్పాను కదా..? అంటాడు. నువ్వాగు రాహుల్‌ నా కొడుకుని తిడితే ఊరుకుంటాను కానీ వాడిక అర్హత లేదంటే ఊరుకోను.. చెప్పు రాజ్‌ మీరెవరూ ఆఫీసు చూసుకోవడం లేదనే కదా ఆఫీసు బాధ్యతలు అడిగాడు చెప్పు రాజ్‌ ఆ కంపెనీల మీద మీకెంత హక్కు ఉందో రాహుల్ కు కూడా అంతే హక్కు ఉంది అంటుంది రుద్రాణి. దీంతో రాజ్‌ అత్తా కంపెనీ బాధ్యతలు అనేవి ఇంట్లో వాళ్లైతే ఇచ్చేవి కాదు.. సామర్థ్యం ఉండాలి  అంటూ చెప్పగానే.. రుద్రాణి రాహుల్‌ను తిడుతుంది. ఇంతలో ఇంద్రాదేవి వచ్చి రుద్రాణిని తిట్టి లోపలికి వెళ్లగొడుతుంది. రుద్రాణి వెళ్లిపోయాక కావ్య నీకోసం తినకుండా ఎదురుచూస్తుంది వెళ్లు అంటుంది. రాజ్‌ వెళ్లిపోతాడు.

రూంలోకి వెళ్లి నిద్ర పోతున్న కావ్య పక్కన కూర్చుని రాజ్‌ ఏడుస్తూ ఎమోషనల్‌ అవుతుంటాడు. ఇంతలో కావ్య నిద్ర లేచి ఎంత సేపు అయిందండి వచ్చి అని అడుగుతుంది.  రాజ్‌ వెంటనే తన కళ్ల నీళ్లు తుడుచుకుంటాడు. కావ్య మాటలకు షాక్‌ అవుతాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

CM Revanth Reddy: కేటీఆర్, కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Deepthi Manne: పెళ్లి పీటలు ఎక్కిన జగదాత్రి సీరియల్ నటి.. ఫోటోలు వైరల్!

Nagababu: మాట నిలబెట్టుకున్న మెగా బ్రదర్.. బాబాయ్ కల నెరవేర్చారుగా!

TV: పెళ్లైన 5 ఏళ్లకు పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ప్రముఖ నటి.. ఎవరంటే?

Illu Illalu Pillalu Today Episode: నర్మదపై వేదవతి కోపం.. లంచం తీసుకుంటు దొరికిన నర్మద.. శ్రీవల్లి ఫుల్ హ్యాపీ..

Brahmamudi Serial Today November 7th:‘బ్రహ్మముడి’ సీరియల్‌: కూయిలీని కొట్టిన రాహుల్‌ – వీడియో తీసిన రంజిత్‌   

Nindu Noorella Saavasam Serial Today November 7th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: బెడిసికొట్టిన మనోహరి ప్లాన్‌  

GudiGantalu Today episode: ఘనంగా సుశీల బర్త్ డే వేడుక.. ప్రభావతి పై బాలు సెటైర్.. సుశీల సర్ప్రైజ్ గిఫ్ట్..

Big Stories

×