YCP Roja Arrest : ఏపీలో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్షాలను నోటికొచ్చినట్లు తిట్టిన నేతలకు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేతికి అందినకాడికి దోచుకున్న వారికి పోలీసుల నోటీసులు తలుపు తడుతున్నాయి. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. అప్పటి ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేనా, బీజేపీ నాయకులపై వైసీపీ నేతలు ఇష్టానుసారం నోరుపారేసుకున్నారు. కొందరు చిన్న చిన్న పదవుల్ని అడ్డుపెట్టుకుని సైతం కోట్లు వెనకేశారనే ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇలాంటి వారందరిపై.. వరుసగా విచారణలు జోరందుకుంటున్నాయి.
నోటికి పని చెప్పిన అనేక మంది నాయకులు, ఇతర కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం ఇప్పటికే జైలుకు పంపిస్తోంది. ఇక…ఇప్పుడు కాస్త పెద్ద తలలపై టార్గెట్ పెట్టినట్లుగా కనిపిస్తోంది. ఈ లిస్ట్ లో ఇప్పటికే విడుదల రజనీ పేరు ప్రముఖంగా వినిపిస్తుండగా.. వైసీపీ కి గట్టి వాయిస్ గా పని చేసిన, తమ మాటలు, చేష్టలతో వివాదాస్పదంగా మారిన మాజీ మంత్రి రోజా కూడా ఉన్నారని టాక్ గట్టిగానే నడుస్తోంది.
రోజాపై పోలీసుల కేసులు, విచారణ జరుగుతుందని అంతా ఎన్నికల సమయం నుంచి ఊహిస్తూనే ఉన్నారు. అయితే.. ఆమెపై విచారణకు సంబంధించి చర్చ రాగా.. మరో 45 రోజుల్లో నివేదిక వస్తుందని, కేసు సీఐడీకి ఇస్తామంటూ శాసనసభ, శాసనమండలిలో ఏపీ మంత్రులు ప్రకటించారు. చెప్పనైతే చెప్పారు కానీ.. రోజాకు అండగా సీఎం పేషీలోని ఒక అధికారి బలంగా నిలబడుతున్నారంట. ఆమెకు నేనున్నాను అంటూ అడ్డంగా నిలబడుతున్నారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. సదరు అధికారి కారణంగానే రోజా అక్రమాలపై విడుదల కావాల్సిన నివేదికను తొక్కిపెడుతున్నారంట. ఇంతకీ.. అసలు రోజాకి ఆ బ్యూరోక్రాట్ ఎందుకు హామీ ఇచ్చారు? అనేది ఆసక్తిగా మారింది.
రోజా మంత్రి అయిన తర్వాత రుషికొండపై అధునాతన భవన నిర్మాణాలు, తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి టూరిజం శాఖకు కేటాయించిన టికెట్ల దందా, దాంతో పాటు ఆడుదాం ఆంధ్రా పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో వంద కోట్ల రూపాయల కుంభకోణం.. ఇలా రోజాపై పలు ఆరోపణలున్నాయి. వాటన్నింటితో పాటు నగరి నియోజకవర్గంలో ఆమె కుటుంబసభ్యుల దందాలపై విచారణ కోసం అప్పట్లో టీడీపీ, జనసేన పెద్ద ఎత్తున డిమాండ్ చేశాయి.
Also Read : Vijayasai Reddy: వ్యవ‘సాయం’ మాటేంటి? విజయసాయిరెడ్డి కొత్త పల్లవి వెనుక
ఓ వైపు కేసులు పెడతారనే భయం, మరో వైపు నగరి వైసీపీ ఇంచార్జీ పదవి పోతుందనే ఆందోళనతో రోజా తీవ్ర మనస్థాపానికి గురైనట్లు ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే ఓ IAS అధికారి హామి0తో అమె ప్రశాంతంగా ఉందంట. ఏపీ CMO లో కీలకంగా ఉన్న సదరు అధికారి రోజాకు హామీ ఇచ్చారంట. కేసుల భయం లేకుండా చూస్తాను, అన్నీ నేను చూసుకుంటాను, మీరు సైలెంట్ గా ఉండండి అని చెప్పారట. అందుకే రోజా గత కొంత కాలంగా ఎక్కడా నోరు విప్పడం లేదంట. రోజాకి సదరు అధికారి భరోసా ఇచ్చిన విషయం బయటకు పోక్కడంతో మంత్రులు చాలా సీరియస్‌గా ఉన్నారంట. తాము చట్టసభల్లో చెప్పినదాని కంటే IAS పెత్తనం ఎక్కువయిందా అంటు తోటి సహాచరుల వద్ద అగ్రహం వ్యక్తం చేస్తున్నారట. చూడాలి మరి.. రానున్న రోజుల్లో రోజా భవితవ్యం ఏం కానుందో.